--::కావలసినవి::--
నూనె -- నెయ్యి కలిపి --- 2 ---టేబల్ స్పూన్స్
పుదిన -----1 ----- పెద్ద కట్ట
వెల్లుల్లి -------- 15 రెబ్బలు
ఆనియన్ ------ 2
రైస్ ------ 2 కప్పులు
పచ్చి మిర్చి ---- 3
కరివేపాకు రెబ్బలు 2
పచ్చికొబ్బెర --- 1/2 కప్పు
--:: పోపు గింజలు ::--
ఆవాలు 1 టీ స్పూన్
శనగపప్పు --- 1/2 టేబల్ స్పూన్
ఉద్దిపప్పు ---- 1 టేబల్‌స్పూన్
జిలకర --- 1/2 టీ స్పూన్
ఎండుమిర్చి ---- 3
--:::::: చేసే విధానం :::::--
ముందు రైస్ పొడి పొడిగా వండుకోవాలి.
పుదిన మట్టిలేకుండగా బాగా కడిగి సన్నగా తరిగి వుంచండి.
వేడి వేడి అన్నంపై ఉప్పు----పుదిన కలిపి---అట్టె 5 నిముషాలు వుంచండి
వెల్లుల్లి రెబ్బలు పొట్టుతీసి మీకు కావలసిన సైజులో
తరిగి వుంచుకొండి.
ఆనియన్ అంతే పొట్టుతీసి మీకు కావలసిన రీతిలో కట్ చేసి వుంచుకోండి.
పచ్చిమిర్చి ఒకటికి రెండుగా పొడవుగా మధ్యకు చీల్చీండి
ఇప్పుడు మూకుడు ష్టవ్‌పై వుంచి అందులో నూనె,నెయ్యికలిపి
మూకుడులో వేసి కొద్దిగ వేడైన తరువాత
అందులో పోపు గింజలు
ఎండుమిర్చి వేసి అవి దోరగా వేగిన తరువాత
అందులోనే కరేపాకు----పచ్చిమిర్చి---- వెల్లుల్లి----ఆనియన్----
వేసి అవికూడ దోరగా వేగిన తరువాత---
సగం పచ్చికొబ్బెర---కొత్తమిర వేసి
ష్టవ్ కట్టేసి దించేయండి.
ఈ వేగిన మిశ్రమాన్ని అన్నానికి వేసి బాగా కలపండి.
చివర్లో మిగిలిన పచ్చికొబ్బెర వేసి
మరో మారు కలిపి అందరికీ వడ్డించడమే...
మరి మీరూ చేసి చూస్తారా???
బాగుంటే నాకో మెస్సేజి ఇవ్వండి.