Sunday, October 16, 2016

మామిడికాయ పులిహోర


కావలసిన పధార్తాలు::

2---మామిడికాయలు (Grated)

1/2--Grated Coconut, half coconut 

8--greenchilli

1--స్పూన్ ఆవాలు

10--గింజలు మెంతులు 

జిలకర 1/2 టీస్పూన్  

వేరుశనక్కాయలు మీకు కావలసినంత 

నూనె..తగినంత 

ఉప్పు..పసుపు..


పోపుగింజలు::

ఆవాలు,,జిలకర,,సనగపప్పు,,మినపప్పు..ఇంగువ,,ఎండుమిర్చి.

పులిహోర చేసే విధానం::::--

1::ముందు అన్నం పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి. వేరుశనక్కాయలు దోరగా వేయించి ఉంచండి.

2::కొబ్బర తురుము,,పచ్చిమిర్చి..ఆవాలు..మెంతులు..జిలకర కొద్దిగ నూనె వేసి అందులో ఇంగువ వేసి విడివిడిగా అన్ని వేయిన్ చుకోవాలి.

3::వేయించిన వాటిని అన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

4::ష్టవ్ పై పాన్ పెట్టి అందులో ఒక గరిటే నూనె వేసి అందులో ఈ GREND చేసి ఉంచిన మసాల వేసి పచ్చివాసన పోయెంతవరకు బాగా వేయించాలి.

5::15min బాగా వేయించి ఉంచండి

6::చేసిపెట్టుకొన్న అన్నం లో కొద్దిగ నూనె వేసి కలిపి అందులో ఉప్పు..పసుపు వేసి కలిపి
ఈ చేసిపెట్టుకొన్న మసాల ను అన్నంలో కలిపి...పైన కరేపాకుతో వేరుశనక్కాయలు వేసి పోపు పెట్టడమే 

ఘుమ ఘుమ లాడే మామిడికాయ పులిహోర రెడి  







Monday, February 29, 2016

బైగాన్ బర్త ( Baingan bharta



















కావలసిన పదార్థాలు::- 

వంకాయలు-----3..మీడియం సైజ్ 
ఉల్లిపాయలు----2..చిన్నగా కట్ చేసుకొన్నవి   
టమోటో--------2..చిన్నగా కట్ చేసుకొన్నవి 
అల్లం-----------చిన్న పీస్..తురుమినది 
జీలకర్ర---------1/2 టేబల్‌స్పూన్ 
  
జీలకర్రపొడి----1/4 టేబల్‌స్పూన్   
దనియాపొడి---1 టేబల్‌స్పూన్ 
కిచెన్‌కింగ్-పౌడర్-- 1/2 టీస్పూన్
   
ఏండుకారం--------1 టీస్పూన్ 
పచ్చిమిర్చి------- 3 
కొత్తిమీర------ ----2 టేబల్‌స్పూన్ సన్నగా కట్ చేసుకొన్నది  
బిర్యాని ఆకు------1 
నూనె---కావలసినంత---ఉప్పు---పసుపు---తగినంత 

తయారు చేసే విధానము::- 



















1:: స్టౌ సిమ్ లో పెట్టి వంకాయలను బాగా కాల్చుకోవాలి--- కాల్చిన వంకాయలు మంచి రుచికూడా వస్తుంది. 

లేదంటే...స్టౌ పై పాన్ పెట్టి అందులో కొద్దిగ నూనెవేసి వంకాయలు ముక్కలు చేసుకొని అందులో వేసి బాగా వేయించుకోవాలి.

2:: కాల్చిన వంకాయలను పక్కకు తీసి పైపొట్టును తీసేసి కొద్దిసేపు చల్లార్చి మాష్ చేసి( కచ్చపచ్చగ పిసుక్కోవాలి) పెట్టుకోవాలి.  

3:: ఇప్పుడు పాన్ లో నూనె వేసి అందులో జీలకర్ర--వేసి దోరగా వేయించి తరువాత--ఉల్లిపాయముక్కలు--బిర్యాని ఆకు--అల్లం తురుము--పచ్చిమిర్చి ముక్కలు--జిలకర పౌడర్--ధనియాపౌడర్--కిచెన్‌కింగ్ పౌడర్--టమోటో ముక్కలు--వేసి బాగా వేయించాలి--ఇవి వేగేటప్పుడే---ఉప్పు పసుపు---కారం---వేసి వేగనివ్వాలి  

4:: వేగిన మసాలలో తయారు చేసిపెట్టుకొన్న వంకాయ ముద్దని అందులో కలిపి బాగా కలియబెట్టి మూత పెట్టి  2 minutes  ఉడకనివ్వాలి. 

ఉడికిన బుర్తలో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి, అంతే బైగాన్ బర్తా రెడీ. ఈ పచ్చడి అన్నంలోకీ, చపాతీలోకీ కూడా టేష్టి గా...ఘుమ ఘుమ వాసనతో సూపర్ గా ఉంటుంది..
మరి మీరూ రెడినా బైగాన్ బర్త చేసేందుకు.... 

చిక్కుడు బెండకాయ మసాలకూర













కావలసిన పధార్థలు::-

బెండకాయలు.........100 గ్రాం

చిక్కుడుకాయలు....100 గ్రాం

ఆనియన్----------- 2 మిడియంసైజు 

కరివేపాకు ఒక రెబ్బ

కొత్తమిర తురుము ..... మీకు కావలసినంత.


పోపు గింజలు::-


శనగపప్పు...ఉద్దిపప్పు...జిలకర...ఆవాలు.నూనె తగినంత..ఉప్పు...పసుపు



మసాల తయారికి కావలసినవి::- 


పచ్చిమిర్చి---- 3
పప్పులు---------- 25 గ్రాంస్
చింతపండు------ రసం రెండు టేబల్‌స్పూన్స్  
జిలకర--------- 1 టీస్పూన్ 
ధనియాపౌడర్--- 1 టీస్పూన్
పచ్చికొబ్బర--- తురుము 2 టెబల్‌స్పూన్స్
అన్ని కలిపి పచ్చివి నున్నగా కాస్త నీళ్ళగా గ్రైండ్ చేసి ఉంచండి


కూర చేసే విధానం::-

చిక్కుడు కాయలు....బెండకాయలు....అన్ని నీళ్ళతో బాగా కడిగి మీకు కావలసిన సైజులో కట్ చేసి ఉంచండి.

స్టవ్ పై పాన్ పెట్టి పాన్ వేడి అయినాక అందులో 3 స్పూన్స్ నూనె వేసి అందులో ఈ పోపుగింజలు వేసి...బాగా దోరగా వేగాక అందులో పచ్చిమిర్చి...కరివేపాకు...ఆనియన్ ముక్కలు వేసి అవికూడా గోల్డేన్ రంగు వచ్చే వరకు వేయించండి   

ఆ తరువాత అందులో ఈ చిక్కుడు...బెండకాయ ముక్కలు వేసి అందులో పసుపు...ఉప్పు...వేసి బాగా కలయ బెట్టి సగం గ్లాసు నీళ్ళుపోసి అందులో ఈ మసాలకూడవేసి అంతా మళ్ళి ఒకసారి బాగా కలియబెట్టి పాన్ పై మూత పెట్టి 20 నిముషాలు సన్నటి సెగపై ఉడికించండి

బాగా ఉడికిన కూరలో కొత్తమీర వేసి దించేయడమే...ఘుమఘుమలాడే చిక్కుడు మసాల కూర తయార్......ఈ కూర చపాతికి కాని జొన్న రొట్టెకుగాని వేడి వేడి అన్నానికి గాని సూపర్ గా ఉంటుంది......మీరు తయారు చేసి చూస్తారా మరి? 

నచ్చితే ఒక్క కామెంట్ ఇవ్వండి దోస్తులూ...