Wednesday, April 22, 2009

!! మీకు తెలుసా? !!


మునగాకు తీయాలంటే ఎవరికైనా తలనొప్పే

కాని దానికి ఒక చిట్కా వుంది ...చెప్ప మంటారా ?

సరే చెపుతా...మునగాకును చిన్న చిన్న రెమ్మలుగా త్రెంచి

పోలిథిన్ కవర్ లో వుంచి దాన్ని కుక్కర్ లో పెట్టి గాలిచోరకుండా

మూత పెట్టాలి...మర్నాడుదయం పళ్ళెం లో గుమ్మరిస్తే

చాలా విచిత్రంగా ఆకులన్నీ విడిపోయి వుంటాయి మనకూ పని తక్కువ.

!! మీకు తెలుసా? !!


ఖాళీ మూకుడులో కాస్తంత ఉప్పు వేసి బ్రౌన్‌కలర్
వచ్చే వరకు వేగనిచ్చి తీసివేసి
తర్వాత ఆ మూకుడులో ఏమి వండినా నాన్‌ష్టిక్ మూకుడులా పని చేస్తుంది.

పుట్ట్నాల పొడి -- (Gun Powder )



పుట్ట్నాలు
(roasted chickpeas) 2 కప్స్

డ్రై చిల్లీ~~25 గ్రా
(డ్రై చిల్లి మెత్తగా వుంటే కాస్త వేడి చేస్తే బాగా నలుగుతుంది)

డ్రై కోకోనట్ పౌడర్ 1/2 కప్

ఉప్పు తగినంత

అన్నీ మెత్తగా పౌడర్ చేయడమే

( కావలసిన వారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు)

ఈ పుట్ట్నాల పౌడర్ కూరలకు,అన్నానికీ,ఇడ్లికీ,దోసకూ

భలే భలే రుచి :)