Saturday, April 27, 2013

ఆపిల్స్ తో పచ్చడి


















కావలసినవి::

2:: ఆపిల్స్  ముక్కలు చేసి ఉంచండి

15: పచ్చి మిర్చి.

పచ్చికొబ్బర  2  టేబల్‌స్పూన్స్.

జిలకర్ర  1/2  టీస్పూన్

ఉప్పు,పసుపు,తగినంత


పోపు దినుసులు::

ఆవాలు...చనగపప్పు...మినపప్పు...జిలకర్ర...ఎండుమిర్చి...
నూనె ఒక స్పూన్....ఒక పించ్ ఇంగువ...కరివేపాకు ఒక రెబ్బ.   
{ అన్నీ కలిపి ఒక టేబల్‌స్పూన్ ఉండాలి  }
ముందు పైన చెప్పినవన్నీ మిక్సిలో వేసి బాగా గ్రైండ్ చేసి 
ఒక బౌలో వేసి ఉంచండి.

ఆ తరువాత ష్టవ్ పై బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి

నూనె కాగాక పొపు దినిసులన్నీ వేసి చివర్లో ఇంగువ కరివేపాకు వేసి

అన్ని దోరగా వేగిన తరువాత ఈ చేసి ఉంచిన పచ్చడిలో కలపండి

ఘుమ ఘుమ లాడే ఆపిల్ పచ్చడి రెడి :)