Saturday, May 02, 2009
సొరకాయ నూపప్పు వేసి కూర
సొరకాయలు -- 2
!! పోపుకు కవలసినవి !!
ఎండు మిర్చి , పచ్చి మిర్చి , రెండుకలిసి 3
మినపప్పు -- 1/4 టేబల్ స్పూన్
శనగపప్పు -- 1/4 టేబల్ స్పూన్
ఆవాలు -- 1/2 టీ స్పూన్
ఇంగువ -- చిటికెడు
కరివెపాకు -- 2 రెబ్బలు
!! నూపప్పు పొడికి కావలసినవి !!
నూపప్పు -- 4 -- టేబల్ స్పూన్స్
జిలకర్ర -- 1 టీ స్పూన్
ఎండు మిర్చి -- 2
ఈ మూడు కొద్దిగ నూనె వేసి వెయించి పొడి చేసుకోవాలి.
సొరకాయలు చిన్న ముక్కలుగా కొసి ఉడికించి ఉంచుకొవాలి.
కొద్దిగా పాన్ లో నూనె వేసి పోపుగింజలు వేసి చిటపతలాడిన తర్వాత
ఉడికించిన సొరకాయ ముక్కలు అందులో వేసి కొంచెం సేపు వేయించాలి.
చివర్లో చేసుకున్న నూపప్పు పొడి వేసి ఒక ఐదు నిముషాలు ఉంచి దించేసుకోవాలి.
ఇది నా Friend చేసింది రుచి చూసి నేను చేసా
చాలా బాగుంటుంది మీరూ చేసుకోండి .:)
Friday, May 01, 2009
స్వీట్ శ్రీఖడ్ (Shrikhand)
~*~*~ స్వీట్ శ్రీఖడ్ ~*~*~
5 మినిట్స్ లో తయారయ్యే ఈ ఐటం
microwave వుంటేనే 5 మినిట్స్ లో అయ్యేది
1 మిల్క్ మేడ్ టిన్, -- 2 స్పూన్స్ పెరుగు, -- 3 స్పూన్స్ నెయ్యి,
6 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్, -- అన్నీ కలిపి microwave vessels
పెట్టి 5 మినిట్స్ ఆన్ చేయడమే......
శ్రీఖడ్ తయార్....
పన్నీరు -- బ్రెడ్ తో ఐటం(Bread & Paneer)
పన్నీరు -- బ్రెడ్ తో ఐటం
మీ ఇంట్లో పన్నీరు,మిగిలిపోయిన బ్రెడ్ వుంటే
వాటిని 3 నిముషాలు కాస్త వేడి నీటిలో వుంచి
తీసి మెత్తగ చేసి వుంచండి.అందులో 2 స్పూన్స్
మైదా,పచ్చిమిర్చి,కరేపాకు,కొత్తమిర,
ఆనియన్స్ సన్నటి ముక్కలు చేసి వేసి వడలుగా
నూనేలో వేయించి,coffee తో సర్వ్ చేయండి.
10 నిముషాల్లో అయ్యే ఈ ఐటం భలే రుచిగా వుంటుంది
Thursday, April 30, 2009
~*~ మీకు తెలుసా??? ~*~
మిగిలిపోయిన బ్రెడ్ పారేయకండి
మిగిలిపోయిన బ్రెడ్ పారేయక దాన్ని దోరగా వేయించి
దానిపై వెన్నరాసి చాట్ మసాల వేసుకొని తింటే
చాలా బాగుంటుంది.
~*~ మీకు తెలుసా??? ~*~
పెరుగు పులిసిపోతే???
పెరుగు బాగా పులిసిపోయినట్లయితే...అందులో కొంచెం నీరు ఎక్కువగా పోసి,చిలికి,
కాస్త మినపప్పు వెయించి పొడిచేసి మజ్జిగలో కలిపి
పచ్చిమిర్చి1,ఎండుమిర్చి 1,కరేపాకు,కొత్తమిరతో పోపుపెట్టండి.
చక్కటి రుచికరమైన మజ్జిగచారు రెడి :)
పెరుగు బాగా పులిసిపోయినట్లయితే...అందులో కొంచెం నీరు ఎక్కువగా పోసి,చిలికి,
కాస్త మినపప్పు వెయించి పొడిచేసి మజ్జిగలో కలిపి
పచ్చిమిర్చి1,ఎండుమిర్చి 1,కరేపాకు,కొత్తమిరతో పోపుపెట్టండి.
చక్కటి రుచికరమైన మజ్జిగచారు రెడి :)
Wednesday, April 29, 2009
మినప పొట్టుతో వడియాలు--(Urad Pappad)
!! కావలసినవి !!
మినపప్పు -- 1 కప్పు
మినప పొట్టు -- 3 కప్పులు
జీర -- 1/2 టేబల్‌స్పూన్
ఇంగువ -- 1/4 టీ స్పూన్
పచ్చిమిర్చి -- 12
ఉప్పు తగినంత
!! తయారుచేసే విధానము !!
ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి.
తరవాత మినప పొట్టు,ఉప్పు,పచ్చిమిర్చి,జిలకర్ర,ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు పోసి (బరకగా)రుబ్బాలి.
మినప వడియాల మాదిరిగానే ప్లాస్టిక్ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి.
నూనెలో వేయించి తీస్తే మాంచి వాసనతో ఘుమఘుమలాడుతూ వుంటాయి.
కరకరలాడే వీటిని వేడి వేడి అన్నంలో నేతిలో కలుపుకుని తింటే చాలా బాగుంటాయి.
మరి మీరూ చేసి రుచి చూస్తారా ? ....ఈ ఐటం విజయవాడ..వైజాగ్ వారికి ఇష్టమైన వంటకం :)
~*~ స్పెషల్ వడ ~*~
!! కావలసినవి !!
కందిపప్పు (Bengal gram dal) -- 1/2 కప్
మినపప్పు (Tuar dal) -- 1/2 కప్
జీర -- 1/2 టేబల్‌స్పూన్
డ్రైచిల్లీ -- 6
ఉల్లిపాయలు -- (onions) -- 1/2 కప్
కరేపాక్ 20 ఆకులు
ఉప్పు రుచికి తగినంత
నూనే -- (Oil) -- వేయించేందుకు తగినంత
!! చేసే విధానము !!
ముందు కందిపప్పు,మినపప్పు, రెండు నీళ్ళ ల్లో 6 గంటలు నానబెట్టాలి.
తరువాత నానిన వాటిలో ఎండు మెరపకాయలు,జిలకర్ర,ఉప్పు,
వేసి బరకగా రుబ్బుకోవాలి. (గ్రైండ్ )చేసుకోవాలి.
రుబ్బిన పిండిలో ఉల్లిపాయలు,కరేపాకు సన్నగా తరిగి
అందులో కలిపి రౌడుగా చేతిమీద కాని,ప్లాష్టిక్ షీట్ పై కాని
వడమాదిరిగా తట్టి,నూనేలో deep fry చేయాలి.
వేడి వేడి వడలపై కొబ్బర చెట్ని కాని,టోమాటో సాస్ తో కాని
తింటే చాలా కమ్మగా ఘుమ ఘుమ గా వుంటాయి.
మరి మీకు నచ్చితే chat చేసినా,లేక మెస్సేజి ఇచ్చినా
సంతోషమే....మరి మీ జవాబుకై...ఎదురు చూస్తూ....
మీ కోసం...మీ...శక్తి :)
కందిపప్పు (Bengal gram dal) -- 1/2 కప్
మినపప్పు (Tuar dal) -- 1/2 కప్
జీర -- 1/2 టేబల్‌స్పూన్
డ్రైచిల్లీ -- 6
ఉల్లిపాయలు -- (onions) -- 1/2 కప్
కరేపాక్ 20 ఆకులు
ఉప్పు రుచికి తగినంత
నూనే -- (Oil) -- వేయించేందుకు తగినంత
!! చేసే విధానము !!
ముందు కందిపప్పు,మినపప్పు, రెండు నీళ్ళ ల్లో 6 గంటలు నానబెట్టాలి.
తరువాత నానిన వాటిలో ఎండు మెరపకాయలు,జిలకర్ర,ఉప్పు,
వేసి బరకగా రుబ్బుకోవాలి. (గ్రైండ్ )చేసుకోవాలి.
రుబ్బిన పిండిలో ఉల్లిపాయలు,కరేపాకు సన్నగా తరిగి
అందులో కలిపి రౌడుగా చేతిమీద కాని,ప్లాష్టిక్ షీట్ పై కాని
వడమాదిరిగా తట్టి,నూనేలో deep fry చేయాలి.
వేడి వేడి వడలపై కొబ్బర చెట్ని కాని,టోమాటో సాస్ తో కాని
తింటే చాలా కమ్మగా ఘుమ ఘుమ గా వుంటాయి.
మరి మీకు నచ్చితే chat చేసినా,లేక మెస్సేజి ఇచ్చినా
సంతోషమే....మరి మీ జవాబుకై...ఎదురు చూస్తూ....
మీ కోసం...మీ...శక్తి :)
Subscribe to:
Posts (Atom)