Friday, August 01, 2008
పుదిన పచ్చడి
!! కావలసిన పధార్థాలు !!
పుడిన 1 కట్ట
ఎండుకొబ్బెర కోరు కాని
పచ్చికొబ్బెర కోరు కాని 4 టేబల్‌స్పూన్
చింతపండు 50 గ్రా
చనగపప్పు 1 టేబల్‌స్పూన్
ఉద్దిపప్పు 11/2 టేబల్‌స్పూన్స్
మెంతులు 15 గింజలు
పచ్చిమిర్చి 6
నూనే 3 టేబల్‌స్పూన్స్
ఉప్పు రుచికి తగినంత
!! చేసే విధానం !!
ముందుగ పుదిన బాగా కడిగి వుంచుకోండి.
మూకుడులో కాస్త నునె వేసి,చనగపప్పు,ఉద్దిపప్పు,
మెంతులు దోరగా వేయించుకొని, ఎండుకొబ్బెర,చింతపండు,
పచ్చిమిర్చి విడి విడిగా వేయించుకొని,
ఉప్పు,పుదిన తక్కినవన్నీ వేసి అన్నీ బాగా గ్రైండ్ చేసి
పైన పోపు వేయండి. ఇది వేడి వేడి అన్నానికే గాక, దోసకి,
మైసూర్ బజ్జి,లాంటివన్నిటికీ చాలా బాగుంటుంది.
మరి మీరూ ట్రై చేస్తారా ? :)
బాగుంటే కింద మెస్సెజ్ రాసి మీ అభిప్రాయాలు తెలుపండి :)
Subscribe to:
Posts (Atom)