కాప్సికం పచ్చడి
కావలసినవి::
కాప్సికం:::::::::2
ఉద్దిపప్పు:::::::1/2 టేబల్‌స్పూన్
చనగపప్పు:::::1/2 టేబల్‌స్పూన్
ఎండుమిర్చి:::::4
ధనియాలు::::::1/2 టేబల్‌స్పూన్
నువ్వులు:::::::1/2 టేబల్‌స్పూన్
పసుపు,ఉప్పు,కావలసినంత
వేరుశనక్కాయలు(పల్లీలు)1 టేబల్‌స్పూన్
పోపు కావలసినవి::
ఆవాలు::::::::::::::1/3 టీస్పూన్
జిలకర:::::::::::::::1/4టీస్పూన్
ఎండుమిర్చి::::::::::2
కరివేపాకు రెబ్బలు::1
ఇంగువ:::తగినంత
చేసుకొనే విధానం::
ఉద్దిపప్పు::::::1/2 టేబల్‌స్పూన్
చనగపప్పు::::1/2 టేబల్‌స్పూన్
వేరుశనక్కాయలు(పల్లీలు)1 టేబల్‌స్పూన్
ఎండుమిర్చి::::4
ధనియాలు:::::1/2 టేబల్‌స్పూన్
నువ్వులు::::::1/2 టేబల్‌స్పూన్
ఇవన్ని నూనె లేకుండగ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొండి.
కాప్సికం ముక్కలుగా కట్ చేసుకొని పాన్లో ఒక స్పూన్ నూనె వేసి
సగం ఉడికాక తీసి చల్లారాక వేయించిన దినుసులు ఈ కాప్సికం
ఉప్పు,పసుపు,వేసి గైండర్లో మెత్తగా చేసుకోండి.
తరువాత ఒక గిన్నెలో ఈ పచ్చడి తీసి
కరేపాకుతో ఎండుమిర్చి వేసి ఇంగువ తాలిపు వేయండి
(పులుపు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు లేకపోతే
వన్‌టీస్పూన్ చింతపండుగొజ్జు గ్రైండ్ చేసేముందు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు}
ఈ పచ్చడి దోసకు,అన్నానికి చాలా రుచిగా ఉంటుంది మరి మీరూ చేసి చూస్తారా?