Sunday, April 14, 2013
మామిడికాయ ఊరగాయ (Pickle - పికల్)
మామిడికాయలు:: 2
ఆవాలపొడి::::::::: 3 టేబల్‌స్పూన్
మెంతులపొడి:::::: 2 టేబల్‌స్పూన్
ఎండుకారంపొడి:::: 3 టేబల్‌స్పూన్
ఉప్పు:::::::::::::: 3 టేబల్‌స్పూన్
పసుపు:::::::::::: 1/2 టీస్పూన్
పోపుకు కావలసినవి::
ఆవాలు::::::::::: 1 టీస్పూన్
ఎండుమిర్చి::::::: 4
వెల్లుల్లి దబ్బలు::: 6
ఇంగువ:::::: తగినంత
కరివేపాకు రెండు రెమ్మలు
ముందు మాంచి మామిడికాయలు తీసుకొని
వాటిని బాగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని
ఆ ముక్కలను ఎండలో ఓ గంట ఎండబెట్టాలి.
ఆవాలు..మెంతులు, దోరగా నూనె వేయకుండగ వేయించుకొని
విడి విడిగా పొడి చేసి ఉంచుకొండి.
ముక్కలు చేసి ఉంచిన మామిడికాయల్లో
ఈ ఆవపొడి,మెంతిపొడి,ఎండుమిర్చిపొడి,
ఉప్పు పసుపు వేసి, అన్ని కలిసిపోయేలా బాగా కలిపి
అందులో పోపు వేసి..వేడి..వేడి అన్నానికి కలుపుకొని తింటే
వావ్ అనకుండ ఉండలేరు..మీరూ Try చేసి చూడండి
{వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటేలేదు}
మామిడి కాయ ఇడ్లిపిండి పునుగులు
మామిడికాయ తురుము..1/2 కప్పు
ఇడ్లి పిండి........................2 కప్పులు
జిలకర............................1/3 టీస్పూన్
పచ్చిమిర్చి......................4
కరివేపాకు........................2 రెబ్బలు
కొత్తమీర..........................1 టేబల్‌స్పూన్ తరిగినది
వంటసోడ.........................1/4 టీస్పూన్
నూనె..............................వేయించేందుకు కావలసినంత
ఉప్పు తగినంత
మిగిలి పోయిన ఇడ్లిపిండికానివ్వండి..లేక ఫ్రేష్‌గా ఉన్న ఇడ్లిపిండైనా ఒకే
(పిండి పుల్లగా ఉండకూడదు)
అందులో పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకొని..
{కారం ఎక్కువకావాలన్నా,తక్కువ కావాలన్నా మీరు చూసుకొని వేసుకోవచ్చు}
కరివేపాకుని,కొత్తమీరని సన్నగా తరిగి వేసి..
మామిడి తురుము,జిలకర్ర,వంటసోడ,ఉప్పు,వేసి బాగాకలిపి
కాగుతున్న నూనెలో ఈ పిండిని పునుగులుగా వేసి దోరగా వేయించిన తరువాత
చిల్లుల గరిటతో తీసి వేడి వేడి గా వడ్డించవచ్చు..
10: నిముషల్లో అయిపోయే ఈ స్నాక్ ఇడ్లి పిండి మిగిలినప్పుడు కాని
లేక ఫ్రేష్‌గా కాని చేసుకోవచ్చును
మరి మీరూ ఈ మామిడికాయ పునుగులు చేసి రుచి చూస్తారా?
(ఇడ్లిపిండి ఎక్కువ జారుగా ఉంటే కాస్త మైదాపిండి కలుపుకోవచ్చు )
******************************************************************************
Subscribe to:
Posts (Atom)