కావలసినవి::
బియ్యం.....................ఒక కప్పు
బెల్లం........................అర కప్పు
పచ్చికొబ్బరి..............పావు చిప్ప
గసగసాలు................రెండు చెంచాలు
యాలకులు...............3
నెయ్యి......................4 టేబల్‌స్పూన్స్
చేసే విధానం::
ఒక రోజు ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
బియ్యం జల్లెడలో పోసి నీళ్ళంతా వడకట్టి
గ్రైండర్లో పొడి చేసుకుని జల్లించి తడి ఆరిపోకుండా దగ్గరగా నొక్కి పెట్టుకోవాలి.
పిండి ఆరిపోకూడదు.తడిగుడ్డ గట్టిగా పిండి ఆ పిండిపై కప్పి ఉంచండి
అప్పుడు తడి ఆరిపోకుండగా ఉంటుంది.
కొబ్బరికాయ సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
మూకుడు లో నెయ్యి వేడి చేసి కొబ్బరిముక్కలు ఎర్రగా వేయించి పక్కన ఉంచండి.
అందులోనే గసగసాలు కూడా వేయించి పక్కన ఉంచండి.
యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి.
బెల్లం తురిమి,పావు కప్పు నీరు పోసి ఉడికించి, మరీ లేత కాకుండా మరీ ముదురు పాకం కాకుండా
చేసి యాలకుల పొడి, నెయ్యి కలిపి క్రిందకు దించి కొద్దికొద్దిగా బియ్యం పిండి వేస్తూ
గరిటతో ఉండలు లేకుండా కలుపుతూ చివరగా కొబ్బరిముక్క్లలు,గసగసాలు కూడా
కలిపి మూతపెట్టి ఉంచాలి. చలిమిడి రెడీ.....మరి మీరు తయారా ..మీకు నచ్చుంటే నాకో మెస్సేజి పెట్టండి :)