Friday, April 22, 2011

మామిడికాయ,పల్లీల,ఆవకాయ (Peanut,Mongo,Pickle)

















కావలసినవి::

మామిడికాయలు:::3
ఆవపిండి:::::::::3 టేబల్‌స్పూన్
మెంతిపిండి:::::::2 టేబల్‌స్పూన్
వేరుశనక్కాయలు:1 కప్పు 
కారం:::::::::::1 కప్పు 
ఉప్పు:::::::::::::3 టేబల్‌స్పూన్
పసుపు:::::::::::1/2 టేబల్‌స్పూన్
వెల్లుల్లి:::::::::5 రెబ్బలు
పల్లీల నూనె:::6 టేబల్‌స్పూన్
ఆవాలు::::::::::1/2 టేబల్‌స్పూన్
ఇంగువ:::::::::::1/3 టీస్పూన్
ఎండుమిర్చి:::::::4

చేసే విధానం:: 

ష్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టి పాన్ వేడి అయిన తరువాత
వేరుశనగగింజలను కాస్త Lite గా వేయించి తొక్కతీసి పొడిచేసి ఉంచుకొండి. 

ఒక జాడిలోకి 
బాగా కడిగి గుడ్డతో తుడిచి,మీకు కావలసిన రీతిలో ముక్కలు చేసుకొన్న మామిడికాయలు, 
ఒక కప్పు కారం, ఆవపిండి,ఉప్పు,పసుపు,మెంతిపొడి,వేరుశనగపొడి  
వెల్లుల్లి రెబ్బలు పొట్టుతీసి వాటిని కాస్త నాలుగు ముక్కలుగా చెసుకొని 
ఆ ముక్కలూ ఈ జాడిలో వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలపండి.

ఆ తరువాత వేరుశనగల నూనె పాన్లో వేసి కాస్త ఆవాలు,ఎండిమిర్చి వేసి
ఆ నూనె కాగి ఆవాలు చిటపట అన్నతరువాత,ఈ మిశ్రమములో కలపండి
కలిపే పద్ధతి ఎలా అంటే మీరు కలపడం మొదలెట్టాక నూనె ఊట పైకి తేలుతుంది
అప్పుడు బాగా కలిసిపోయిందని అర్థం నాలుగురోజుల తరువాత వేడి వేడి అన్నానికి
ఈ ఆవకాయ వేసుకొని తింటే వావ్...అనకుండా ఉండలేరు :)

మీరూ Try చేసి చూడండి :)

!!వెల్లుల్లి రెబ్బలు వద్దనుకొంటే దానికి బదులు కాస్త 
ఇంగువ వేసుకొంటే మాంచి వాసనతో నోరు ఊరించేస్తుంది!!  



















maamiDikaaya,palliila,Avakaaya 

( Peanut,Mango,Pickle )

kaavalasinavi::


vEruSanakkaayalu:::1 Cup Peanuts)

maamiDikaayalu::::::3 (Raw mangoes )
AvapinDi::::::::::::::::3 TEbal spoon ( Mustard powder )
mentipinDi::::::::::::::2 TEbal spoon ( Fenugreek Powder)
kaaram:::::::::::::::::::1Cup
Red chili powder )
uppu:::::::::::::::::::::::3 TEbal spoon ( Salt)
pasupu::::::::::::::::::::1/2 TEbal spoon ( Turmeric powder )
vellulli:::::::::::::::::::::5 rebbalu ( Garlic flakes  )
palliila noone::::::::::::6 TEbal spoon (  peanut oil )
aavaalu:::::::::::::::::::1/2 TEbal spoon ( Mustard )
inguva:::::::::::::::::::::1/3 Teespoon (Asafetida, Inguva)
enDumirchi::::::::::::::Red chili )

Chese vidhaanam:: 

 stove veliginchi daanipai paan petti paan vedi ayina taruvaata
veru sanagaginjalanu kaasta  Lite  gaa veyinchi tokkateesi powder chesi unchukondi. 

