Thursday, September 13, 2007

చిరోటి రవ కుడుములు



!! కావలసినవి !!

చిరోటి రవ 1/4 కేజి ( 1 గ్లాస్ )
మైదా పిండి 2 స్పూన్స్
కొద్దిగ ఉప్పు ( ఉప్పు మంగళకరానికి శ్రేష్టమంటారుగా పెద్దలు
అందుకే శాస్రానికి వేయాలంటే వేయాలి )
నూనె 2 స్పూన్స్
చిటికెడు సోడా

ఇదంతా కొద్దిగ నీళ్ళుపోసి పూరీ పిండిలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి.
2 3 గంటలు నానిన తరువాత పూరీలుగా వత్తుకోవాలి

!! పూర్ణానికి కావలసినవి !!

శనగ పప్పు 1 గ్లాసు
బెల్లం 2 గ్లాసులు
వేయించేందుకు తగినంత నూనే
ఎండుకొబ్బెర 3 టేబల్ స్పూన్స్
గసగసాలు 1 1/2 స్పూన్స్
జీడిపప్పు ముక్కలు 3 టేబల్ స్పూన్స్

!! చేయవలసిన విధానం !!

శనగ పప్పు నీళ్ళు వేసి వుడికించి
ఆ నీళ్ళన్ని వంపేసి అందులో చితగొట్టిన
బెల్లం పొడిని వేసి
ఒక 2 నిముషాలు వుడక నిచ్చి
గ్రైండ్ చేయండి.అందులో కొబ్బెర,
గసగసాలు,నేతిలో వేయించిన
జీడి పప్పు వేసి బాగా కలపండి.
ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్ లో తీసివుంచాలి.
పూరీలుగా వత్తుకొన్న వాటిపై
ఈ పూర్ణాన్ని పెట్టి చుట్టూ
గోటితో మడతలుగా మడచి
నూనేలో దోరగా వేయించడి
పళ్ళెంలో అందంగా పేర్చి,
వినాయుకుడి ముందు నేవెధ్యం పెట్టాలి .
తరువాత మీరారగించవచ్చు :) !!!

కోవా కజ్జికాయలు



కావలసినవి ::

1 లీటరు పాలు
1/2 కిలో చక్కెర
1/2 కిలో
బెల్లం
కొబ్బెర చిప్పలు నాలుగు
యాలకుల పొడి 1 tsp స్పూన్

చేసే విధానం::

పాలు మరగనిచ్చి చిక్కపడ్డాక
చక్కరవేసి గరిటతో కలుపుతూ
దగ్గరగా వచ్చినప్పుడు
యాలకుల పోడి వేసి
కోవా అయ్యెంతవరకు కలయ పెడుతూ ఉండండి .

తురిమి వుంచిన కొబ్బెర తురుమును

బెల్లాన్ని రెండూ కలిపి ష్టౌ మీద పెట్టి
రెండూ దగ్గరపడి గట్టిపడ్డ తరువాత
చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి.

ఒక్కొక్క వుండనూ తీసుకొని

దానిమీద తయారు చెసుకొన్న కోవాను
పల్చగా చుట్టి పళ్ళెం లో పెట్టుకొని
బాగా ఆరనిచ్చాక
పొడి డబ్బా లో వుంచుకోనాలి
రుచికరమైన కోవా కజ్జికాయలు మీకోసం

ఢోక్లా

కావలసినవి

సెనగపిండి................200gm
పెరుగు....................1 కప్
అల్లం గోలికాయంత
సోడా......................1 టేబల్ స్పూన్
నిమ్మరసం................1 టేబల్ స్పూన్
నూనె.....................1 టేబల్ స్పూన్

పోపుకి కావలసినవి::

నూనె..3 టేబల్ స్పూన్స్
ఆవాలు..1 టేబల్ స్పూన్
కరివేపాకు..2 టేబల్ స్పూన్స్
కొత్తిమిర..2 టేబల్ స్పూన్స్

చేసే విధానం::

సెనగపిండి, పెరుగు,ఉప్పు,తగినంత నీరు కలిపి
కాస్త చిక్కగా కలిపి కనీసం 4 గంటలు నాననివ్వాలి.

పచ్చిమిర్చి,అల్లం ముద్ద, పసుపు అందులో వేసిబాగా కలపాలి
ఒక పెద్ద గిన్నెలో నీరుపోసి వేడి చేయాలి

ఒక చిన్న గిన్నెలో సోడా ,నూనె,నిమ్మరసం కలిపి పిండిలో వేసి బాగా కలియబెట్టాలి
ఒక వెడల్పాటి గిన్నెకు అన్నివైపులా నూనె రాసి ఈ పిండి మిశ్రమం వేసి సమానంగా సర్ది
పెద్ద గిన్నెలో మరుగుతున్న నీటిలో పెట్టి ఆవిరిపై పదిహేనునిమిషలు ఉడికించాలి

చల్ల్లారాక ముక్కలుగా కోయాలి.ఇప్పుడు నూనె వేడి చేసి ఆవాలు
కరివేపాకు వేసి చిటపటలాడాక దింపి పావు కప్పు నీరు కలిపి ఈ ఢోక్లా ముక్కలపై
సమానంగా పోయాలి.ఆ నీటిని పీల్చుకుని అవి మృదువుగా అవుతాయి. కొత్తిమిర,
కొబ్బరి తురుముతో అలంకరించి వడ్డించాలి......
మీరూ Try చేసి చూడండీ

ఢిల్లీ బాదుషా






కావలసినవి::

మైదాపిండి.............1/2 కేజి
చక్కర..................1/2 కేజి
నీళ్ళు..................1/2 కప్పు
చిటికెడు సోడా
డాల్డా..................1/4 కప్పు
ఏలకుల పొడి..........1/2 స్పూన్
నూనే..................2 కప్పులు

చేసే విధానం::

మైదా పిండిలో సోడా,నెయ్యి,నీళ్ళు
వేసి 15 నిముషాలు బాగా కలపాలి.

పిండిని వడపిండిలా కలుపుకోవాలి
వాటిని వడలమాదిరిగా చేసుకొని
వేడి చేసిన నూనేలో వేయించండి.

అరకప్పు నీళ్ళలో 1/2 చక్కర వేసి
చక్కర కరిగెంతవరకు వుంచండి.

లైట్ గా తీగపాకం వచ్చెంతవరకు
పెడితే బాదుషాలపై చెక్కర నిలబడుతుంది
ఈ పాకంలో వేయించిన బాదూషాలు వేసి
15 నిముషాల తరువాత తీసి ప్లేట్ లో వుంచండి
కన్నులకు ఇంపుగా కనిపించే బాదూషాలు రెడీ..
...మీరూ Try చేసి చేయండి

బేసన్ లడ్డు



కావలసినవి ::

సెనగపిండి ఒక కప్పు
చక్కర............100 gms
కోవా..............50 gms
నెయ్యి............60 gms
ఏలకులు.........15

చేసే విధానం ::

మూకుడు వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి
సెనగపిండిని పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

చక్కర ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసిపెట్టుకోవాలి.

కోవాను కూడా కొద్ది కొద్దిగా వేపి సెనగపిండి చక్కరపొడి
అన్ని బాగా కలిపి కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి
చేతికి నెయ్యి రాసుకొని వుండలు కట్టితే
చేతికి నెయ్యి రాసుకొంటే ఉంటలు ఇరిగిపోవు
మీకు నచ్చిదా....మరి మీరూ నేర్చుకోండి

శనగపప్పు బొబ్బట్లు







కావలసినవి::

శనగపప్పు...........500 gm
బెల్లం..............500 gm
మైదాపిండి.......... 250 gm
యలకుల పొడి........1 టేబల్ స్పూన్
పచ్చ కర్పూరం పొడి..1/2 టేబల్ స్పూన్
నూనె అర కప్పు...నెయ్యి అరకప్పు


చేసే విధానం::

శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి
తర్వాత నీళ్ళువార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి
చివరలో యాలకులు,పచ్చ కర్పూరం పొడులు కలపాలి
ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.

తరువాత మైదాపిండిలో కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి
ఈ పిండిముద్దను కనీసం ఒక 3 గంటలు అయినా నాననీయాలి.

నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని
చేతితో వెడల్పు చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి
నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్ కాగితం మీద
పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి.

పొయ్యి మీద పెనం వేడి చేసి సన్నటి సెగపై
ఈ చపాతిలా వత్తుకొన్న బొబ్బట్టును
నెయ్యి వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

వేడి బొబ్బట్టుపై వేడి వేడి గా కాచిన నెయ్యి వేసుకొని తింటే " వావ్ " అనక మానరు
పాలు కావలసిన వారు పాలు వేడి చేసి బొబ్బట్లపై వేసుకొని తింటే మరీ రుచి
మీకు నచ్చితే మీరూ చేసుకొనీ..నాకో మెస్సేజి పెట్టండి
ఆ..హా...ఏమి రుచీ....