Sunday, April 28, 2013

వాము ఆకుల పచ్చడి



















కావలసినవి::

వాము ఆకు:::::: 2 కప్పులు (తరిగినది) 
పచ్చిమిర్చి::::::: 2 
చనగపప్పు:::::: 1 1/2 టీస్పూన్
మినపప్పు::::::: 1 టీస్పూన్
జిలకర్ర:::::::::::  1/3 టీస్పూన్
ఎండుమిర్చి:::::: 4
చింతపండు::::::: 2 టీస్పూన్స్ 
ఆవాలు::::::::::: 1/2 టీస్పూన్
నూనె::::::::::::: 4 టీస్పూన్స్ 
బెల్లము::::::::::  1/2 టీస్పూన్
ఒక పించ్ ఇంగువ
కరివేపాకు ఒక రెబ్బ. 
ఉప్పు,పసుపు..తగినంత

  
చేసే విధానం::

stove పై పాన్ పెట్టి అందులో కొద్దిగ నూనె వేసి 

ఆ నూనెలొ శనగపప్పు...మినపప్పు...ఆవాలు...జిలకర్ర...
ఎండిమిర్చి 2...పచ్చి మిర్చి 2...చింతపండు...

అన్నీ దొరగ వేయించి పక్కన ప్లేట్ లో వేసి ఉంచండి .

అదే పాన్ లో  కొద్దిక నూనె వేసి ఈ తరిగి ఉంచిన వాము ఆకును వేసి
2 నిముషాలు వేయించి ఈ ప్లేట్ లో వుంచినవి ఈ వామాకు  చింతపండు 
ఉప్పు,పసుపు బెల్లం, వేసి మిక్సి లో గ్రైండ్ చేయండి.

ఆ పాన్ లోనే మరికాస్త నూనె వేసి...వేడి అయిన తరువాత అందులో 

శనగపప్పు...మినపప్పు...జిలకర్ర...ఆవాలు...వేసి ఆవాలు చిటపటా అన్నప్పుడు..

ఎండుమిర్చి 2 చిన్న ముక్కలుగా చేసి వేసి కరివేపాకు కూడావేసి ష్టవ్ కట్టేయడమే

ఈ తాలింపు చట్ని లో కలిపి తింటే ఆహా ఏమిరుచి అనక మానరు :)

మరి మీరు రెడియేనా? 

ఈ వామాకుతో మరిన్ని వంటకాలు మీముందు ఉంచుతాను

Saturday, April 27, 2013

ఆపిల్స్ తో పచ్చడి


















కావలసినవి::

2:: ఆపిల్స్  ముక్కలు చేసి ఉంచండి

15: పచ్చి మిర్చి.

పచ్చికొబ్బర  2  టేబల్‌స్పూన్స్.

జిలకర్ర  1/2  టీస్పూన్

ఉప్పు,పసుపు,తగినంత


పోపు దినుసులు::

ఆవాలు...చనగపప్పు...మినపప్పు...జిలకర్ర...ఎండుమిర్చి...
నూనె ఒక స్పూన్....ఒక పించ్ ఇంగువ...కరివేపాకు ఒక రెబ్బ.   
{ అన్నీ కలిపి ఒక టేబల్‌స్పూన్ ఉండాలి  }
ముందు పైన చెప్పినవన్నీ మిక్సిలో వేసి బాగా గ్రైండ్ చేసి 
ఒక బౌలో వేసి ఉంచండి.

ఆ తరువాత ష్టవ్ పై బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి

నూనె కాగాక పొపు దినిసులన్నీ వేసి చివర్లో ఇంగువ కరివేపాకు వేసి

అన్ని దోరగా వేగిన తరువాత ఈ చేసి ఉంచిన పచ్చడిలో కలపండి

ఘుమ ఘుమ లాడే ఆపిల్ పచ్చడి రెడి :) 

Friday, April 26, 2013

ఓట్స్ దోసలు























కావలసినవి::

ఓట్స్:::: ఒకటిన్నర కప్....
పచ్చిమిర్చి 4....
ఆనియన్ 2 ....
జిలకర్ర 1/2 టీస్పూన్
 ఉప్పు తగినంత....
కొత్తిమీర సన్నగా కట్ చెసినది ఒకటిన్నర టేబల్‌స్పూన్....
నూనె 2 టేబల్‌స్పూన్.....
అల్లం  1/2  టేబల్‌స్పూన్...