(Take a big bowl ) pedda bowl teesukoni

baagaa kadigi guddato tudichi,meeku kaavalasina reetilo mukkalu chesukonna maamidikaayalu, 
one cup kaaram,  Avapindi, uppu, pasupu, mentipodi,veru sanaga podi  
vellulli rebbalu pottu teesi vaatini  naalugu mukkalugaa chesukoni 
aa mukkaluu ii jaadilo vesukoni aa misramaanni baagaa kalapandi.

aa taruvaata veru sanagala noone paan lo vesi kaasta Avaalu,endumirchi vesi
aa noone kaagi aavaalu chita pata anna taruvaata,ii misramamulo kalapandi
kalipe paddhati elaa ante meeru kalapadam modalettaaka noone uta paiki telutundi
appudu baagaa kalisipoyindani artham . naalugurojula taruvaata vedi vedi  annaaniki
ii aavakaaya vesukoni tinte ...  waav...anakundaa undaleru :)

meeruu try chesi chudandi :)

!!vellulli rebbalu vaddanukonte daaniki badulu kaasta 
inguva vesukonte maanchi vaasanato nooru Urinchestundi!!  











Wednesday, April 20, 2011

పెసరపప్పు మామిడికాయ పచ్చడి













కావలసినవి::

నానపెట్టిన పెసరపప్పు::: 4 టేబల్‌స్పూన్స్
పచ్చిమామిడికాయ కట్ చేసినవి:::1 కప్
ధనియ:::1/2 టేబల్‌స్పూన్
ఎండుమిర్చి:::6
వెల్లుల్లి రెబ్బలు :::2( ఇదికావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు)
ఉద్దిపప్పు:::1/2 టేబల్‌స్పూన్ (మినపప్పు)
ఆవాలు::::1/2 టేబల్‌స్పూన్ 
మెంతి గింజలు:::1/3 టీస్పూన్
కొత్తమీర:: ఒక కట్ట
నూనె:::సరిపడేంత
ఉప్పు,పసుపు:::రుచికి తగ్గత్లు 

తాళింపుకు కావలసినవి::

చనగపప్పు::: 1/2 టీస్పూన్ 
ఆవాలు::::::::: 1/2 టీస్పూన్ 
జిలకర::::::: 1/3 టీస్పూన్
ఉద్దిపప్పు:::::: 1/2 టీస్పూన్
ఎండుమిర్చి::::: 2
ఇంగువ రెండు చిటికెలు
కరివేపాకు:::: 2 రెబ్బలు
నూనె సరిపడినంత

చేసే విధానం:: 

ముందు ష్టవ్ పై పాన్ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయిన తరువాత  
ధనియాలు,మెంతులు,ఉద్దుపప్పు,ఎండుమిర్చి ఆవాలు, వేయించుకొని
దోరగా వేయించాలి...వేయించిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసి 
పక్కనుంచండి.

కొత్తమీర బాగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోండి.

ఈ నానపెట్టి ఉంచిన పెసరపప్పు నీళ్ళు వడగట్టి ఉంచుకోండి.

అదే పాన్లో కాస్త నూనె వేసి మామిడికాయ ముక్కలు లైట్ గా వేయించి


ముందు వేయించిన ఉంచిన వాటిని ఈ మామిడికాయ ముక్కల్ని తరిగిన కొత్తమీర 

పెసరపప్పు, గ్రైండర్ లో మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో తీసి ఉంచండి.

అదే పాన్లో ఒక స్పూన్ నూనె వేసి తాళింపు గింజలన్నీ వేసి ఇంగువ కరివేపాకు తోపాటు   
ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించి చట్నిలో కలిపి వేడి వేడి అన్నంతో తినండి  
అధిరిపోయిందని మీరే చెపుతారు :) 

( వెల్లుల్లి పాయలు కావాలంటే ఇంగువ వేసే బదులు వెల్లుల్లి వేసి వేయించాలి ) 


మామిడికాయ ఆకు కూరల పచ్చడి














మామిడికాయ ఆకు కూరల పచ్చడి 

ఈ పచ్చడి 15 రోజులు నిలవవుంటుంది

కావలసినవి::

పచ్చి మామిడికాయ ముక్కలు::::::1 కప్పు
తోటకూర,పాలకూర,తరిగినది::::::::2 కప్పులు
పుదిన,కొత్తమీర :::::::::::::::::::::::1 కప్పు
పచ్చిమిర్చి ::::::::::::::::::::::::::::4
వెల్లుల్లి రెబ్బలు:::::::::::::::::::::::::4
పసుపు,ఉప్పు తగినంత

నూనె తగినంత

తాళింపుకు కావలసినవి:: 

ఆవాలు,జిలకర,చనగపప్పు,
మినపప్పు,ఎండుమిర్చి,కరివేపాకు అన్నీ పోపుకు తగినంత వేసుకోవాలి
రెండు వెల్లుల్లి రెబ్బలు పాయలుగా కట్ చేసి ఉంచండి.


