కొత్తిమీర పచ్చడి
ఈ కొత్తిమీర పచ్చడి 20 రోజులు నిలువ వుంటుంది.
కావలిసినవి::
కొత్తిమీర:::::::::::: 1 కట్ట పెద్దది
ఎండుమిర్చి:::::::: 12
చింతపండుగుజ్జు::: 4 టేబల్‌స్పూన్స్
తాలింపు గింజలు::
శనగ పప్పు:::::: 2 టీస్పూన్
మినపపప్పు:::::: 1 టీస్పూన్
ఆవాలు::::::::::: 1/3 టీస్పూన్
జీలకర్ర:::::::::::: 1/ 3 టీస్పూన్
నూనె::::::::::::: 5 టేబల్‌స్పూన్స్
ఇంగువ::::::::::: 1/2టీస్పూన్
ఎండుమిర్చి:::::: 3
పసుపు..తగినంత
ఉప్పు..తగినంత
పచ్చడి చేసే విధానము::
కొత్తిమీర కడిగి చిల్లుల గిన్నలో వేసి బాగా కడగాలి.
తరువాత మిక్సీ జార్ లో , కొత్తిమీర ,
ఉప్పు..ఎండుమిర్చి..చింతపండు గుజ్జు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచండి.
stove మీద పాన్ పెట్టి తగినంత నూనె వేసుకొని నూనె కాగినాక,
తాళింపు గింజలు ఎండుమిర్చి ఇంగువాతో పోపు పెట్టి,
ఈ గ్రైండ్ చేసి ఉంచిన పచ్చడి పోపు లో వేసి 5 నిముషాలు
సన్నటి మంటపై వేగనిచ్చి stove కట్టేయండి.
టైట్ గా మూత ఉన్న జార్ తీసుకొని అందులో వేసి ఉంచండి
20 రోజులవరకూ చెడిపోకుండా ఉంటుంది( నీళ్ళు తగలనివ్వకండి)
ఈ పచ్చడి వేడి వేడి అన్నానికిగాని..చపాతి,దోస,ఉప్మా..అన్నింటికీ బాగుంటుంది
మరి మీరు రెడినా?