Thursday, September 13, 2007

శనగపప్పు బొబ్బట్లు







కావలసినవి::

శనగపప్పు...........500 gm
బెల్లం..............500 gm
మైదాపిండి.......... 250 gm
యలకుల పొడి........1 టేబల్ స్పూన్
పచ్చ కర్పూరం పొడి..1/2 టేబల్ స్పూన్
నూనె అర కప్పు...నెయ్యి అరకప్పు


చేసే విధానం::

శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి
తర్వాత నీళ్ళువార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి
చివరలో యాలకులు,పచ్చ కర్పూరం పొడులు కలపాలి
ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.

తరువాత మైదాపిండిలో కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి
ఈ పిండిముద్దను కనీసం ఒక 3 గంటలు అయినా నాననీయాలి.

నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని
చేతితో వెడల్పు చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి
నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్ కాగితం మీద
పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి.

పొయ్యి మీద పెనం వేడి చేసి సన్నటి సెగపై
ఈ చపాతిలా వత్తుకొన్న బొబ్బట్టును
నెయ్యి వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

వేడి బొబ్బట్టుపై వేడి వేడి గా కాచిన నెయ్యి వేసుకొని తింటే " వావ్ " అనక మానరు
పాలు కావలసిన వారు పాలు వేడి చేసి బొబ్బట్లపై వేసుకొని తింటే మరీ రుచి
మీకు నచ్చితే మీరూ చేసుకొనీ..నాకో మెస్సేజి పెట్టండి
ఆ..హా...ఏమి రుచీ....

No comments: