Monday, December 28, 2009

బీన్స్ కూర


!! కావలసినవి !!

బీన్స్ ------ 1/2 కిలో

నూనె ------- 1 గరిటెడు

పచ్చిమిర్చి ----- 4


ఇక ( పోపు గింజలు )

శనగ పప్పు ---- 1/2 టేబల్ స్పూన్

మినపప్పు ----- 1 టేబల్ స్పూన్

ఆవాలు ----- 1/2 టీ స్పూన్

జిలకర్ర ----- 1/2 టీ స్పూన్

ఇంగువ ------ 1/4 టీ స్పూన్

పచ్చి కొబ్బర తురుము --- 1/2 కప్పు

కరేపాకు రెబ్బలు ----- 2

కొత్తమిర తురుము ---- 1 టేబల్ స్పూన్

రుచికి ఉప్పు , పసుపు ,


!! చేసే విధానం !!

ముందు బీన్స్ నీళ్ళ తో బాగా కడిగి

సన్నగా ముక్కలు చేసి వుంచుకోండి.

పచ్చి మిర్చి కూడా సన్నగా పొడవిగా తరుక్కోని పక్కన వుంచండి.

ష్టవ్ పై మూకుడు పెట్టి అందులో గరిటెడు నూనె పోసి

నూనె కాగాక అందులో పోపు గింజలన్నీ వేసి

ఆవాలు చిట్లిన తరువాత,శగపప్పు దోరగా వేగిన తరువాత

అందులోకి పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు పసుపు వేసి

అందులోనే సన్నగా తరుక్కొన్న బీన్స్ ముక్కలు ఉప్పు వేసి

గరిటెతో బాగా కలిపి మూకుడికి సరిపడే ప్లేట్ మూసి

15 నిముషాలు అట్టే ష్టవ్ పై వుంచండి.

15 నిముషాల్లో బీన్స్ ఉడికిపోతాయి. అందులోకి

కొత్తమిరా,కొబ్బర తురుము వేసి మరోమారు కలిపి

ష్టవ్ పై నుండి దించేయడమే

కమ్మటి బీన్స్ కూర 15 నిముషాల్లో తయార్....

Saturday, October 10, 2009

చంద్రకాంతలు---(పెసర పప్పుతో చేసే ఒక రకమైన పిండి వంట.)

చంద్రకాంతలు (పెసర పప్పుతో చేసే ఒక రకమైన పిండి వంట.)

!! కావలసిన పదార్ధాలు !!


పెసర పప్పు ----- పావు కిలో

చక్కెర ------ పావు కిలో


నెయ్యి ------ పావు కిలో

కొబ్బరికోరు ------- ఒక కాయ నుండి తెల్లటి కొబ్బర

జీడి పప్పు,-- ఏలకలు, --కుంకుమ పువ్వు--- తగినన్ని.

!! తయారుచేయు విధానము !!

పెసర పప్పును నీటిలో ఒక గంటసేపు నానబెట్టండి.
బాగా కడిగి పొట్టు ఉంటే శుభ్రంగా తీసివేయాలి.


పప్పును మెత్తగా రుబ్బాలి. నీళ్ళు మరీ ఎక్కువగా గాని

మరీ తక్కువగా గాని వెయ్యకూడదు.

పచ్చి కొబ్బరి కోరు మరియు చక్కెర లను ఈ పెసర ముద్దలో కలిపి
పొయ్యి మీద పెట్టి హల్వాకు తిప్పిన విధంగా గరిటెతో తిప్పాలి
.


పావుగంట - ఇరవై నిమిషాలు పోయేసరికి చక్కెర పాకం అయి
పెసరముద్దలోని నీరు యింకిపోయి గట్టిపడుతుంది.

చెయ్యిపెట్టి చూస్తే చేతికి అంటుకోకుండా ముద్దలాగా అవుతుంది.

అప్పుడు సుగంధ ద్రవ్యాలు వేసి గరిటెతో మరోసారి కలిపి కిందకి దించాలి.

తెల్లని మందంగల గుడ్డ తీసుకుని, దానిని నీటితో తడిపి
నీరు పిండేసి ఆ తడిబట్టను ఒక పీటమీద మడతలు లేకుండా పరచాలి.


ఆ తడిబట్టమీద ఉడికిన పెసర ముద్దని పోసి,

చేత్తో అరచేతి మందంలో ఉండేటట్లు వత్తాలి.

ఆ పరిచిన పెసర ముద్ద ఆరటం వల్ల త్వరగా చల్లారుతుంది. అప్పుడు
కత్తితో మనకు కావలసిన ఆకారాల్లో, పరిమాణంలో కోసుకోవారి.

కోసిన ముక్కలను విడివిడిగా తీసి పెట్టుకోవాలి.

బూరెల మూకుడులో పావుకిలో నెయ్యి పోసి బాగా మరిగాక,

ఈ కోసిన ముక్కలు వేస్తే అవి పొంగి గుల్లగా విచ్చుకుంటాయి.

వీటిని మరీ ఎర్రగా కాకుండా, గోధుమ రంగు వచ్చేదాక వేగనిచ్చి తీసివేయాలి
మాంచి రుచితో కమ్మటి చంద్రకాంతలు తయార్ :)

Tuesday, September 15, 2009

పెసరపప్పు బూరెలు!! పెసరపప్పు బూరెలు !!

!!కావలసినవి!!

పెసరపప్పు ---- 2 కప్పులు

చక్కర --- 4 and half kappu

ఇలాచి --- 5

కర్పూరం --- 2 చిటికెలు

జీడిపప్పు --- 10

(జీడిపప్పును నేతిలో వేయించి చిన్న చిన్న పీసులిగా తుంచినవి)

నూనె వేయించెందుకు సరిపడేంత


!! దోసపిండి !!

మినపప్పు --- 1 కప్పు

బియ్యం --- 2 కప్పులు

ముందురోజు రాత్రి నానబెట్టి పొద్దున్నే రుబ్బుకోవాలి

దోసపిండి ఎలా రుబ్బుకోంటారో అలానే రుబ్బిపెట్టుకోవాలి


!! చేసే విధానం !!


పెసరపప్పు తెల్లారే 2 గంటలు నానబెట్టి

దానిని మిక్స్సిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి

ఆ పిండిని ఇడ్లీ ల్లా ఆవిరిపై ఉడికించాలి

(ష్టీం) చేయాలి

అవి ఇడ్లి మాదిరిగా వుడికిన తరువాత వాటిని

మిక్స్సిలో వేసి ఒక రెండు తిప్పులు తిప్పండి.

చక్కగా పుడిపొడిగా గ్రైండ్ అవుతుంది.

వాటితో పాటే చక్కర కలిపి గ్రైండ్ చేయాలి

గ్రైండ్ చేసిన పిండిలో ఇలాచి పౌడర్, జీడిపప్పు (చిన్న చిన్న

పీసులుగా చెసి వేయించినవి )కర్పూరం , అన్నీ వేసి

బాగా కలిపి చిన్న చిన్న రౌండుగా వుండలు చేసికొని


వాటిని దోసపిండిలో ముంచి నూనెలో

వేయించాలి మాంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి

నూనె లేకుండగా తీసి ప్లేట్ లో వేసి అందరికీ సర్వ్ చేయడమే...

ఘుమ ఘుమ లాడే పెసర బూరెలు రెడీ

Thursday, September 03, 2009

గోంగూర పప్పు
ఈ గోంగూర పప్పును రెండు విధాలుగా చేసుకోవచ్చు

ఒకటి ఆకు సన్నగా తరిగి ఉడికించడం.

రెండోది ఆకు మెత్తగా గ్రైండ్ చేసి వుడికించడం.

ఇప్పుడు మనం రెండో విధానాన్ని నేర్చుకొంద్దాం.

గోంగూర 3 కట్టలు తీసుకొని ఆకు దూసి,((pluck the leaves)

బాగా శుబ్రంగా కడిగి నీళ్ళు లేకుండగా తుడిచి పెట్టండి.

ష్టవ్ పై పెద్ద మూకుడు వుంచి అందులో ఒక్క గరిటెడు నూనె పోసి

నూనె కాగాక అందులో ఈ గోంగూర ఆకులు వేసి పచ్చివాసన

పోయెంత వరకు వేయించి 1/2 టేబల్ స్పూన్ ఉప్పువేసి

మెత్తగా గ్రైండ్ చేసి గట్టిగా మూత వున్న డబ్బాలో వేసి వుంచండి.

ఎప్పుడు మీరు పప్పు కాని, పచ్చడి కాని చేసుకోవాలంటే

ఈ ముద్దని వాడుకోవచ్చు.

!! ఇప్పుడు గోంగూర పప్పుకు కావలసినవి చూసుకొందాం !!గైండ్ చేసిన గోంగూర ముద్ద ఒక కప్పు

కందిపప్పు ------------- 2 ---- కప్పులు

ఆనియన్స్ ------------- 2

గ్రీన్‌చిల్లి ------------- 8 -----

వెల్లుల్లి -------------- 1 full garlic of 6--7

నూనె -------------- 1 ---- గరిటెడు

ఉప్పు రుచికి రగినంత...కరేపాకు ఒక రెబ్బ...

పోపు గింజలు ::-- చనగపప్పు----మినపప్పు----ఆవాలు----

జిలకర్ర----ఎండు మిర్చి--2--చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వుంచుకోండి.

!! చేసే విధానం !!

కందిపప్పు కడిగి 3 గ్లాసుల నీళ్ళుపోసి 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి

కంది పప్పుతో పాటు కుక్కర్ లో ఉడికించండి
5...వెల్లుల్లిపాయలు---రౌండుగా తరిగి...కొద్ది నూనెలో

దోరగా వేయించి పక్కన వుంచండి.

ఉడికిన పప్పులో----గోంగూర ముద్ద----పచ్చిమిర్చి----

4 ----పచ్చి వెల్లుల్లిపాయలు----పసుపు----ఉప్పు----వేసి---

(గోంగూర ఆకు గ్రైండ్ చేసే టప్పుడు ఉప్పు వేసుంటారు

కాబట్టి చూసుకొని ఉప్పు వేయండి)

బాగా మెత్తగా వుడికించి ష్టవ్ పై నుండి కిందికి దించేయండి.అదే ష్టవ్ పై చిన్న మూకుడు వుంచి అందులో గరిటెడు నూనె పోసి

వేడి అయ్యాక అందులో పోపుగింజలన్నీ వేసి దోరగా వేగాక

అందులో కరేపాకు----వేయించిన వెల్లుల్లి పాయలు వేసి---

ఆ పోపు అంతా గోంగూర పప్పులో వేసి బాగా కలపండి.కమ్మటి గోంగూర పప్పు తయార్
..........................

Saturday, August 29, 2009

వంకాయ,మామిడికాయ,పప్పు


!! కావలసినవి !!

కందిపప్పు ---------------2----కప్పులు

మామిడికాయలు ---------2----

వంకాయ ----------------3

పచ్చిమిర్చి --------------6

కరేపాకు ----------------2 --రెబ్బలు

చింతపండు జ్యూస్ -------1---టేబల్ స్పూన్

పసుపు---ఉప్పు---రుచికి---తగినంత---

పోపు గింజలు::---ఆవాలు--1/2--టీ స్పూన్---మినపప్పు--1--టీస్పూన్---

చనగపప్పు----1--టీస్పూన్---జిలకర్ర---1/2--టీస్పూన్----3-పించ్ ఇంగువ---

ఎండు మిర్చి--- 3---ఎండుకారం---1--టీస్పూన్---నూనె---ఒకటిన్నర గరిటే...

!! చేసే విధానం !!

కందిపప్పు...2...పావులకు...3...గ్లాసులనీళ్ళు...పోసి...

కుక్కర్ లో...మెత్తగా...వుడికించుకోవాలి...

మామిడికాయ...పొట్టు...పీల్...చేసి...మీక్కావలసిన...

విధంగా...ముక్కలు...చేసి...వుంచుకోండి...

వంకాయలూ...పచ్చిమిర్చి...కూడ...కట్...చేసి...వుంచండి...

వుడికిన...పప్పులో...వంకాయ...ముక్కలు...పచ్చిమిర్చి...ముక్కలు
...

మామిడికాయ...ముక్కలు...ఉప్పు...పసుపు...చింతపండుజ్యూస్...వేసి...

బాగా...మెత్తగా...ఉడికించుకోవాలి.....

కాయలన్నీ...మెత్తగా...ఉడికిన...తరువాత...పోపుగరిట......

ష్టవ్ పై...పెట్టి...నూనె...వేసి...వేడి...అయ్యాక...అందులో...

పోపు గింజలన్నీ...వేసి...ఎండుమిర్చి...చిన్న ముక్కలుగా
......

కట్‌చేసి...వేసి...చివర్లో....ఇంగువా...కరేపాకు...ఎండుకారం......

అన్నీ...వేసి----దోరగా...వేగాక...పప్పులోవేసి...కలపండి...

మామిడి...వంకాయ...పప్పు...తయార్...

ఘుమఘుమలాడే......పప్పుకు....

వేడి...వేడి...అన్నంలోకి...నెయ్యివేసుకొనితింటే...ఆహా...ఏమిరుచి...

బీహూన్ రైస్ నూడుల్స్
బీహూన్ రైస్ నూడుల్స్ (thin rice noodles)

Bee hoon rice vermicelli

(వీటినే ఛైనీస్ వాళ్ళు బీహూన్ అంటారు)

-::కావలసినవి::-
రైస్ నూడుల్స్--------------1/2-----ప్యాకెట్

గ్రీన్‌చిల్లి--------------------4-------

క్యారేట్ ముక్కలు ---------1------కప్పు

గ్రీన్‌పీస్-------------------1------కప్పు

ఆనియన్ ముక్కలు-------1------కప్పు

కార్న్ -------------------1------కప్పు

ఉల్లికాడ తురుము--------1------కప్పు

చీస్---------------------1/2----టేబల్ స్పూన్

నూనె--------------------2------గరిటెలు

సోయ సాస్-------------1-----టేబల్ స్పూన్(Soy sauce)

వైట్ పెప్పర్------------------(White pepper)

ఉప్పు రుచికి తగినంత

!! చేసే విధానం !!

ముందు...వేడి...వేడి...నీళ్ళల్లో...ఈ రైస్...నూడుల్స్...వేసి...

ఉప్పు...1--స్పూన్ నూనే...వేసి...అలా...15..నిముషాలు...వుంచి...చిల్లులున్న

గిన్నెలో...వడకట్టి...పక్కన...వుంచుకోండి...(నూనె వేయడం వల్ల...

వర్మసిల్లి...ఒకదానికి ఒకటి...అంటకుండగా...విడి విడిగా...వస్తాయి...)


గ్రీన్ ఛిల్లీ...పొడవు పొడవుగా...ముక్కలు చేసి...వుంచుకోండి...

ష్టవ్ పై...మూకుడు...వుంచి...ఒకటిన్నర గరిటె...నూనె...వేసి...

అది వేడి...అయ్యాక...అందులో...మిర్చి ముక్కలు...ఆనియన్ ముక్కలూ...

వేసి...దోరగా...వేయించండి...తరువాత...అందులో...క్యారేట్ ముక్కలు...

గ్రీన్ పీస్...కార్న్...కొద్దిగా...ఉప్పు...వేసి(నూడుల్స్ కి ఉప్పు

వేసుంటారు కాబట్టి కూరలకు...చూసుకొని ఉప్పు వేస్తే సరి)


సన్నటి...సెగపై...5:నిముషాలు...వుడికించి...అందులో...సోయా సాస్...

ఛీస్...నూడుల్స్...వైట్ పెప్పర్...వేసి...బాగా...కలపండి...పైన...

ఉల్లికాడలూ...డెకొరేట్ చేసి...చిల్లీ సాస్ తో గాని...

గ్రీన్ సలాడ్ తో గాని...లేక అలాగే తిన్నా...చాలా...బాగుంటుంది...

వావ్...వేడి...వేడి...రైస్ నూడుల్స్...తయార్.....

Wednesday, August 26, 2009

మైసూర్ మసాల దోసమైసూర్ మసాల దోస

ఇదివరకు మీకు ఒకరకం మైసూర్ దోస ఎలా చేయాలో రాసాను.

ఇది మరో రకం విడిగా మసాల చేసుకొని దోసకు రాసి చేయడం.

మరి ఈ రకం దోసకూడ చేసుకోవాలని ఆశ వుంటుంది కదూ...?

మరి ఇక ప్రిపేర్ చేద్దామా???

!!మసాలకు కావలసినవి !!

పుట్నాలు------------ 3 పిడికిళ్ళు

ఎండు మిర్చి----------6

చింతపండు----------- గోలికాయంత

జిలకర్ర------------- 1/2 టేబల్ స్పూన్

వెల్లుల్లి-------------- 6 పాయలు

ఉప్పు తగినంత--------

అన్నీ...పచ్చివి...మెత్తగా...గ్రైండ్...చేసి...ఉంచుకోండి...


దోస పిండి::-

బియ్యం ---------- 3 కప్పులు

మినపప్పు-------- 11/2 కప్పు

చనగపప్పు----- 1 టీ స్పూన్

కందిపప్పు------- 1/2 టేబల్ స్పూన్

మెంతులు---------- 1/2 టేబల్ స్పూన్

ఉప్పు తగిననత----

అన్నీ...కలిపి...ముందురోజు...రాత్రి...నానబెట్టి...

మెత్తగా...రుబ్బులోవాలి...పొద్దున రుబ్బి...సాయంత్రం...

దోసలేసుకొంటే...దోసపిండి...పొంగింటుంది...కాబట్టి...

దోసలు...కమ్మాగా...వస్తాయి...గరిట...జారుగా...చేసుకోవాలి...

దోస చేసే పద్ధతి::-

ఇప్పుడు...ష్టవ్ పై...దోసపెన్నం...పెట్టి...బాగా వేడయ్యాక...

దానిపై...దోసపిండి వేసి...

గోల్డ్ రంగు వచ్చాక...ఈ చేసి...

వుంచిన మసాల దోస పై...పూసి...దోస ఇంకో వైపుకు...తిప్పివేయాలి...

అటుపక్క...కొద్దిగా...కాల్చిన...తరువాత...మరీ...ఇటుపక్క..తిప్పీ...

దానిపై...పొటాటో...కూర పెట్టి...మడత వేసి...


కొబ్బరి పచ్చడితో...పొటాటో...కూరతో...వేడి వేడి గా...ఆరగించడమే..... :)

( గమనించవలసిన ప్రాథన...ముందు రాసిన...

వెరైటీ దోసలో...పొటాటో...కూర...ఎలా చేయాలో...

రాసాను...చూసుకోండి...)

వంకాయ ఆనియన్ పచ్చి పులుసు


!! కావలసినవి !!

వంకాయలు ----- --- 4

ఆనియన్ --- -------- 3

చింతపండు రసం---- ----1-----టేబల్ స్పూన్

పచ్చి మిర్చి-------------- 2

ధనియాలు --------------- 1/2 ----టేబల్ స్పూన్

జిలకర -------------------- 1/2 ----టీ స్పూన్

లవంగం -------------------- 2---- (cloves)

ఉప్పు...పసుపు...రుచికి తగినంత

పోపు గింజలు:-.. ఆవాలు...జిలకర్ర...ఎండుమిర్చి ఒకటి

(అన్నీ కలిపి-----------------1----స్పూన్ వుంటే చాలు)

నూనె --------------------- 2 ------గరిటెలు

ఎండుకొబ్బర ---- ----------1 ----టేబల్ స్పూన్(grated coconut)

కరేపాకు---కొత్తమీర---
తగినంత

ఎండుమిర్చి --- 4
(మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకో రెండు ఎండుమిర్చి వేసుకోవచ్చు)

!! చేసే విధానం !!

ముందు ధనియాలు....ఎండుమిర్చి....జీర....ఎండు కొబ్బర....లవంగం

అన్నీ...పచ్చివే...మిక్సిలో వేసి...బాగా...మెత్తగా...పౌడర్ చేసి...వుంచుకోండి.

తరువాత...వంకాయల్ని...నీళ్ళతో...కడిగి...పొడవు పొడవుగా...ముక్కలు చేసి

ఉప్పు...నీళ్ళల్లో...వేసి...వుంచండి...

అలాగే ఆనియన్...పచ్చిమిర్చి...ముక్కలు చేసి...వుంచుకోండి.

ష్టవ్ పై...మందపాటి...గిన్నె పెట్టి...అందులో...కొద్దిగ...నూనె వేసి...

కాస్త వేడి...అయ్యాక...అందులో...కరేపాకు...వేసి...

ఆనియన్...పచ్చిమిర్చి...కూడ వేసి...కాస్త...వేపండి...

ఆనియన్...కాస్త వేగాక...వంకాయ...ముక్కలు...3 గ్లాసుల...నీళ్ళు...

పసుపు...ఉప్పు...వేసి...మూత పెట్టి...10 నిముషాలు...వేగనివ్వండి...

పులుసు...బాగా...తెర్లుతున్నప్పుడు...రెడిగా...ఉంచుకొన్న...పౌడర్...

చిన్న బెల్లం ముక్కా...చింతపండు రసం...వేసి...5 నిముషాలు...

వుడకనివ్వండి...మాంచి ఘుమ...ఘుమ...వాసన వస్తునే...

పులుసు గిన్నె...క్రిందకు దించి... అదే ష్టవ్ పై...

చిన్న...మూకుడు...వుంచి...నూనె వేసి...ఆవాలు...జిలకర్ర...

ఎండుమిర్చి...వేసి...పోపు పెట్టి...కొత్తమీర...వేసి...

వెంటనే...మూత మూసేయండి...

(అలా మూత...మూయడంతో...పోపు...పులుసులోకి...కలిసిపోయి...

మాంచి...వాసనతో...రుచిగా...వుంటుంది)...వేడి అన్నానికీ...

చపాతికీ...దోసకీ...మహా...రుచిగా..వుంటుంది...మరి...మీరూ..

TRY చేస్తారా...??

Tuesday, August 25, 2009

బీట్రూట్ మసాల కూరబీట్రూట్ మసాల కూర

!! కావలసినవి !!

బీట్రూట్ -------------- పెద్ద గడ్డలు------3

పెప్పర్--------------- 1-----టేబల్ స్పూన్

సోంపు -------------- 1/2 -----టేబల్ స్పూన్

అల్లం --------------- (grated ginger)-----1/2 స్పూన్

చెక్క (cinnamon)-----చిన్న ముక్క

లవంగం (cloves) --------- 4

ఏలకులు -------------------- (6 whole cardamom )

ఆనియన్ --------------------- 2

వెల్లుల్లిపాయలు --------------- 5

పచ్చి కొబ్బర కోరినది (freshly grated coconut ) 1/2 కప్పు

కొత్తిమీర ----------------- 1 -----కట్ట

ఉప్పు, పసుపు. రుచికి తగినంత

!! చేసే విధానం !!

ముందు బీట్రూట్ ని బాగా కడిగి మీకు కావలసిన

షేపులో పెద్ద పెద్దగా ముక్కలుగా తరిగి వుంచుకోండి.

( పల్చగా U షేపు ఆకారంలో తరుగుతాను నేను.

మరీ పల్చగా వుండకూడదు ఒక్క రవ థిక్కుగా వుంటే సరి.)

బీట్రూట్ , మరుయు ఉప్పు పసుపుతో పాటు అన్నీ పచ్చివి గ్రైండ్ చేసి

ఈ బీట్రూట్ ముక్కలు , ఈ మసాల అన్నీ కలపి కుక్కర్లో వేసి

2 విజిల్ వచ్చాక దించేయండి.( నీళ్ళు వేయకూడదు)

కుక్కర్ నుండి ఉడికిన మసాలను తీసి 2 గరిటెల నూనేలో వేయించాలి.

అడుగు అంటకుండగా ష్టవ్ సిమ్ లో పెట్టి బీట్రూట్ ముక్కల్ని అటు ఇటూ

కదుపుతూ వుండాలి. 15 నిముషాల తరువాత ష్టవ్ ఆఫ్ చేసేయండి.

(పచ్చి వాసన పోయి మసాల జున్ను జున్నుగా రావాలి . మసాల గట్టి పడాలి .)

వేడి వేడి అన్నానికి కలుపుకొన్నా, చపాతికీ , చాలా చాలా రుచిగా వుంటుంది.

Monday, August 24, 2009

బాదం పచ్చది

ఇది నా friend వీణ "బాదం పచ్చడి"రెసిపి రాసినప్పుడు

అది చూసి ఏదో సరదాకి చేసా అబ్భా....భలే రుచిగా

వచ్చిందిలేండి నాకు నచ్చిన ఈ పచ్చడి మీకూ

నచ్చుతుందని మీకోసం ఈ రెసిపి వేస్తున్నా మరి

మీకూ నచ్చుతుందనుకొంటా...