(పుల్ల పెరుగు లేక మజ్జిగ ఐనా ఒకే ) 1/2 కప్ .


చేసేవిధానము::











ముందు ఓట్స్ ని ఒక బౌల్లో వేసి అందులో పెరుగు నీళ్ళు కలిపి

మన దోసపిండిలా జారుగా చేసి ఓ అరగంట నాననివ్వండి.

ఆ తరువాత పచ్చిమిర్చి....ఆనియన్....కొత్తిమీర....అల్లం ముక్కలు...అన్నీ సన్నగా తరిగి

ఈ దోసపిండి బౌల్లో వేయండి, .... దానితో పాటు జిలకర్ర....ఉప్పు....వేసి












బాగా కలిపి....దోసపెన్నం ష్టవ్ పై పెట్టి పెన్నం వేడి అయిన తరువాత

పెన్నానికి నూనె రాసి....దోసపిండి పాన్ పై వేసి...

పాన్ పై ఉన్న దోసపిండిపై నూనె కొద్దిగ వేసి...అటు ఇటు బాగా దోరగా కాల్చి

దోసలు చేయటమే...కమ్మగా....పుల్ల పుల్లగా....ఉండే ఓట్స్ దోసలు....రెడి 







Tuesday, April 23, 2013

కొత్తిమీర పచ్చడి















కొత్తిమీర పచ్చడి

ఈ కొత్తిమీర పచ్చడి 20 రోజులు నిలువ వుంటుంది. 
  

కావలిసినవి:: 

కొత్తిమీర::::::::::::  1 కట్ట పెద్దది
ఎండుమిర్చి::::::::  12 
చింతపండుగుజ్జు:::  4 టేబల్‌స్పూన్స్

తాలింపు గింజలు::  

శనగ పప్పు::::::   2 టీస్పూన్ 
మినపపప్పు::::::  1 టీస్పూన్
ఆవాలు:::::::::::   1/3 టీస్పూన్ 
జీలకర్ర::::::::::::   1/ 3 టీస్పూన్
నూనె:::::::::::::   5 టేబల్‌స్పూన్స్ 
ఇంగువ:::::::::::  1/2టీస్పూన్
ఎండుమిర్చి::::::  
పసుపు..తగినంత
ఉప్పు..తగినంత 


పచ్చడి చేసే విధానము::

కొత్తిమీర  కడిగి చిల్లుల గిన్నలో  వేసి బాగా కడగాలి.   
తరువాత మిక్సీ జార్ లో , కొత్తిమీర ,
ఉప్పు..ఎండుమిర్చి..చింతపండు గుజ్జు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచండి.   

stove మీద పాన్ పెట్టి తగినంత నూనె వేసుకొని నూనె కాగినాక,
తాళింపు గింజలు ఎండుమిర్చి ఇంగువాతో పోపు పెట్టి,

ఈ గ్రైండ్ చేసి ఉంచిన పచ్చడి పోపు లో వేసి 5 నిముషాలు
సన్నటి మంటపై వేగనిచ్చి stove  కట్టేయండి.

టైట్ గా  మూత ఉన్న జార్ తీసుకొని అందులో వేసి ఉంచండి

20 రోజులవరకూ చెడిపోకుండా ఉంటుంది( నీళ్ళు తగలనివ్వకండి)

ఈ పచ్చడి వేడి వేడి అన్నానికిగాని..చపాతి,దోస,ఉప్మా..అన్నింటికీ బాగుంటుంది

మరి మీరు రెడినా? 


Sunday, April 14, 2013

మీకు రాత్రి నిద్దర పట్టటం లేదా?

















మీకు రాత్రి నిద్దర పట్టటం లేదా?

(పడుకొనే ముందు కొబ్బరి నూనెతో కాని , ఆముదం నూనెతో కాని 
అరికాళ్ళకు రాసి మర్ధన చేస్తే బాగా సుఖమైన నిద్ర పడుతుంది) 

మామిడికాయ ఊరగాయ (Pickle - పికల్)





మామిడికాయలు:: 2
ఆవాలపొడి::::::::: 3 టేబల్‌స్పూన్
మెంతులపొడి:::::: 2 టేబల్‌స్పూన్
ఎండుకారంపొడి:::: 3 టేబల్‌స్పూన్
ఉప్పు::::::::::::::  3 టేబల్‌స్పూన్
పసుపు:::::::::::: 1/2 టీస్పూన్

పోపుకు కావలసినవి::

ఆవాలు:::::::::::  1 టీస్పూన్ 
ఎండుమిర్చి::::::: 4
వెల్లుల్లి దబ్బలు::: 6
ఇంగువ:::::: తగినంత

కరివేపాకు రెండు రెమ్మలు

ముందు మాంచి మామిడికాయలు తీసుకొని 
వాటిని బాగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని 
ఆ ముక్కలను ఎండలో ఓ గంట ఎండబెట్టాలి. 

ఆవాలు..మెంతులు, దోరగా నూనె వేయకుండగ వేయించుకొని
విడి విడిగా పొడి చేసి ఉంచుకొండి.

ముక్కలు చేసి ఉంచిన మామిడికాయల్లో
ఈ ఆవపొడి,మెంతిపొడి,ఎండుమిర్చిపొడి,
ఉప్పు పసుపు వేసి, అన్ని కలిసిపోయేలా బాగా కలిపి

అందులో పోపు వేసి..వేడి..వేడి అన్నానికి కలుపుకొని తింటే
వావ్ అనకుండ ఉండలేరు..మీరూ Try చేసి చూడండి      

{వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటేలేదు}  

మామిడి కాయ ఇడ్లిపిండి పునుగులు






















మామిడికాయ తురుము..1/2 కప్పు
ఇడ్లి పిండి........................2 కప్పులు
జిలకర............................1/3 టీస్పూన్ 
పచ్చిమిర్చి......................4  
కరివేపాకు........................2 రెబ్బలు
కొత్తమీర..........................1 టేబల్‌స్పూన్ తరిగినది
వంటసోడ.........................1/4 టీస్పూన్ 
 నూనె..............................వేయించేందుకు కావలసినంత 
ఉప్పు తగినంత


మిగిలి పోయిన ఇడ్లిపిండికానివ్వండి..లేక ఫ్రేష్‌గా ఉన్న ఇడ్లిపిండైనా ఒకే 
(పిండి పుల్లగా ఉండకూడదు) 

అందులో పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకొని..
{కారం ఎక్కువకావాలన్నా,తక్కువ కావాలన్నా మీరు చూసుకొని వేసుకోవచ్చు}

కరివేపాకుని,కొత్తమీరని సన్నగా తరిగి వేసి.. 
మామిడి తురుము,జిలకర్ర,వంటసోడ,ఉప్పు,వేసి బాగాకలిపి 

కాగుతున్న నూనెలో ఈ పిండిని పునుగులుగా వేసి దోరగా వేయించిన తరువాత
చిల్లుల గరిటతో తీసి వేడి వేడి గా వడ్డించవచ్చు..

10: నిముషల్లో అయిపోయే ఈ స్నాక్ ఇడ్లి పిండి మిగిలినప్పుడు కాని 

లేక ఫ్రేష్‌గా కాని చేసుకోవచ్చును

మరి మీరూ ఈ మామిడికాయ పునుగులు చేసి రుచి చూస్తారా?
(ఇడ్లిపిండి ఎక్కువ జారుగా ఉంటే  కాస్త మైదాపిండి కలుపుకోవచ్చు ) 

******************************************************************************