పచ్చడి చేసే విధానం::

ష్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి
అందులో పచ్చిమిర్చి వేసి దోరగా వేపండి.

వేయించిన పచ్చిమిర్చి తీసి అందులోనే తోటకూర,పాలకూర,పుదిన,కొత్తమీర,
వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి.

ఇప్పుడు ఈ వేయించిన వన్నీ..గ్రైండర్లో వేసి అందులోనే మామిడికాయముక్కలు
రెండు వెల్లుల్లి రెబ్బలు,ఉప్పు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.

ఈ గ్రైండ్ చేసిన పచ్చడిలోకి 

పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి..

ఆవాలు,జిలకర,ఉద్దిపప్పు,చనగపప్పు,ఎండుమిర్చి వేసి 

ఆవాలు చిటపట అనగానే రెండు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి అందులో వేసి

కరివేపాకు వేసి పచ్చడిలో కలపండి. ఈ పచ్చడి చపాతికీ,

వేడి వేడి అన్నానికి కలుపుకొని తిని చూడండి! ఆహా...ఏమి రుచీ 

Tuesday, April 19, 2011

కాప్సికం పచ్చడి


















కాప్సికం పచ్చడి

కావలసినవి::

కాప్సికం:::::::::2

ఉద్దిపప్పు:::::::1/2 టేబల్‌స్పూన్ 
చనగపప్పు:::::1/2 టేబల్‌స్పూన్ 
ఎండుమిర్చి:::::4
ధనియాలు::::::1/2 టేబల్‌స్పూన్ 
నువ్వులు:::::::1/2 టేబల్‌స్పూన్ 
పసుపు,ఉప్పు,కావలసినంత
వేరుశనక్కాయలు(పల్లీలు)1 టేబల్‌స్పూన్ 

పోపు కావలసినవి::


ఆవాలు::::::::::::::1/3 టీస్పూన్

జిలకర:::::::::::::::1/4టీస్పూన్
ఎండుమిర్చి::::::::::2
కరివేపాకు రెబ్బలు::1
ఇంగువ:::తగినంత 

చేసుకొనే విధానం::


ఉద్దిపప్పు::::::1/2 టేబల్‌స్పూన్ 

చనగపప్పు::::1/2 టేబల్‌స్పూన్ 
వేరుశనక్కాయలు(పల్లీలు)1 టేబల్‌స్పూన్ 
ఎండుమిర్చి::::4
ధనియాలు:::::1/2 టేబల్‌స్పూన్ 
నువ్వులు::::::1/2 టేబల్‌స్పూన్ 

ఇవన్ని నూనె లేకుండగ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొండి.

కాప్సికం ముక్కలుగా కట్ చేసుకొని పాన్లో ఒక స్పూన్ నూనె వేసి 
సగం ఉడికాక తీసి చల్లారాక వేయించిన దినుసులు ఈ కాప్సికం
ఉప్పు,పసుపు,వేసి గైండర్లో మెత్తగా చేసుకోండి.

తరువాత ఒక గిన్నెలో ఈ పచ్చడి తీసి 

కరేపాకుతో ఎండుమిర్చి వేసి ఇంగువ తాలిపు వేయండి

(పులుపు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు లేకపోతే 

వన్‌టీస్పూన్ చింతపండుగొజ్జు గ్రైండ్ చేసేముందు వేసి  గ్రైండ్ చేసుకోవచ్చు} 

ఈ పచ్చడి దోసకు,అన్నానికి చాలా రుచిగా ఉంటుంది మరి మీరూ చేసి చూస్తారా?