!! కావలసినవి !!

నూనె లేకుండగా వేయించిన బాదం పప్పు-------1/2---కప్పు

వేయించిన వేరుశనగ(GROUNDNUTS)------- 2---స్పూన్స్

పుట్నాల పప్పు------------------------------- 2---స్పూన్స్

పచ్చిమిరపకాయలు----------------------------6---

జిలకర్ర-------------------------------------- 1/2---స్పూన్

కొత్తిమీర-----సగం కట్ట

గోలికాయంత------చింతపండు

(చింతపండు ఇష్టం లేనివారు టోమాటోలు 3 వాడవచ్చు)

రుచికి ఉప్పు,నూనె పోపుకు తగినంత..

!! చేసే విధానం !!

కొంచం...నూనె లో....జీర....పచ్చిమిరపకాయలు....

వేయించి....అందులో ఈ....బాదం పప్పు....పల్లీలు....

పుట్నాల పప్పు....వేసి చివాగా....కొత్తిమిర వేయాలి....

తరువాత ఉప్పు....చింతపండు....వేసి...అన్నీ గ్రైండ్ చేసుకోవాలి....

తరువాత....తిరుగుమొత పెట్టుకోవాలి.

వేడి వేడి అన్నానికి....యమ రుచిగా వుంతుంది...మరి మీరూ Try చేస్తారా ????

Monday, August 10, 2009

నువ్వుల పొడి అన్నం!! కావలసినవి !!

ముందుగా 2 పావుల బియ్యం పొడి పొడి గా అన్నం చేసి వుంచుకోవాలి

మినపప్పు 2 స్పూన్స్. --- ఎండుమిర్చి,10 ---- డ్రై చింతపండు.పెద్ద గోలికాయంత . ---

నువ్వులు, ఒక కప్పు. --- జీడిపప్పు 10. --- నెయ్యి,2 టేబల్ స్పూన్స్. ---

ఉప్పు,పసుపు,రుచికి తగినంత వేసుకోవాలి.---

నూనె, 3 గరిటెలు. --- ధనియాలు,ఒక టేబల్ స్పూన్. --- పోపు గింజలు,

చనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీర. --- ఇంగుబ,1/4 టీ స్పూన్. --- ఎండుమిర్చి 3
విడిగా వేయాలి మిర్చి


చిన్న చిన్న పీసులుగా చేసి పోపులో వేస్తే అవి నోటికి వచ్చినప్పుడు మాంచి టేష్ట్ గా వుంటుంది.

!! చేసే విధానం !!

పోపుగింజలు విడిచి అన్నీ దోరగా వేయించుకొని పొడి చేసి ఆ పోడిని పక్కనుంచుకోవాలి.

ఉడికిన అన్నాన్ని పెద్ద ప్లేటులో వేసి ఆరనిస్తే పొడి పొడిగా వుంటుంది.

కాస్త నెయ్యివేసి జీడిపప్పును దోరగా వేయించి ఉంచుకోండి.

పొడి పొడిగా వున్న అన్నానికి ఉప్పు,పసుపు,నెయ్యివేసి బాగా కలిపి,

పొడి చేసివుంచుకొన్న నువ్వులపొడిని అందులో వేసి బాగా కలపండి.

కలిపిన అన్నంలోకి నేతిలో వేయించిన జీడిపప్పును, తిరుగువాత,

వేసి మరో మారు బాగాకలిపి సర్వ్ చేయడమే.

(ఈ నువ్వులపొడి చేసి మూత గట్టిగా వున్న డబ్బలో వేసి వుంచితే,

ఎప్పుడైన అన్నానికి కలుపుకోవడానికి వీలుగా వుంటుంది )

అరటిపువ్వు కూర


!! కావలసినవి !!

అరటిపువ్వు ---- 1

ఆనియన్ ---- 2

పచ్చిమిర్చి ---- 5

నూనే ---- 100 గ్రాం

కోరిన కొబ్బరి ---- 1/2 కప్పు

ఉప్పు రుచికి తగినంత

పసుపు చిటికెడు

అల్లం ముక్క చిన్నది

పోపు గింజలు :- ఆవాలు -- ఉద్దిపప్పు -- చనగపప్పు --

జలకర్ర -- ఎండుమిర్చి 2 -- ఇంగువ చిటికెడు --

కరివేపాకు రెబ్బలు 2 --. అన్నీ కొద్దికొద్దిగా వేయాలి
.

!! చేసే విధానం !!

అరటిపువ్వు ముందు బాగా నీళ్ళతో కడిగి,చిల్లుల పళ్ళెములో వార్చి ఉంచాలి.

ఆనియన్ సన్నగా తరుక్కొని వుంచుకొండి.

కొబ్బరి,పచ్చిమిర్చి, అల్లం ,ఉప్పు ,కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

మూకుడులో నూనె వేడి చేసి పోపుగింజలు,కరివేపాకు వేసి అవి చిటపటలాడాకా ఆనియన్ వేయించి

అరటి పువ్వు పసుపు వేసి బాగా వేపాలి. కాసిన్ని నీళ్ళుపోసి ఉడికించితే కూర మెత్తగా ఉడుకుతుంది.

బాగా వేగిన తర్వాత మిగిలిన కొబ్బరి వేసి కలిపి దింపాలి.

(కావలసిన వారు అరటి పువ్వును ముందుగానే ఉడికించి పెట్టుకోని

పోపులో వేసి ఉడికించవచ్చు.)

Friday, July 17, 2009

దొండకాయ కూర

!! కావలసినవి !!

దొండకాయలు ---- 1/2 కిలో

పచ్చిమిర్చి ---- 4

నూనే ---- 2 గరిటెలు

పుట్నాల పోడి ---- 3 టేబల్ స్పూన్స్

ఎండు కొబ్బర ---- 2 టేబల్ స్పూన్స్

పసుపు , ఉప్పు . ---- రుచికి తగినంత

పోపు గింజలు :- ఆవాలు , మినపప్పు , చనగపప్పు ,

ఈ మూడు half half స్పూన్స్ వేయాలి.

జిలకర్ర , ఇంగువ , కరేపాకు , కొత్తిమిర .


!! చేసే విధానం !!

ముందు దొండకాయల్ని నీళ్ళతో బాగా కడిగి

మీకు కావలసిన రీతిలో కట్ చేసి వుంచండి.ష్టవ్ పై మూకుడు పెట్టి అందులో నూనే వేసి నూనే కాగాక

పోపుగింజలన్నీ వేసి ఆవాలు చిట్లిన తరువాత పచ్చిమిర్చి , కరేపాకు

వేసి అందులోనే తరిగిన దొండకాయల్ని వేసి ఉప్పు పసుపుకుద వేసి

మూతపెట్టి 15 నిముషాలు వేగనివ్వాలి.

వేగిన కూరలో కొబ్బర , పుట్నాల పొడి , కొత్తిమిర చల్లి బాగా కలిపి

దించేయడమే... వేడి అన్నానికీ చాలా బావుంటుంది

నీరజ గారు ఈ కూరలో మీకు పుట్నాల పొడి వద్దంటే

వేసుకో నక్కరలేదు.

కావలసిన వారు ఇందులో ఆనియన్ వేసి మరో వెరైటీగా చేసుకోవచ్చు.

దోస ఆవకాయ!! కావలసినవి !!

దోసకాయ ---- 1/2 కిలో

ఆవాలు పొడి ---- 4 టేబల్ స్పూన్స్

ఎండు మిర్చి కారం ---- 3 టేబల్ స్పూన్స్

ఉప్పు ---- తగినంత

నూనె ---- 100 గ్రా


పోపు గింజలు:- ఆవాలు , మినపప్పు , జిలకర్ర, ఇంగువ , డ్రైచిల్లీ

!! చేసే విధానం !!

దోసకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో ఆవాల పొడి ,

ఉప్పు , కారం పొడి , నూనె , వేసి బాగా కలపండి.

చివర్ల్లో ఆవాలు , మినపప్పు , జిలకర్ర , ఇంగువ , డ్రైచిల్లీ , తో పోపు వేసి కలపండి

ఓ గంట ఆగి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆహా..ఏమి..రుచి .

Thursday, July 16, 2009

టోమాటో పప్పు!! కావలసినవి !!

కందిపప్పు ------ 2 కప్పులు

మెంతులు ------ 1/2 స్పూన్

టోమాటో ------ 8

చింతపండు జ్యూస్ ------ 1 టేబల్ స్పూన్స్

పచ్చిమిర్చి ------ 6

పోపుగింజలు :- ఆవాలు , మినపప్పు , చనగపప్పు ,

జిలకర్ర , ఎండుకారం 1/2 టేబల్ స్పూన్ , ఇంగువ , ఎండుమిర్చి 2 ,

కరేపాకు , కొత్తిమిర
.

!! చేసే విధానం !!

ముందు కందిపప్పులో మెంతులువేసి వుడికించి పెట్టండి.

( పప్పులో మెంతులువేసి వుడికించినచో గుండెజబ్బులులకు

సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయని పెద్దలు చెప్పారు)


ఉడుకిన పప్పులో టోమాటో , పచ్చిమిర్చి , ఉప్పు , పసుపు , కరేపాకు,

చింతపండు గుజ్జు వేసి బాగా వుడక నివ్వండి.

కళాయిలో నూనే వేసి పోపుగింజలు , కారంపొడి , ఇంగువ , వేసి కొత్తిమిర

చల్లి దించేయడమే .

వేడి అన్నానికి నెయ్యివేసి తింటే మాంచి రుచి.

చపాతికీ , నాన్ కీ , అన్నీటికీ బాగుంటుంది.

బిసి ఉప్పినేకాయి (కన్నడ వాళ్ళ ఐటం) Instant PicklesInstant Pickles
"వేడి ఊరగాయ" అని తెలుగులో అంటారు.

ఈ పచ్చడి(ఊరగాయ)అన్నానికీ,చపాతికీ

చాలా రుచిగావుంటుంది.మీరు ఒకసారి ట్రై చేస్తారా?

!! కావలసినవి !!

టోమాటోలు ---- 4

ఆవాలు ---- 1 టేబల్ స్పూన్

మెంతులు ---- 1/4 టీ స్పూన్

ఎండి మిర్చి ---- 6

ఎండుకారం ---- 1/3 టేబల్ స్పూన్


పోపు గింజలు:- ఆవాలు,ఎండుమిర్చి,కరేపాకు,ఇంగువ.

నూనే పెద్ద గరిటెడు

ఉప్పు,పసుపు తగినంత.

!! చేసే విధానం !!

ముందు మెంతులు,ఆవాలు,ఎండుమిర్చి. విడివిడిగా వేయించుకోవాలి.

వేయించిన వాటిని మెత్తగా గ్రైండ్ చేసి వుంచుకొండి.

బాణలి లో సగం గరిటెడు నూనె పోసి అందులో

ముక్కలు చేసి వుంచుకొన్న టోమాటోలు ఉప్పు,పసుపు,ఎండుకారం,వేసి

అటు ఇటు కలిపి మూతపెట్టి సన్నటి సెగపై మెత్తగా వుడికించండి.

బాగా వుడికిన టోమాటో లో ఈ గ్రైండ్ చేసిఉంచిన పొడి వేసి

బాగా కలిపి ష్టవ్ పైనుండి దించేయండి.

చిన్న కడాయిలో మిగిలిన నూనే వేసి పోపుగింజలతో పాటు

కరేపాకు,ఇంగువతో పోపుపెట్టేయడమే....తినగా తినగా..

ఆహా..ఏమి రుచి....మీరూ చేసి చూడండి .రాయలసీమవారికి

బహుప్రీతికరమైన వంటకం:)

గోరు చిక్కుడుకాయల కూర!! కావలసినవి !!

చిక్కుడు కాయలు --- 1/2 కిలో

ఎండు మిర్చి --- 4

వెల్లుల్లి --- 3

జిలకర్ర --- 1/2 టీ స్పూన్

చింతపండు గుజ్జు --- 2 టేబల్ స్పొన్న్స్

పచ్చికొబ్బరకోరు --- 3 టేబల్ స్పూన్స్

(ఎండు కొబ్బరైనా ఒకే)

పుట్నాలు (Roasted Chana Dal) 3 టేబల్ స్పూన్స్

పోపు గింజలు:- ఆవాలు,మినపప్పు,చనగపప్పు,జిలకర్ర,

పచ్చిమిర్చి 2 ,కరేపాకు 2 రెబ్బలు, నూనె 2 గరిటెలు.

ఉప్పు, రుచికి తగిననత

కొత్తిమిర ఒక కట్ట


!! చేసే విధానం !!

గోరుచిక్కుడుకాయలు బాగా కడిగి,తరిగి వుంచుకొండి.

ఎండుమిర్చి,వెల్లుల్లి,కొబ్బర,జిలకర్ర,పప్పులు,చింతపండు.అన్నీ గ్రైండ్ చేసి వుంచండి.

ష్టవ్ పై మూకుడు వుంచి ఒక గరిటెడు నూనె పోసి వేడి చేసిన తరువాత

అందులో పోపుగింజలు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత గోరుచిక్కుడు,

పసుపు,ఉప్పు, వేసి బాగాకలిపి మూతమూసివుంచండి.

10 నిముషాల తరువాత ఈ గ్రైండ్ చేసిన పేష్ట్ వేసి మళ్ళి బాగా కలిపి

10 నిముషాలు మాడకుండగ వుండకనివ్వండి. అప్పుడప్పుడు మూత తీసి కలియబెట్టాలి.

బాగా మెత్తగా వుడికిన తరువాత కొత్తిమిర చల్లి దించేయడమే...

చపాతికి,వేడి అన్నానికి,పుల్కాలు, వీటన్నిటికి భలే రుచిగా వుంటుంది.

గుమ్మడికాయ పులుసు


!! కావలసినవి !!

చిన్న గుమ్మడికాయలో సగం ముక్క

ఆనియన్స్ --- 3

పచ్చిమిర్చి --- 3

ధనియాలు --- 1 1/2 టేబల్ స్పూన్స్

మెంతులు --- 1/2 టీ స్పూన్

చింతపండు --- పెద్ద నిమ్మకాయంత

ఎండుమిర్చి --- 4

నూనె --- 2 టేబల్ స్పూన్స్

ఉప్పు,పసుపు --- రుచికి తగినంత

బెల్లం --- చిన్న నిమ్మసైజంత

పోపుగింజలు --- ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి.

ఎండుకొబ్బెర --- 1 టేబల్ స్పూన్

బియ్యం పిండి --- 2 టేబల్ స్పూన్స్

కరేపాకు --- 2 రెబ్బలు

కొత్తిమిర --- 1/2 కట్ట

కారం --- 1/2 టేబల్ స్పూన్


!! చేసే విధానం !!

ష్టవ్ పై దట్టమైన కడాయివుంచి అందులో ఒక స్పూన్ నూనె వేసి

పచ్చిమిర్చి,కరేపాకు,ఆనియన్ వేసి వేయించి అందులో

పొట్టు తీసిన గుమ్మడికాయ ముక్కలు వేసి, 2 గ్లాసుల నీళ్ళుపోసి ఉడకబెట్టాలి.

ఎండుమిర్చి,ధనియాలు,మెంతులు,ఎండుకొబ్బర,అన్నీ దోరగా వేయించి గ్రైండ్ చేసి

పులుసులో వేయాలి.పసుపు,బెల్లం,ఉప్పు,కారం కొత్తిమిర వేసి,చింతపండు గొజ్జుతీసి

పులుసులో వేసి బియ్యంపిండిని సగం గ్లాసు నీళ్ళల్లో కలిపి పులుసులో వేసి

(చిక్కగావుంటే ఒక గ్లాసు నీళ్ళుపోసి ) బాగా వుడకనివ్వాలి.

ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి తో పోపు పెట్టి

వేడి అన్నానికి నెయ్యివేసుకొని తింటే..ఆహా...ఏమి రుచి...

Wednesday, July 15, 2009

చిగురాకు పొడి (పౌడర్)!! కావలసినవి !!

ఎండు చిగురాకు --- 3 -- గ్లాసులు

నువ్వులు --- 1/2 -- గ్లాస్


జిలకర్ర --- 1/2 --- టేబల్ స్పూన్

ఎండు కొబ్బెర --- 1/4 -- గ్లాస్


ఉద్దిపప్పు --- 1/4 క్లాస్

బెల్లము --- చిన్న నిమ్మపండంత

ఎండు మిర్చి --- 1/2 -- గ్లాస్

నూనె --- 1 -- చిన్న గరిటె

ఉప్పు,ఇంగువ .

!! చేసే విధానం !!

అన్నీ విడివిడిగా వేయించుకొని ఉప్పు,ఇంగువ, బెల్లం తో కలిపి అన్నీ

మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

దోస,ఇడ్లి,చపాతి,వేడి అన్నానికి చాలా చాలా రుచిగా వుంటుంది
.

మెంత పొడి!! కావలసినవి !!

చనగపప్పు --- 1 -- గ్లాసు

మినపప్పు --- 1 -- గ్లాసు

కందిపప్పు --- 1/2 -- గ్లాసు

పెసరపప్పు --- 1/2 -- గ్లాసు

మినుములు --- 1/4 -- గ్లాసు

గోధుమలు --- 1 -- పిడికెడు

బియ్యం --- 1 -- పిడికెడు

జిలకర్ర --- 1 -- టేబల్ స్పూన్

ఎండుసొంటి --- 1 -- కొద్దిగా

మెంతులు --- 1/2 -- స్పూన్

ఎండు కరేపాకు - 1 -- కప్పు

ఎండు పసుపు కొమ్మ చిన్నది

ఉప్పు,ఇంగువ .


!! చేసే విధానం !!

కందిపప్పు,చనగపప్పు,మినపప్పు,పెసరపప్పు,మినుములు,

గోధుమలు,బియ్యం,పసుపు,సొంటి,మెంతులు,జిలకర్ర,కరేపాకు.

అన్నీ విడివిడిగా వేయించుకొని ఉప్పు,ఇంగువతో కలిపి అన్నీ

మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.


ఇది వేడి వేడి అన్నానికి నూనె కాని, నెయ్యి కాని, వేసుకొని తింటే

చాలా రుచిగా వుంటుంది.పిల్లలకి మాంచి పోషక ఆహారం.

Tuesday, July 14, 2009

కందిపొడి


!! కావలసినవి !!

కందిపొప్పు --- 2 -- కప్పులు

పెసరపప్పు --- 1 -- కప్పు

మినపప్పు --- 1 1/2 కప్పు

చనగపప్పు --- 3/4 -- కప్పు

జిలకర్ర --- 1/3 -- స్పూన్

ఎండుమిర్చి --- 1 -- కప్పు

ఉప్పు,ఇంగువ,కొద్దిగ నూనె
.

!! చేసే విధానం !!

కొద్దిగా నూనె వేసి అన్నీ విడివిడిగా దోరగా వేయించుకొని

అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడమే...వేడి వేడి అన్నానికి

నెయ్యివేసుకొని తింటే...ఆహా..ఏమిరుచి....

వేరుశనగల పొడి -- (Groundnuts powder)!! కావలసినవి !!

వేరుశనగలు --- 2 --కప్పులు

ధనియాలు --- 2 --టేబల్ స్పూన్స్

జిలకర్ర --- 1 -- టేబల్ స్పూన్

ఎండుమిర్చి --- 1/2 -- కప్పు

ఎండుకొబ్బెరకోరు --- 1/2 కప్పు

చిన్న నిమ్మకాయంత --- చింతపందు
(మీకు కావాలంటే వేసుకోవచ్చు)

ఇంగువ --- 1/2 --- టీ స్పూన్

ఉప్పు రుచికి తగినంత

నూనె వేయించుకొనెందుకు తగినంత

గోలికాయంత --- బెల్లం


!! చేసే విధానం !!

దట్టమైన మూకుడులో కొద్దిగ నునె వేసి వేరుశనగలు,ఎండుమిర్చి,

జిలకర్ర,చింతపండు,ఎండు కొబ్బెర. అన్నీ విడి విడి గా దోరగా

వేయించుకొని ఉప్పు, బెల్లం,ఇంగువ వేసి దోరగా వేయించినవాటితో

కలిపి అన్నీ గ్రైండ్ చేసుకొవాలి.(కావలసిన వారు పోపుకూడవేసుకోవచ్చు)

పోపుగింజలు:-ఆవాలు,ఎండుమిర్చి,కరేపాకు,తో పోపు వేయాలి)

చట్నీపొడి!! కావలసినవి !!

చనగపప్పు -- 2 కప్పులు

మినపప్పు -- 2 కప్పులు

ఎండుకొబ్బెర తురుము -- 1/2 కప్పు

ఎండుమిర్చి -- 55 గ్రా

పోపుగింజలు..ఆవాలు -- 1 టేబల్ స్పూన్

మినపప్పు, -- 2 టేబల్ స్పూన్స్

చిన్నగా తుంచిన ఎండుమిర్చి -- 20

నునె -- 3 గరిటెలు

పెద్ద నిమ్మపండు సైజు చింతపండు

ఉప్పు -- రుచికి తగినంత

కరేపాకు --- 2 రెబ్బలు

బెల్లం -- నిమ్మపండుసైజు

ఇంగువ --- 1/2 టేబల్ స్పూన్


!! చేసే విధానం !!

చనగపప్పు,మినపప్పు దోరగా విడివిడిగా వేయించుకొని

కొబ్బెరపొడి,చింతపండు,బెల్లం,ఉప్పు,ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి.

తరువాత ముకుడులో నూనెవేసి ఆవాలు,మినపప్పు,తుంచిన ఎండుమిర్చి,

కరేపాకు,ఇంగువ. వేసి ఆవాలు చిట్లిన తరువాత ఆ పొడిలో వేసి

బాగా కలపాలి. ఇది ఇడ్లి,దోస,చపాతి,వేడి అన్నానికి

చాలా కమ్మగా రుచిగా వుంటుంది.

ఆహా ఏమి రుచి....

కరేపాకు పొడి!! కావలసినవి !!

ఎండు కరేపాకు -- 1/2 కిలో

చనగపప్పు -- 2 పిడికిళ్ళు

మినపప్పు -- 2 పిడికిళ్ళు

ఎండుకొబ్బెర తురుము -- 1/2 కప్పు

ఎండుమిర్చి -- 30 గ్రా

నిమ్మపండు సైజు చింతపండు

ఉప్పు -- రుచికి తగినంత

బెల్లం -- నిమ్మపండుసైజు

!! చేసే విధానం !!

అన్నీ దోరగా విడివిడిగా వేయించుకొని గ్రైండ్ చేయడమే

మాంచి రుచితో కమ్మాగా వుంటుంది

వేడి వేడి అన్నానికి నెయ్యివేసుకొని ఈ పొడితో తింటే

చాలా బాగా వుంటుంది...

మలబధకముతో బాధపడేవారికీ,

శరీరములో ఐరన్ తక్కువైన వారికీ,

ఆకలికాకుండగా వున్నవారికీ

ఈ కరేపాకు పొడి ఎంతో మేలుచేస్తుంది.

Tuesday, July 07, 2009

బియ్యంపిండి చెగోడీలు


!! కావలసినవి !!

బియ్యంపిండి -- 3 (పెద్ద) గ్లాసులు

పెసరపప్పు -- 1/2 కప్పు

ఉప్పు -- రుచికి తగినంత

వాము -- 1 టీ స్పూన్

ఎండు కారం -- 2 టేబల్ స్పూన్స్

నూనె -- వేయించెందుకు తగినంత

ఎందు కొబ్బెరకోరు -- 1 కప్పు

!! చేసే విధానం !!

ష్టవ్ పై దట్టమైన గిన్నె వుంచి అందులో

బియ్యంపిండికి సమపాళ్ళల్లో నీళ్ళుపోసి

బాగా బుడగలు బుడగలుగా తెర్లిన నీళ్ళల్లో

బియ్యంపిండి,పెసరపప్పు,ఉప్పు,వాము,కొబ్బెరకోరు.

వేసి బాగా పిండిని కలయబెట్టి ఉంటలు

రాకుండగా చూసి దించేయాలి.

బాగా చల్లారిన తర్వాత బియ్యంపిండిని

పొడవుగా కడ్డీలుగా చేసి రౌండుగా చుట్టాలి.

మీకు ఎన్ని చుట్లు చుట్టాలనిపిస్తే అన్ని

చుట్టోచ్చు.కొందరు సున్నామాదిరిగా చుట్టి

అతికిస్తారు. మీకు ఏవిధంగ కావాలో చేసుకొని

వాటిని నూనె లో ఎర్రగా వేయించాలి .

కావలసిన వారు 2 పిడికిళ్ళు వేరుశనగలు

పిండి చేసి వేస్తే మరీ రుచి ఎక్కువ మరి మీరు

తయారేనా???

Friday, June 12, 2009

చనగపప్పు పచ్చడి!! కావలసినవి !!
చనగపప్పు (Gramdal) -- 1/2 కప్పు

మినపప్పు --- 1 1/2 టేబల్ స్పూన్స్

ఆవాలు --- 1 టేబల్ స్పూన్

ఎండి మిర్చి --- 4

పచ్చి మిర్చి --- 2

బెల్లం ( jaggery ) 1/2 -- టేబల్ స్పూన్

ఉప్పు --- పసుపు --- రుచికి తగినంత

చిక్కటి చింతపండు రసం --- 2 టేబల్ స్పూన్స్

పచ్చి కొబ్బర ( లేక ఎండుకొబ్బర ) --- 1/4 కప్పు

నునె --- పోపు కు తగినంత ( తాలింపు )

కర్వేపాకు ఒక రెబ్బ

ఇంగువ --- 2 1/4 టీ స్పూన్

పోపు సామాగ్రి ఎండుమిర్చితోపాటు --- 1 టేబల్ స్పూన్

!! తాయారు చేసేవిధం !!

ముందు చనగ పప్పు,ఆవాలు,మినపప్పు,ఎండుమిర్చి,ఎండు కొబ్బర,

అన్నీ నూనె లేకుండగా దోరగా విడి విడి గా బాణలి లో వేయించుకోవాలి.

తర్వాత వేయించిన వాటిని , పచ్చిమిర్చి , పచ్చికొబ్బర , ఉప్పు ,పసుపు ,

బెల్లం , చింతపండు రసం , అన్నీ గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బిన పచ్చడి పై కర్వేపాకుతో , ఇంగువ వేసి పోపు పెట్టాలి.

వేడి వేడి అన్నానికి పచ్చి నునె వేసుకొని పచ్చడితో తింటే....ఆహా ఏమి రుచి...

వంకాయ పులుసు పచ్చడి


!! కావలసినవి !!

వంకాయలు --- 2

పసుపు --- చిటికెడు

పల్చటి చింతపండు రసం --- 4 టేబల్ స్పూన్స్

బెల్లం పొడి --- 1/4 ---కప్పు

ఆవపొడి --- 1/2 టేబల్ స్పూన్

ఇంగువ --- కొద్దిగా

సోంపు --- 1 టీ స్పూన్

మినపప్పు --- 1 టీ స్పూన్

ఆవాలు --- 1/2 టీ స్పూన్

ఎండు మిర్చి --- 3

పచ్చి మిర్చి --- 2

కరేపాకు --- ఒక రెబ్బ

నునె --- 25 గ్రా

ఉప్పు --- రుచికి తగినంత

!! తయారు చేసేవిధం !!

వంకాయలు కడిగి తుడిచి నునె రాసి కాల్చుకొవాలి.

తర్వాత వాటిని వలిచి ముద్దచేసి వుంచుకోవాలి.

దీనిలో చింతపండు రసం , ఉప్పు , పసుపు , బెల్లం , ఆవపొడి , వేయాలి.

ఇప్పుడు మిగిలిన దినుసులు ( ఆవాలు,మినపప్పు,సోంపు,ఎండుమిర్చి,పచ్చిమిర్చి,

కర్వేపాకు ) అన్నీ వేసి తాలింపు పెట్టి వంకాయలో కలుపుకొవడమే.

కావాలంటే కాచి చల్లారిన నీరు కొంచం పొసి పల్చగా చెసుకొవచ్చు.

కోత్తిమిర తురుము వేసుకొన్నా కమ్మగా వుంటుంది మరి మీరు తయారా ??? :)

నేను చేసి చూసాను నాకు బాగా నచ్చినందుకు మీరూ వండుకొంటారని వేసాను.

ఒకప్పుడు ఆంద్రభూమి సచిత్రవారి పత్రికలో వేసారు .వేసినవారి పేరు అంతగా

తెలియదు ఏదో " మాలతి " అని రావచ్చు అనుకొంటా ? మరి మీకు నచ్చితే కామెంట్ రాస్తారుగా

లక్ష్మి గారూ మీరు అడిగిన పచ్చడి తయార్ వండి మాకు తెలుపండి :)

Thursday, June 11, 2009

వంకాయ పచ్చికారం!! కావలసినవి !!

వంకాయలు --- 1/2 కిలో

నూనె --- 1 కప్పు

ఉప్పు , రుచికి తగినంత

పసుపు , చిటికెడు

అల్లం ముక్క , గోలికాయంత

పచ్చి మిర్చి --- 6

ధనియాలు --- 1 చెంచా

జిలకర్ర --- చిన్న చెంచా

వెల్లుల్లి --- 6

కొత్తిమిర తరుగు --- 1 కట్ట


!! తయారు చేసే విధానం !!

ముందుగా ధనియాలు,జిలకర్ర,అల్లం,పచ్చి మిర్చి వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

వంకాయలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

బాణలి వేడి చేసి అందులో నూనె మూడు వంతులు పోసి నునె వేడెక్కగానే

ముక్కలు వేసి 5 నిమిషాలు మూతపెట్టి వుంచాలి.

తర్వాత ముక్కలు మాడకుండగా కలుపుతూ , ఉప్పు , పసుపు , చల్లి మళ్ళీ బాగా కలపాలి.

వంకాయ ముక్కలు పూర్తిగా వేగినట్లు తెలియగానే పచ్చికారం ముద్ద వేసి బాగా కలపాలి.

వంకాయ ముద్దపై కొత్తమిర చల్లి వేడి వేడి గా వడ్డించడమే....

ఘుమ ఘుమ లాడే వంకాయ పచ్చికారం , చపాతి , రొట్టెల్లోకి , అన్నానికి భలే కమ్మాగా వుంటుంది.

కావాలంటే చనగపప్పు,మినపప్పు,జిలకర్ర,

ఆవాలు ఎండి మిర్చితో పైన పోపు వేసుకోవచ్చు .

కొబ్బరికాయ రవ లడ్డు!! కావలసినవి !!

రవ్వ -- 1 కప్పు

తాజా తెల్లటి కొబ్బరి తురుము -- 2 కప్పులు

పంచదార -- 1 1/2 కప్పులు

జీడిపప్పు -- కిస్మిస్ -- 20

చిటికెడు కుంకుమ పువ్వు

యాలకుల పొడి -- 1/2 టేబల్ స్పూన్

నెయ్యి -- 1.5 కప్పు


!! చేసే పద్ధతి !!

సన్నటి సెగపై రవ్వను 2, 3, నిమిషాలు వేయించాలి.

రెండు స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు , కిస్మిస్ లు వేయించుకోవాలి.

కుంకుమపువ్వును ఒక టీ స్పూన్ పాలలో వేసి

పాలు నారింజరంగుకు మారేవరకు కలియబెట్టి పక్కన వుంచుకోవాలి.

పావుకప్పుకు మించి నీటిని పంచదారలో పోసి వేడి చేసి వడకట్టి

మరో రెండు నిమిషాలు కాచాలి.పాకం బుడగలు వస్తున్నప్పుడు ష్టవ్ కట్టేయాలి.

మందపాటి పాత్రలో నెయ్యివేడి చేసి రవ్వ,కొబ్బరి మిస్రమాన్ని సన్నని సెగపై

5 నుంచి 7 నిమిషాలు వేయించాలి.

ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో పోసి,యలకులపొడి,జీడిపప్పు,కిస్మిస్ లు,

కుంకుమపువ్వు,కలిపిన పాలు వేసి కలియబెట్టాలి.

మిశ్రమం చల్లారాక నిమ్మకాయసైజు ఉండలు చేసుకొని

మూత గట్టిగా వున్న డబ్బాలో వుంచాలి.

అప్పుడప్పుడు మూత తీసి ఉండలు క్రిందికీ పైకీ మారుస్తుంటే

నెలరోజులు పాడైపోకుండగా వుంటాయి. మరి మీరూ రెడినా?

అరటికాయ వేపుడు!! కావలసినవి !!

