Thursday, January 17, 2008

వేరుశనగ చిక్కి



కావలసినవి ::

వేయించిన వేరుశనగ పప్పు 1 కిలో
బెల్లం 1/3 కిలో
నెయ్యి 6 స్పూన్స్

చేసే విధానం::

వేరుశనగపప్పు బద్దలుగావుంటే
పరవాలేదు కాని
గింజలుగానే వుండిపోతే వాటిని
రెండుగా విడగొట్టుకోవాలు .

వేరుశనగపప్పుని మీరు
ఇంటిలో వేయించ్ఘుకొంటే మరీ మంచిది
బెల్లం సన్నగా తురుముకొని
గిన్నెలో వేసి నీళ్ళు పోయాలి
ఈ గిన్నెను పొయ్యిమీదపెట్టి
ముదురు గోధుమ రంగు పాకం
వచ్చేవరకు కాచాలి.
పాకం వచ్చిందనగానే
ఈ పాకంలో వేరుశనగ పప్పు వేసి
అన్నివైపులా సమానంగా వుండెలా కలపాలి.తర్వాతపొయ్యినుండి
కిందికి దించాలి.
ఒక పళ్ళెంలో నెయ్యిరాసి అందులో ఈ వేరుశనగపప్పు పాకం పోసి
వేడిగా వున్నప్పుడే పళ్ళెమ్నిండా పరిచి
మీకు అవసరమైన సైజులో కట్ చేసుకొండి. వేరుశనగపప్పుచెక్క (బర్ఫీ) తయార్ :)

క్యారెట్ బర్ఫీ



కావలసినవి !!

క్యారెట్..... 1/2 కేజి
పాలు...... 1/2 లీటర్
చక్కర.... 300గ్రా
నెయ్యి50గ్రా
జీడిపప్పు 20గ్రా

తయారు చేసే విధానం !!

క్యారెట్`ను సన్నగా తురమండి .

మూకుడులో క్యారెట్ మరియు పాలు కలిపి ఉడికించండి.

పాలు ఇగిరిపోయాక నెయ్యి వేసి కాసేపు ప్రై చేయండి.

తరువాత పంచదారపోసి
మరి కొద్దిసేపు వుడికించండి .

ఇలా వుడికించినప్పుడు

పాకం వస్తుంది ఈ పాకం
చిక్కపడిన తరువాత
కోవాను పొడిగా చేసి చల్లండి

ఇంకా దగ్గరకు వచ్చి ముద్దలా అయిన తరువాత దించంది

ఓ ప్లేట్ కి నెయ్యి పూసి అందిలో

ఈ క్యారెట్ ముద్దను వేయండి
వీటి మీద జీడిపప్పులు జల్లి
ముక్కలుగా కోయండి .

నోరూరించే ఈ క్యారెట్ బర్ఫీ రెడీ...
మీరు తయారేనా ఈ వంటకం నచ్చితే నాకో మెస్సెజ్ పెట్టండి

వెజి కట్టెపొంగల్


!! కావలసినవి !!

తురిమిన కరెట్ 1
1/4కప్ గ్రీంపీస్
1/4 కప్ కార్న్
జీడిపప్పు 100 గ్రా
బియ్యం 1కప్
పెసరపప్పు 1/2కప్
నెయ్యి 3 టేబల్ స్పూన్స్
ఉప్పు తగినంత
అల్లం చిన్నముక్క తురిమినది
పచ్చిమిర్చి 3
జిలకర 1/2 స్పూన్
మిరియాల్ల పొడి 1/2 తేబల్ స్పూన్

చేసే విధానం !!

ముందు బియ్యం , పెసరపప్పు
వుడికించి పెట్టుకోండి .
తరువాత ఒక పాన్ లో నెయ్యివేసి అందులో
జిలకర వేసి వేగిన తరువాత
తురిమిన కారెట్ , బటానీ , కార్న్ , వేసి
అందులోనే తరిగిన పచ్చిమిర్చి
అల్లం ,ఉప్పు కోత్తమిర వేసి
అవన్ని వుడికిన తరువాత
అందులో ఈ వుడికిన రైస్ వేసి
బాగా కలియబెట్టి అందులో
మిరియాల పొడి వేసి
వేయించిన జీడిపప్పులు వేసి
పైన బాగా నెయ్యివేసి దించడమే
వేడి వేడి గా ఈ సంక్రాతి పోంగలి ని
దేవుడికి నైవేద్యం పెట్టి మనమూ ఆరగించడమే :)