Saturday, June 02, 2007

వెజిటబుల్ సమోసా



కావలసినవి ::--

సమోసా తయారి ::-
మైదా --------------------- 1 cup
నెయ్యి --------------------- 1/2 cup
బేకింగ్ పౌడర్ --------------- 1/4 tbl spoon
ఉప్పు - తగినంత
నీళ్ళు

కూర తయారికి ::--
బంగాలదుంపలు - 3( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).
ఉలిపాయాలు - 1 ( ముక్కలు)
పచ్చి బఠానీలు ------------------------1 cup
పచ్చిమిరపకాయలు --------------------2
కొత్తిమెర చాప్ చేసింది------------------- 1 టేబల్ స్పూన్
నిమ్మ జూసు ---------------------------- 2 tbl spoon
పసుపు -------------------------------- 1/2 tbl spoon
గరం మసాల ---------------------------- 1/2 tbl spoon
కారం ----------------------------------- 1 tbl spoon
ఆవాలు --------------------------------- 2 tbl spoons
అల్లం వెల్లుల్లి పేస్టు----------------------- - 1 tbl spoon
ఉప్పు - తగినంత
నునె - వేయించడానికి
కరివేపాకు -------------------------------- 2 రెబ్బలు

తయారు చేసే విధానం ::--

మైదా లో ఉప్పు,బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి.
కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి.
కలిపిన పిండి ని 30 నిమషాలు పాటు తడిబట్టతో పెట్టి వుంచాలి.

కూర విధానం ::--

ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి.
అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి.
అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
ఇప్పుడు పచ్చిబఠానిలు,అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల,కొత్తిమెర,కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
కొంచెం వేయించాక అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.
అందులో నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.
కలిపేసి పెట్టుకున్న మైదా ని మళ్ళీ బాగా కలుపుకోవాలి.
చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి
వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.
అంచులు గట్టిగ వత్తలి. వాటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించాలి.
సమొసా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.
ఆలస్యం దేనికీ ? మీరూ సమోసా చేసేందుకు తయార్ కాండి :)

No comments: