Sunday, December 17, 2006

బిసిబేళె బాత్


!!!! కావలసినవి !!!!
కందిపప్పు రెండున్నర పావులు ,
బియ్యం 2 పావులు ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
2 వంకాయలు ,
1/2 సొర్రకాయ ,
2 దోసకాయలు ,
బీన్స్ తగినన్ని ,
2 పోటాటోలు ,
సెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు ,
5 బేబీ కార్న్ ,
2 క్యారెట్లు ,
3 టోమాటోలు ,
తగినంత కరేపాక్ ,
కోత్తమీర ,
కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప ,
4 గ్రీన్ చిల్లి$స్ ,
నూనె తగినంత ,
నెయ్యి చిన్న కప్పు ,
చింతపండు గొజ్జు తగినంత ,
కాస్త జాగిరి ,
ఉప్పు , పసుపు ,
5 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,
ఎండుమిర్చి, ఇంగువ .
చేయవలసిన విధానము !!!!
ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి కుక్కర్ లో కందిపప్పు , బియ్యం , పీనట్ వేసి , టోమాటో తప్ప తక్కిన అన్నీ కూరగాయలు వేసి పసుపు , ఉప్పు , నీళ్ళు 8 పావులు వేసి రెండు విజిలస్ వచ్చాక stove off చేయండి . మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి , కరేపాకు , టొమాటో , చింతపండు గొజ్జు , సాంబర్ పౌడర్ , జాగిరి . వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవీ అంతా వుడికిన రైస్ లో వేసి, కోత్తమీర , కరేపాక్ , నెయ్యి వేసి మరోసారి కలయబెట్టి వుడికించండి , అంతా బాగా వుడికిన తరువాత , ఎండు మిర్చి , ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బెర వేసి కలిపి దించండి వేడి వేడిగా తింటే భలే రుచి .