కావలసినవి::
వాము ఆకు:::::: 2 కప్పులు (తరిగినది)
పచ్చిమిర్చి::::::: 2
చనగపప్పు:::::: 1 1/2 టీస్పూన్
మినపప్పు::::::: 1 టీస్పూన్
జిలకర్ర::::::::::: 1/3 టీస్పూన్
ఎండుమిర్చి:::::: 4
చింతపండు::::::: 2 టీస్పూన్స్
ఆవాలు::::::::::: 1/2 టీస్పూన్
నూనె::::::::::::: 4 టీస్పూన్స్
బెల్లము:::::::::: 1/2 టీస్పూన్
ఒక పించ్ ఇంగువ
కరివేపాకు ఒక రెబ్బ.
ఉప్పు,పసుపు..తగినంత
చేసే విధానం::
stove పై పాన్ పెట్టి అందులో కొద్దిగ నూనె వేసి
ఆ నూనెలొ శనగపప్పు...మినపప్పు...ఆవాలు...జిలకర్ర...
ఎండిమిర్చి 2...పచ్చి మిర్చి 2...చింతపండు...
అన్నీ దొరగ వేయించి పక్కన ప్లేట్ లో వేసి ఉంచండి .
అదే పాన్ లో కొద్దిక నూనె వేసి ఈ తరిగి ఉంచిన వాము ఆకును వేసి
2 నిముషాలు వేయించి ఈ ప్లేట్ లో వుంచినవి ఈ వామాకు చింతపండు
ఉప్పు,పసుపు బెల్లం, వేసి మిక్సి లో గ్రైండ్ చేయండి.
ఆ పాన్ లోనే మరికాస్త నూనె వేసి...వేడి అయిన తరువాత అందులో
శనగపప్పు...మినపప్పు...జిలకర్ర...ఆవాలు...వేసి ఆవాలు చిటపటా అన్నప్పుడు..
ఎండుమిర్చి 2 చిన్న ముక్కలుగా చేసి వేసి కరివేపాకు కూడావేసి ష్టవ్ కట్టేయడమే
ఈ తాలింపు చట్ని లో కలిపి తింటే ఆహా ఏమిరుచి అనక మానరు :)
మరి మీరు రెడియేనా?
ఈ వామాకుతో మరిన్ని వంటకాలు మీముందు ఉంచుతాను