Friday, May 08, 2009

Mango Pudding

అన్నీ సిద్దంగా వున్నాయనుకొండి 20 నిముషల్లో చేసేయొచ్చు

!! మామిడి పెరుగు స్వీట్ !!

పెరుగు ~~ 1/2 కప్స్

మామిడి పండ్ల గుజ్జు ~~ 1 కప్

మామిడి ఎస్సెన్స్ ~~ 1/2 టీస్పూన్

కండెన్స్ మిల్క్ ~~ 1 కప్


!! చేసే విధము !!

పెరుగును పలుచటి గుడ్డలో కట్టి వేలాడదీయాలి.

అందులోని నీరంతా పోయేదాక అలా వదిలేయాలి.

తరువాత ఆ పెరుగు ముద్దని,మామిడి పండ్ల గుజ్జు,

ఎస్సెన్స్,కండెన్స మిల్క్ కలిపి మిక్సీలో వేసి బాగా మృదువుగా

అయ్యాక తీసి చల్లగా వడ్డించాలి సన్నగా తరిగిన

జీడీపపు,పిస్తా ముక్క్లలతో అలంకరించడమే..

వేసవి కాలంలో ఇంటికి వచ్చే

అథిదులకు మీరిచ్చే చల్లటి మృదువైన స్వీట్...

పచ్చి ఉసిరికాయ పచ్చడి

!! కావలసిన పదార్ధాలు !!

చక్కటి ఉసిరికాయలు ~~ 15

కొత్తిమిరి ~~ 1 కట్ట

పచ్చిమిరపకాయలు ~~ 6

ఎండు మిరపకాయలు ~~ 4

ఆవాలు ~ 1/3 టీస్పూన్

ఇంగువ ~~ 2 చిటికెలు


!! చేసే విధానం !!

ముందు ఉసిరికాయలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి

ఉడికిన ఉసిరికాయలలోంచి పిక్కలు తీసి పారేసి ముద్దగా చేసుకోవాలి

పచ్చిమిరపకాయలు(మనం తినే కారాన్ని అనుసరించి)కొత్తిమిరీ కలిపి మిక్సీలో ముద్ద చేసుకోవాలి

ఆ ముద్దను ఉసిరికాయల ముద్దకు కలుపుకోవాలి

అలా తయారయిన ముద్దకు ఎండు మిరపా,ఆవాలు,ఇంగువా పోపు వేసి

తగినంత ఉప్పువేసుకుని నెయ్యి కలిపిన వేడి అన్నంలో తింటే ఉంటుంది నా సామి రంగా...