ఈ వంటకం కూడా కర్నటక వాళ్ళు ఎక్కువగా చేసుకొనే ఐటం. బెండకాయ తో కాని...కాకరకాయ...సొర్రకాయ...తెల్లగుమ్మడికాయ తొ కాని ఈ కూటు చేసుకోవచ్చు ఈ గొజ్జు---చపతికి కాని---వేడి వేడి అన్నానికి కాని దోస కాని మహా మహా రుచిగా ఉంటుంది---మరి మనము నేర్చుకొందామా గొజ్జుకు కావలసినవి బెండకాయలు-----1/4 కిలో పచ్చిమిర్చి----4 కరేపాకు--కొత్తమీరి--ఉప్పు--పసుపు. తగినంత చిన్న గొలికాయంత jaggery బెల్లం ) నూనె.......4..టేబల్‌స్పూన్స్ చింతపండు గొజ్జు---చిన్న కప్పులో సగం. తాలింపుకు కావలసినవి::- ఇంగువ..ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి 2 మసాలకు కావలసిన ఐటమ్స్::= శనగపప్పు..............2......టేబల్‌స్పూన్ మినపప్పు...............2.....టేబల్‌స్పూన్ నువ్వులు.................2....టేబల్‌స్పూన్ ధనియాలు...............1.....టీస్పూన్ ఎండుమిర్చి..............8 కొద్దిగ బియ్యం...........1.....టీస్పూన్ పచ్చి కొబ్బర తురుము...1/2 కప్ గొజ్జు చేసే విధానం::- ముందు బెండకాయలు కడిగి నీళ్ళు లేకుండ తుడిచి మీకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొండి. ష్టవ్ వెలిగించి ష్టవ్ పై పాన్ ఉంచి 2..స్పూన్స్ నూనె వేసి దొరగా వేయించి ఉంచండి. అదే పాన్ లో మసాల ఐటమ్స్ అన్నీ వేయించుకొని పౌడర్ చేసి ఉంచండి. అదే పాన్లో చింతపండు గొజ్జు...బెల్లం...పసుపు...ఉప్పు...కరేపాకు...కొత్తమీర వేసి చింతపండు పచ్చి వాసన పోయెంత వరకు ఉడికించండి. ఉడికిన గొజ్జులో 2 గ్లాసుల నీళ్ళుపోసి మసాల పౌడర్ 3స్పూన్స్ వేసి బాగా వుడికించండి. (చిక్కగా అనిపిస్తే మరికాస్త నీళ్ళుపోసుకోవచ్చు.) బాగా వుడికిన తరువాత ఘుమ ఘుమ వాసన వస్తుంది అప్పుడు ఆవాలు జిలకర్ర ఎండుమిర్చి ఇంగువతో పోపు పెట్టి గొజ్జులో వేసి కలపడమే.....ఘుమ ఘుమ లాడే బెండకాయ గొజ్జు రెడి.
హేయ్ Friends ఇవాళ నేను చేసే ఐటం "వెజి సాగూ చెప్పాలంటే ఈ ఐటం కర్నాటక వాళ్ళు ఎక్కువగా చేసుకొంటారు
ఈ సాగు అన్ని వెజిటబల్స్ తో కలిపి చేయోచ్చు,ఒక్క వెజి తో కూడ చేయోచ్చు
ఈ ఐటం చపాతికి ఇడ్లికి వేడి వేడి అన్నానికి మహా రుచిగా ఉంటుంది మరి ఎలా చేయాలో తెలుసు కొందామా సాగు కావలసినవి::- క్యారేట్, పొటాటో, క్యాప్సికం, కాలిఫ్లవర్ఆనియన్ఒకటి, సీమవంకాయ, బీన్స్-----వీటిలొ ఏవి ఉన్నా ఈ సాగు చేయొచ్చు అన్ని వెజిటేబల్స్ కలిపి కూడ చేయోచ్చు నిమ్మకాయ......1 మసాల ఐటమ్స్::- ఆనియన్స్--------1 (Cinnamon)చెక్క---------------చిన్న ముక్క (Clove)----మొగ్గ------------------4 పచ్చికొబ్బర తురుము----------------1/2--కప్ ధనియాలు-----------------------------1--టేబల్‌స్పూన్ (roasted channa)పుట్నాలు--------- 2--టేబల్‌స్పూన్ పచ్చిమిర్చి------------------------------5 (Poppy Seeds) గసగసాలు------------3--టేబల్‌స్పూన్ చిన్న ముక్క అల్లం కరేపాకు..కొత్తిమీర తగినంత ఉప్పు పసుపు తగినంత నూనె------------------------1/2---టేబల్‌స్పూన్
సాగు చేసే విధానం::- ముందు వెజిటబల్స్ నీళ్ళతో బాగా కడిగి. మీకు కావలసిన రీతిలో కట్‌చేసి ఉంచంది. ఆనియన్ కూడా కట్‌చేసి వుంచంది ఇప్పుడు ష్టవ్ పై పన్ ఉంచి పన్ వేడెక్కిన తరువాత అందులొ ఆఫ్ స్పూన్ నూనె వేసి మసాల ఐటమ్స్ అన్ని దోరగా వేయించు కొవాలి. వేయించిన మసాలను గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అదే పాన్ లో మళ్ళి కాస్త నూనె వేసి అందులో కాస్త జిలకర్ర వేసి జిలకర్ర వేగాక అందులో ఆనియన్ ముక్కలు వేసి కాస్త దోరగా వేయించి కట్ చేసి ఉంచిన కూరగాయలన్నీ అందులో వేసి ఒక గ్లాసు నీళ్ళుపోసి ఉప్పు,పసుపు,వేసి మూత పెట్టి ఓ 10 నిముషాలు ఉడక నివ్వండి . కాయ కాస్త మెత్తపడ్డక ఈ మసాల ముద్దను ఉడికిన కాయగూరల్లో కలిపి ఓ 5 నిముషాలు మళ్ళి ఉడికించండి. చివర్లో నిమ్మకాయ పిండితే మంచి రుచిగా ఉంటుంది బాగా ఉడికిన సాగుపై కొత్తమీర వేసి సర్వ్ చేయండి... ఘుమ..ఘుమ..లాడే సాగు చపాతికి..వేడి వేడి అన్నానికి నంజుకొని తింటే నా సామిరంగా..మళ్ళి చేయవూ అని అడక్కపోరు మీవాళ్ళు :)) మరి మీకు నే చేసిన సాగు నచ్చితే చిన్న కామెంట్ రాయండీ