Wednesday, July 04, 2012

ఓట్స్ ఉప్మ



ఓట్స్ ఉప్మ

కావలసిన పదార్తాలు...

ఓట్స్ ఒక కప్ ... తరిగిన ఆనియన్ ఆఫ్ కప్ ...

ఎండుమిర్చి రెండు..పచ్చిమిర్చి రెండు...

ఆవాలు...one by forth టీస్పూన్ ...

శనగ పప్పు ఆఫ్ టీస్పూన్ ...

ఉద్దిపప్పు ఆఫ్ టీస్పూన్ ...

జీలకర్ర one by forth టీస్పూన్ ...

వేరుశనగ విత్తనాలు పిడికెడు ...

ఇంగువ..ఉప్పు..రుచికి తగ్గట్లు ...

గ్రేటేడ్ జింజర్ కొద్దిగా....కరివేపాక్ కొత్తిమీర....

olive oil ఒక టేబల్ స్పూన్...

lemon juice ...ఆఫ్ టేబల్ స్పూన్ .....

.......చేసే విధానం.......

ముందు ష్టవ్ పై బాణలి ఉంచి కాస్త వేడి అయ్యాక అందులో నూనె వేసి ..

నూనె కాగాక .... అందులో ఆవాలు.. శనగపప్పు ....ఉద్దిపప్పు....జీలకర్ర ....

ఎండుమిర్చి....వేసి ...దోరగా వేగాక ...అందులో పచ్చిమిర్చి ముక్కలు ...కరివేపాకు....వేరుశనగ విత్తనాలు వేసి బాగా వేయించండి ....

అన్నీ బాగా వేగాక ... ఆనియన్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పువేయండి...

( ఆనియన్ వేసాక ఒక పించ్ ఉప్పువేసి కలియ పెడితే ఆనియన్ తొందరగా లైట్ బ్రౌన్ అవుతుంది)

ఆనియన్..వేగనిచ్చి..అందులో...ఈ ఓట్స్ వేసి...నీళ్ళు...కొద్దిగా చిమికరించండి....

బాగా కలియ పెడుతూ..ఓట్స్ ఉడికిన తరువాత.....

lemon juice వేసి మరో మారు బాగా కలిపి కొత్తమీర వేసి వేడి వేడి గా ఆరగించడమే....ఓట్స్ పోహ....రెడి....

No comments: