Monday, March 30, 2009

Sreeraama navami శ్రీరామనవమి సందర్భంగా చేసే వడపప్పు పానకం





శ్రీరామనవమి సందర్భంగా చేసే వడపప్పు పానకం
1)!! చేసే పద్ధతి !!
నీళ్ళు---1 లీ
బెల్లం--(jaggery)150 గ్రాం
మిరియాలపౌడర్--1/2 టీ స్పూన్
ఇలాచి పౌడర్--1టీ స్పూన్
నిమ్మజ్యూస్ --1 టేబల్ స్పూన్

!! చేసే విధానం!!
ఒక పాత్రకు తడిగుడ్డ చుట్టి అందులో
నీళ్ళు,తక్కినవన్నీ కలిపి దేవునికి నైవేద్యం పెట్టడమే
కాసేపు fridge లో పెడితే చల్లగా వుంటుంది.
fridge లేనివారు పాత్రకి తడిగుడ్డ చుట్టి వుంచితే
ఒక గంటకి చల్లటి పానకం రెడి అవుతుంది
:)

2)ఇలా కాక పోయినా పానకం సింపల్ గా చేసుకోవచ్చు
బెల్లం--1 కప్పు
ఇలాచిపొడి--1 టీస్పూన్
బెల్లం నీళ్ళలో నానబెట్టి వడకట్టి అందులో ఇలాచి పొడి కలపాలి
.

3)ఇలాగే పంచదార(చక్కర,sugar)తో కూడ చేయ వచ్చు:)
పైవిధంగా ఇలాచిపౌడర్,నిమ్మజ్యూస్,పెప్పర్,వేసిచేస్తే
మాంచి రుచి ఈ నవమి పానకం
:)
!! వడపప్పు !!
పెసరపప్పు -1 కప్పు
ఉప్పు చిటికెడు
పచ్చిమిర్చి తురుము--1/2 టీస్పూన్
కొత్తిమిర తురుము--1 టేబల్స్పూన్
దోసకాయ ముక్కలు సన్నగ తరిగినవి.

పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో
ఉప్పు,పచ్చిమిర్చి తురుము,కొత్తిమిర తురుము,దోసకాయముక్కలు
వేసి కలపండి కమ్మగా వుంటుంది.మామిడికాయ తురుముకూడ వేస్తే
ఇంకా ఇంకా బాగుంటుంది. 2 స్పూన్స్ మామిడి తురుమువేస్తే చాలు.

మామూలుగా ఐతే పప్పు లో కాసింత ఉప్పు కారం మాత్రమె కలుపుతారు.
కొందరు ఇవికూడా కలపరు పచ్చి వడపప్పే నేవేద్యం పెడతారు.

అన్నీ పచ్చివే సుమా (నైవేద్యం తరువాత పోపుకూడ పెట్టవచ్చు)

Thursday, March 26, 2009

!!! ఉగాది పచ్చడి !!!



!! కావాల్సినవి!!
తగినన్ని మామిడి ముక్కలు
వేప పువ్వు--2 టీ స్పూన్స్
కొత్త చింతపండు --100 గ్రాముల
బెల్లం--30 గ్రాముల
టీ స్పూను కారం
తగినంత ఉప్పు
2--అరటిపండు ముక్కలు


!! తయారు చేసే విధానం !!

ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి.
ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి.
ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు,వేప పువ్వు,కారం,ఉప్పు కలపాలి.
ఆ తర్వాత దానికి బెల్లం,అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి రెడీ.
మరి మీరు ఉగాదికి సిద్ధం కాండి :)

Tuesday, March 17, 2009

!! మీకు తెలుసా??

తెల్లారి పరకడుపున ఒక చెంచెడు తేనే తీసుకొంటే
దగ్గు,కఫము,గొంతు రాపిడి,గరగరలాంటివన్ని
తగ్గిపోతాయి.సంగీతం నేర్చుకొనే వారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది
మరి మీరూ ఇలా తేనె స్వీకరించి మీగొంతును సవరించుకోని,
మీ గొంతు రాపిడిని తగ్గించుకోండి
.

గ్రీన్ రైస్ -- Green Rice

!! కావలసినవి !! సన్నబియ్యం --250గ్రా పచికొబ్బెర ఒక చిప్ప కొత్తిమీర కట్టలు -- 3 పచ్చిమిర్చి -- 6 గ్రీన్ పీస్ -- 1/2 కప్పు దాల్చిన చెక్క-- 4 ఏలకులు -- 4 తేజ్‌పత్రి -- 4 జీడిపప్పు -- 20 కిస్‌మిస్‌లు -- 10 ఉప్పు తగినంత నెయ్యి,డాల్డ,ఎదైన--1 కప్పు జీర -- 1 టేబల్ స్పూన్ !! చేసే విధానం !! ముందుగా బియ్యం కడిగి వడకట్టాలి. కొబ్బెర,మిర్చీ,కొత్తమిర,ఉప్పు,పసుపుతో అన్నీ గ్రైండ్ చేసి పేష్ట్ చేసి వుంచవలెను. సన్నటి సెగమీద కుక్కర్ వుంచి కొంచం నెయ్యి వేసి అందులో జీర,తేజ్‌పత్రీ,దాల్చిన చెక్క,జీడిపప్పు,కిస్‌మిస్ వేసి కాస్త వేయించి అందులోనే వడకట్టిన బియ్యం పోసి దోరగవేయించి అందులో అరలీటరు నీరుపోసి గ్రీన్ పీస్,మిగతా నెయ్యి,తయారుగా వున్న పేష్ట్,వేసి సన్నటి సెగ మీద వుంచాలి.అన్నీ కలయబెట్టి 3 విజిల్స్ వచ్చక ష్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తరువాత వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది. ప్లాన్ గా చేసుకొంటే 20 నిముషాల పని అంతే~~~ మీ టిఫిన్ బాక్స్ రెడీ

Monday, March 16, 2009

బెండకాయ పచ్చడి (Okra) chaTni

****************************************
మీకిది తెలుసా...పచ్చి బెండకాయలు
తెల్లారి పరకడుపున తింటే మలబద్దకం వున్న వాళ్ళకి
ఈజిగా జీర్ణం అవుతుందని గట్టిగా చెప్పగలను.

******************************************



!! కావలసినవి !!
బెండకాయలు -- 1/4 కిలో
డ్రై చిల్లీ --6
మినపప్పు -- 1,1/2 టేబల్ స్పూన్స్
ఆవాలు -- 1 టేబల్ స్పూన్
మెంతులు 1/4 టే స్పూన్
ఉప్పు తగినంత
ఇంగువ -- 2 చిటికెడు
చింతపండు జ్యూస్ -- 3 టేబల్ స్పూన్స్
నూనె -- 1 గరిటేడు
(పోపు గింజలు)
ఆవాలు,జీర.మినపప్పు,డ్రై చిల్లి--2
ఇంగువ కావాలంటే (చనగపప్పు)కొద్దిగ
అన్నీ...2 టేబల్ స్పూన్స్
కరేపాక్ ఒక రెబ్బ
::: చేసే విధానం :::
ముందు బెండకాయల్ని శుభ్రంగా కడిగి
గుడ్డతో తుడిచి కట్ చేసి వుంచండి
ష్టవ్ పై మూకుడు పెట్టు అందులో నూనె వేసి
సన్నటి సెగపై మినపప్పు,మెంతులు,ఆవాలు,డ్రై చిల్లీ
అన్నీ కొద్దిగ నూనె లో విడివిడిగా దోరగా వేయించి తీయండి.
మూకుడు లో మళ్ళి కొద్దిగ నూనె వేసి అందులో బెండకాయలు వేసి
బాగా వేగనివ్వాలి
.

గ్రైండర్ లో వేయించిన మినపప్పు,ఆవాలు,మెంతులు,డ్రై చిల్లీ,
వేగనిచ్చిన బెండకాయలూ(Okra), చింతపండు జ్యూస్,ఉప్పు,
అన్నీ బాగా మెత్తగా గ్రైడ్ చేసి తీసి చిన్న పాత్ర(vessel)
ల్లో వేసి మళ్ళి మూకుడులో నూనె వేసి అందులో పోపుగింజలన్నీ వేసి
దోరగా వేగ నిచ్చి డ్రై చిల్లి,కరేపాక్,వేసి ఆ పోపు ఈ పచ్చడిలో
కలిపి బాగా కలిపి సర్వ్ చేయండి వేడి వేడి అన్నానికి ఈ
పచ్చడి భలే రుచి :)

బెండకాయ వేపుడు -- (lady's fingeras) !!


!! బెండకాయ వేపుడు !!(lady's fingeras) !!

బెండకాయ వేపుడంటే అందరికీ తెలిసినదే
కాని అది చేసే విధానానంలోనే వుంది రుచి అంతా
ఎవ్వరైనాసరె రెండుముద్దలు ఎక్కువ తినితీరాల్సిందే..
మీకూ తెలిసే వుంటుంది బెండకాయల్ని ఎలా చేయాలన్నది
కాని వాటిని వేయించే దానిలోనే వుంది చిట్కా అంతా
కాస్త టైం తీసుకొని ఓపిగ్గా చేస్తే భలే భలే రుచి ఈ వేపుడు.
మరి మీరూ ఇలా చేసి మీ అత్తగారినుండి,మీ భర్త గారినుండి
మెప్పులు పొందాలనుకొంటున్నారా ఆలస్యం దేనికీ ప్రోసీడ్ కాండీ :)


!! కావలసినవి !!

బెండకాయలు -- 1/2 కిలో
డ్రై చిల్లీ పౌడర్ --1/2 టేబల్ స్పూన్
ఉప్పు తగినంత
చింత పండు జ్యూస్ -- 1/2 టేబల్ స్పూన్
వెల్లుల్లి పాయలు -- 6
నూనె -- వేపుడికి తగినంత


::: చేసే విధానం :::

ముందు బెండకాయల్ని శుభ్రంగా కడిగి
గుడ్డాతో తుడిచి మీకు కావలసిన షేపులో కట్ చేసి వుంచండి
ష్టవ్ పై మూకుడు పెట్టు అందులో నూనె వేసి
సన్నటి సెగపై వెల్లుల్లి వేయించి అందులోనే
తరిగిన బెండకాయల్ని వేసి ఉప్పు జల్లి
అటు ఇటు కలయబెట్టి 5 నిముషాలు వరకు
కాస్త మూత మూసి పెట్టండి.
తరువాత మూత తీసి అందులో చింతపండు జ్యూస్ చల్లి
మూత మూయకుండగ అటు ఇటు వేపుతు
10నిమిషాలు సన్నటి సెగపై వేయించాలి.
కాస్త దోరగా వేగిందని తెలిసాక అందులో కారంపొడి చల్లి
అటు ఇటు జాలి గరిటతో తిప్పుతూ కారం అంతా కలిసేటట్లు చేయాలి.
ష్టవ్ ఆఫ్ చేసి 5 నిముషాలు మూత మూయకండగ
వుంచితే వేపుడు కర కర లాడుతూ కమ్మగా రుచిగా వుంటుంది
మరి మీరూ ట్రై చేస్తారా ?