Thursday, November 29, 2007
దిబ్బరొట్టె
!! కావలసినవి !!
మినప్పప్పు 250 గ్రాం
బియ్యపురవ్వ 150 గ్రాం
ఉప్పు సరిపడ
నూనె 1/2 కప్పు
!! చేసే విధానము !!
మినప్పప్పును శుభ్రం చేసుకున్న తరువాత మూడు గంటలపాటు నానబెట్టి
మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకూడదు. రుబ్బిన ముద్దలో
బియ్యపు రవ్వను కలిపి తగినంత ఉప్పు కూడా కలిపి అవసరమనుకుంటే
కొద్దిగా నీరు కలుపుకోవాలి.మందపాటి బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువ వేసి
అట్టు పోసుకోవాలి. తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిని
వేరుశనగపప్పు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. బ్రెడ్ ఎలా ఉంటుందో
దిబ్బరొట్టె అంత మందంగా ఉంటుంది.
పుల్లట్టు
!! కావలసినవి !!
బియ్యపు పిండి 250 గ్రాం
మైదా 100 గ్రాం
గడ్డపెరుగు 100 గ్రాం
జీలకర్ర 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 గ్రాం
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 టీ స్పూన్స్
!! తయారు చేసే విధానం !!
బాగా చిక్కగా ఉన్న పెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఆనియన్స్
ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,
మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
నాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీద
కాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన సైజులో పోసుకొని నెయ్యితో
కాల్చుకోవాలి. పిండి ఎంత పుల్లగా ఉంటే అట్లు అంత బాగుంటాయి
రవ దోశ
!! కావలసినవి !!
గోధుమ రవ్వ 1కప్పు
మైదా 1/4 కప్పు
బియ్యంపిండి 1/4
పెరుగు 1 కప్పు
కరేపాక్,కొత్తమిర తగినంత
పచ్చి మెరపకాయలు 3{సన్నగా తరిగినవి}
ఆనియన్ 2{సన్నగా తరిగినవి}
జిలకర్ర 1/2 టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె దోశలకు తగినంత
!! తయార్ చేసే విధానం !!
రవ,బియ్యం పిండి, మైద,పెరుగు,మిర్చి కరేపాక్,కొత్తమిర,ఉప్పు,ఆనియన్,జిలకర్ర,
అన్నీ తగినంత నీళ్ళుపోసి కలిపి కాస్త పల్చగా వుండాలి.
పెన్నం వేడిచేసాక దోశ పల్చగా వేసి
రెండువైపులా బాగా కల్చి, కొబ్బెర చట్ని తొ కాని మాంగో పికల్ తొ కాని ఆరగించారంటే చాలాబాగుంటాయి :)
మైసూర్ మసాలా దోసె
!! కావలసినవి !!
మినప్పప్పు....... 2 కప్పులు
శనగపప్పు......... 2 కప్పులు
బియ్యం ............ 1/4 కప్ప్పు
మెంతులు......... 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
ఎండుమిర్చి తగినన్ని
!! మసాలా దినుసులు !!
పొటాటో........... 1/2కిలో
పసుపు............ 1/4 టీస్పూన్
ఉడికించిన బఠాణీలు............. 1/2 కప్పు
పచ్చిమిర్చి.................. 3
ఆవాలు........................ 1/4 టీస్పూన్
మినప్ప్పప్పు.................. 1 టీస్పూన్
శనగపప్పు ...................... 1 టీస్పూన్
కరివేపాకు ...................... 1 రెబ్బ
నూనె ............................ 2 టీ స్పూన్స్
అల్లం చిన్న ముక్క
!! చేసే విధానం !!
పొటాటో ముందే వుడికించి పొట్టుతీసి చేత్తో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చిదుముకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన
పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠానీలు,తగినంత
ఉప్పు వేసి పొటాటోను అందులో కలిపి బాగా కలియబెట్టి ఈ పొటాటో కూరను తయార్ చేసుకోవాలి.
బియ్యం,మినపప్పు, మెంతులు,విడివిడిగా కనీసం 3 గంటలు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బి,
తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి మళ్ళీ రుబ్బుకోవాలి. పిండిని బాగా
కలియబెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని
ఈ మసాల కూరని దోసలో వుంచి సర్వే చేస్తే వావ్ భలే రుచి :)
సెట్ దోసె
!! కావలసినవి !!
మినప్పప్పు 1 కప్పు
బియ్యం 3 1/2 కప్పులు
అటుకులు 1/2 కప్పు
మెంతులు 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
నూనె 1/2 కప్పు
!! చేసే విధానం !!
మినప్పప్పు,బియ్యం,మెంతులు,అటుకులు కలిపి ఆరుగంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా
రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణములో కాస్త మందంగా దోసెలు చేసుకోవాలి
ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది
కొబ్బరి చట్నీ,కూర్మా లేక సాగు తో వడ్డణ మరీ రుచి :)
పైన కరేపాక్ , కొత్తిమిరతో Decorate చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది :)
మరి మీరు సెట్ దోసకు Prepare అవుతున్నారా ???
పేపర్ దోసె
!! కావలసినవి !!
మినప్ప్పప్పు 1/2 కప్పు
బియ్యం 4 కప్పులు
ఉప్పు తగినంత
జీలకర్ర 1 tsp
నూనె 1/2 కప్పు
!! చేసే విధానం !!
మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటలపాటు నానబెట్టాలి.తరువాత
విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు
మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను
ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా
ఉండేలా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చేవరకు కాల్చి
చట్నీ, సాంభార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)