Tuesday, November 25, 2014

Cucumber salad {దోసకాయలు}


నిమిషల్లో చేసే ఐటమ్స్ (quick fixes),





















పెద్ద దోసకాయలు------------2
కొత్తిమీర తురుము-----------2 టేబల్‌స్పూన్
కరేపాకు రెమ్మలు------------2
కొబ్బర తురుము------------2
(పచ్చిది) 
పచ్చి మిర్చి-----------------3
అల్లం తురుము-------------1 టీస్పూన్  
పప్పులు--------------------2 టేబల్‌స్పూన్స్
{Roasted Chana}

నీనె------------------------1 టేబల్‌స్పూన్ 
ఉప్పు తగినంత


పోపుగింజలు-------------1 1/2 టెబల్‌స్పూన్స్
{శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జికర్ర,ఏండుమిర్చి,ఇంగువ.}

చేసే విధానం::

దోసకాయలు నీళ్ళతో బాగా కడిగి బట్టతో తుడచి
చిన్న చిన్న ముక్కలుగా ఒకే పద్ధతిలో ముక్కలు చేసి ఒక బౌల్ లో వేసి ఉంచండి.

పచ్చిమిర్చి..పచ్చి కొబ్బర..పప్పులు..కరేపాకు ఒక రెమ్మ..అల్లం తురుము..కొత్తమీర ఒక స్పూన్..
అన్ని కలిపి మిక్సిలో గ్రైండ్ చేసుకొని...ఆ మసాలను..తరిగి ఉంచిన దోసముక్కలపై వేసి
అందులో ఉప్పు వేసి బాగా కలిపి ఆ సలాడ్ పై తిరుగువాత (తాలింపు) వేసి మళ్ళి ఒక సారి కలిపి తింటే మళ్ళి మళ్ళి మీరే చేసుకొంటారు..

{ఇందులో కావాలంటే పెసరపప్పు ఓ గంట నానేసి నీళ్ళు లేకుండగ వట్టి పప్పు మాత్రమే వేసుకోవచ్చు} 

క్యారెట్టు తురుము కాబేజి తురుము ఏదైనా వేసుకోవచ్చు,పెసలు నానపెట్టి వేసినా మరీ బాగుంటుంది

మీకు తెలియంది కాదు ఇదీ ఒకసారి ట్రై చేయండి