Tuesday, April 21, 2009

వంకాయ టోమాటో కూర



::కావలసినవి::


వంకాయ 1/2 కిలో

ఆనియన్ 2


కారం పొడి 1/2 స్పూన్


టోమాటో 3

గరం మసాల పౌడర్ 11/2 స్పూన్స్

జీర 1 టీ స్పూన్

కోత్తమిర సన్నగా తరిగినది 1 కట్ట

నూనే 1 గరిటెడు


::చేసే విధానం::

ముందు వంకాయలు బాగా కడిగి
మీకు కావలసిన షేపు లో కట్ చేసుకొని
ఉప్పు నీటి లో వేసి వుంచవలెను.

ష్టవ్ పై మూకుడు వుంచి అందులో నూనే వేసి కాగిన తరువాత
జీర,కరెపాక్,వేసి అందులోనే తరిగిన ఆనియన్ వేసి దోరగా వేయించాలి.

దొరగా వేగిన తరువాత అందులో గరం మసాల,కారం పొడి, వేసి, అందులోనే టోమాటో వేసి

టోమాటో సగం వుడికినాక వంకాయలు,ఉప్పు పసుపు,వేసి
ఒక మారు అంతా కలయ బెట్టి 5 నిముషాలు ఉడికాక కొత్తమిర
వేసి వేడి వేడి గా వడ్డించడమే..ఇది చపాతికీ,
వేడి వేడి అన్నానికీ బాగుంటుంది.

!! మీకు తెలుసా ? !!



దోసెలపిండి రుబ్బేటప్పుడు ఒక కప్పుడు సగ్గుబియ్యం వేసి

రుబ్బితే దోసెలు విరక్కుండ చిరక్కుండా పల్చగా వస్తాయి
!


బియ్యానికి కొంచం మెంతులు వేసి రుబ్బితే అట్లు గట్టిగా వస్తాయి. !

!! మీకు తెలుసా ? !!


బియ్యంలో మట్టి గడ్డలు ఎక్కువగా వుంటే

చారెడు ఉప్పువేసి 10 నిముషాలు నాననిస్తే

మట్టిగడ్డలు నీళ్ళల్లో ఇట్టే కరిగిపోతాయి
!

నువ్వు వంకాయ



::కావలసినవి::

తాజా వంకాయలు 1/2 కిలో


శెనగపప్పు 3 టేబల్ స్పూన్స్


నువ్వులు 2 టేబల్ స్పూన్స్


ఎండుమిర్చి 5


జీలకర్ర 1 టేబల్ స్పూన్


మెంతులు 1/4 టేబల్ స్పూన్


ధనియాలు 3 టేబల్ స్పూన్స్


పసుపు 2 చిటికెలు


కొత్తిమిర సన్నగా తరిగినది 3 టేబల్ స్పూన్స్


ఉప్పు తగినంత


నూనె 4 టేబల్ స్పూన్స్


::చేసే విధానం::

వంకాయలు,నూనె,తప్ప మిగతా వస్తువులు అన్ని కొద్దిగా నూనే వేసి వేపి
బరకగా పొడి చేసుకోవాలి.

వంకాయలు నాలుగు వైపులా కోసి ఉప్పునీళ్ళలో వేసి ఉంచుకోవాలి.

వంకాయలలో కొద్దిగా మసాలా పొడిని కూరి పెట్టుకోవాలి.

నూనె వేడి చేసి ఈ కూరిన వంకాయలను వేసి మూత పెట్టాలి.

నిదానంగా చిన్న మంటపై మగ్గనివ్వాలి.

అవి సగం మగ్గిన తర్వాత మిగతా పొడి కూడా కలిపి మళ్ళి మూత పెట్టి
నూనెలోనే ఉడకనివ్వాలి. చివరలో కొత్తిమిర చల్లి దింపేయాలి.

కావాలంటే ఎండు కొబ్బెర చల్లితే రుచి ఎక్కువ.
ఎవరైన వచ్చినప్పుడు కొబ్బెర వేసి చేస్తే బాగుంటుంది :)

వెరైటీ వంకాయ కూర



::కావలసినవి::

తాజా వంకాయలు 1/2 కిలో

(పోపుగింజలు 1 టేబల్ స్పూన్
ఆవాలు,మినపప్పు,చనగపప్పు,
జిలకర్ర,ఎండుమిర్చి.)

పుట్నాల పోడి 2 టేబల్ స్పూన్స్

చింతపండు జ్యూస్ 1 టేబల్ స్పూన్

ఎండు కొబ్బెర కోరినది 2 టేబల్ స్పూన్స్

రుచికి ఉప్పు,చిటికెడు పసుపు.

చిటికెడు ఇంగువ

నూనే:: 1 గరిటెడు

గ్రీన్ చిల్లి 2

కరేపాక్ 2 రెబ్బలు

కోత్తమిర తరిగినది 1 కట్ట


::చేసే విధానం::

( ఈ కూర ఉడికించేముందు 2 నిముషాలే ప్లేట్ మూయాలి
తరువాత మూయకుండగనే వంకాల్ని ఉడికించాలి.
ముక్కలు విరకుండగా,ముద్ద కాకుండగా వస్తుంది.)


ముందు వంకాయలు బాగా కడిగి
చిటికిన వేలంత పోడవుగా ముక్కల్ని చేసికోవాలి.

మూకుడులో నూనె వేసి వేడిచేసి అందులో పోపుగింజలు వేసి
అవి దోరగా వేగాక అందులో ఇంగువ,పసుపు,

చీలికలు చేసిన గ్రీన్ చిల్లీ,కరేపాకు వేసి
అవి కాస్త వేగనిచ్చి అందులో వంకాయ ముక్కలు వేయాలి.

వంకాయ ముక్కలపై ఉప్పు వేసి 5 నిముషాలు వేగనిచ్చి
వాటిపై చింతపండుజ్యూస్ వేసి
బాగాకలిపి 5 నిముషాలు వుడకనివ్వండి.


ఉప్పు,చింతపండు రసం ముక్కలకు బాగా పట్టాలి.

వుడికిన వంకాయ కూరపై పుట్నాల పౌడర్,కొబ్బెర కోరు
వేసి బాగా కలిపి 2 నిముషాలు అట్టే వుంచండి.

కర కర లాడే వంకాయ కూర రెడీ ఈ కూర చపాతికి
వేడి వేడి అన్నానికీ భలే రుచి :)