అరటికాయలు -- 4

మజ్జిగ --- 2 కప్పులు

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత

కారం --- 1 టేబల్ స్పూన్

నూనె --- 3 టేబల్ స్పూన్స్

ఆవాలు , జీలకర్ర , 1 టేబల్ స్పూన్


ఎండు మిర్చి ముక్కలు -- 6


కరివేపాకు --- 1 రెబ్బ

ఇంగువ --- 2 pinches


!! చేసే పద్ధతి !!

అరటికాయ పై పెచ్చు పీల్ చేసి చక్రాలుగా కాని చిన్న ముక్కలుగా కాని

తరిగి మజ్జిగలో వేయాలి లేకుంటే నల్లబడతాయి.బాణలిలో నూనె వేసి

కాగిన తర్వాత ఆవాలు ,జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి , కరివేపాకు , వేసి అవి చిటపటలాడాకా

అరటిముక్కలు వేసి పసుపు,కారం,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

మధ్య మధ్యలో కదుపుతూ ఎర్రగా దోరగా వేగిన తర్వాత దింపాలి

వేడి వేడి అన్నంలోకి భలే రుచి ఆహా...ఏమి రుచీ :)

పనీర్ ఫ్రైడ్ రైస్


!! కావలసినవి !!

పన్నీర్ ముక్కలు -- 200 గ్రాం

బాస్మతి రైస్ -- 500 గ్రాం

నూనె -- 60 గ్రాం

పచ్చిబఠాణి -- 35 గ్రాం

జీడిపప్పు -- 30 గ్రాం

పచ్చి కొబ్బరి తురుము -- 1/2 కప్పు

క్యారట్ తురుము -- 1/4 కప్పు

ఉల్లికాడల తురుము -- 1/4 కప్పు

చిల్లీ సాస్ -- 1 టీస్పూన్

టొమాటో సాస్ -- 1.5 టీస్పూన్

అల్లం వెల్లుల్లి ముద్ద -- 1.5 టీస్పూన్

గరం మసాలా పొడి -- 1/2 టీస్పూన్

మిరియాలపొడి -- 1/2 టీస్పూన్

!! చేసే పద్ధతి !!

ఒక మూకుడు లో కొద్దిగా నూనె వేడి చేసి ముక్కలుగా కోసిన పన్నీర్ ముక్కలు,జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.

బియ్యం కడిగి కాస్త పొడిపొడిగా వండి పెట్టుకోవాలి.బాణలి లో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.


ఉల్లికాడల తురుము,పచ్చిబఠానీలు,క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి.

చిల్లీసాస్,టోమాటో సాస్,మిరియాల పొడి,గరం మసాలా పొడి,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇందులోనే పన్నీర్ ముక్కలు,జీడిపప్పు ముక్కలు,బిరుసుగా వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి.

చివరగా తురిమిన కొత్తిమిర,కొబ్బరి కూడా వేసి 1 నిమిషం ఉంచి దింపేయాలి.

10 నిముషాలు అలానే ఉంచి ఆ తర్వాత వడ్డించేయడమే...

Wednesday, June 10, 2009

మాంగో జామ్


!! కావలసినవి !!

మామిడిపండ్ల ముక్కలు -- 1/2 కిలో

నిమ్మరసం లేదా సిట్రిక్ ఆసిడ్ -- 1/2 స్పూన్

నీరు -- 1 కప్పు

పంచదార -- 1 కప్పు
!! చేసే పద్ధతి !!

మామిడిపళ్ళు పైపెచ్చు తీసి,చిన్న చిన్న ముక్కలు తరిగి

నీరుపోసి బాగా మెత్తగా వుడికించాలి.

పంచదార ముక్కల్లో వేసి కలిసేంతవరకు గరిటతో కలియబెట్టాలి.

సిట్రిక్ ఆసిడ్ లేదా నిమ్మరసం కూడా జామ్ లో కలిపి మాంచి సెగమీద ఉడకనివ్వాలి.

ఉడికిన జామ్ దించి పొడిగా వున్న గాజుసీసాలో పోసుకొని జాం చేసిన రెండో

రోజు నుంచి ఉపయోగించుకోవచ్చు.

ఇది బ్రెడ్,చపాతి,లాంటివాటికి చాలా బాగుంటుంది.

Sunday, May 31, 2009

థాయ్ ఫ్రేడ్ రైస్!! కావలసినవి !!

బాస్మతి బియ్యం -- 1 కప్

క్యారెట్ -- 1

బీన్స్ -- 15

క్యాప్సికం పెద్దది -- 1

పచ్చీబటాణీలు -- 1/4 కప్

ఉల్లికాడలు -- 1/2 కప్


!! మసాల చేసే విధం !!

పండుమిర్చి పేస్ట్ -- 1 టీ స్పూన్

ఆనియన్స్ -- 2

అల్లం,వేల్లులిపేస్ట్ -- 1 టీ స్పూన్

బెసిల్ ఆకులు -- 10

దనియలు -- 1/2 టీ స్పూన్

జీలకర్ర -- 1 టీ స్పూన్

ఉప్పు -- తగినంత

ఇవన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి.

!! తయారు చేసే విధానం !!

ముందుగా వెజిటెబుల్స్ చిన్నగా కట్ చెసుకోవాలి,అన్నం పొడిగా వండుకోవాలి

మూకుడులొ నూనె వేసి కూరగాయల ముక్కలు వేసి వుడికించాలి.

అవి మగ్గిన తరువాత రేడి చేసుకున్న మసాల పేస్ట్ వేసి పచ్చి వాసన పొయే వరకు వేపాలి.

తరువాత చల్లార్చుకున్న అన్నం వేసి బాగా కలపాలి.తరువాత ఉల్లికాడలు వేసి కలిపి దింపాలి.వేడి వేడి గా తింటే

భలేరుచి మరి మీరూ త్వరపడండి :)


!! మీకు తెలుసా ??? !! చిట్కాలుపూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే,పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలపాలి

లేకపోతే ఈస్ట్ పోడి 1/4 టీ స్పూన్ గోరువెచ్చని నీటిలో

ఈస్ట్ కలిపి పూరీ పిండిలో వెసి కలిపితే చాలా బాగా పూరీలు వస్తాయి

చల్లటి పాలువేసి కలిపినా పూరీలు క్రిస్పీగా వస్తాయి


ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి

కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి.

చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది


గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి


మృదువుగా రుచిగా ఉంటాయి. చల్లటి పాలు కలిపినా మౄదువుగా కాకుండగా విరక్కుండగ వస్తాయి.

చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.

సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే,

వాటి మీద నిమ్మకాయ రసం లేకపోతే తేనే వేసినా పళ్ళు నల్లగా మారవు


ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.

దాల్ ఫ్రై

పెసరపప్పు -- 100 గ్రా

పచ్చిమిర్చి -- 3

అల్లం -- చిన్న ముక్క

వెల్లుల్లి -- 3

జీలకర్ర పొడి -- ఒక టీ స్పూను

ధనియాల పొడి -- ఒక టీ స్పూను

కరివేపాకు -- ఒక రెబ్బ

ఉప్పు -- రుచికి

పసుపు -- 1 చిటికెడు

పోపు సామాగ్రి -- 1 టేబల్ స్పూన్

!! చేసే విధానం!!

ముందుగా పెసర పప్పు ని ఉడికించుకోవాలి

తరువాత ఒక బాణలి తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి

ఇప్పుడు కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర వేసి వేగ నివ్వాలి

అందులో అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు వేసి వేగ నివ్వాలి

తరువాత పచ్చిమిర్చి మరియు కరివేపాకు కుడా వేసి వేగ నివ్వాలి

ఇప్పుడు వుడికించుకొని పెట్టుకున్న పెసర పప్పుని వేసి బాగా కలుపుకోవాలి

తరువాత కొంచెం పసుపు ,జీలకర్ర పొడి,ధనియాల పొడి,మరియు ఉప్పు వేసి ఉడక నివ్వాలి

2మినిట్స్ ఉడకనిచ్చి దిన్చేసుకోవచ్చు కొత్తిమీర వేస్తే మరీ రుచి

ఇది చపాతికి,రోటికి,పరోటాకి,వేడి వేడి అన్నానికి

నేయ్యివేసుకొని తింటే భలే రుచి మరి మీరూ దాల్ ఫ్రై చేసుకొంటారా?

రవ వాంగిబాత్!! కావలసినవి !!

చిరోటి రవ -- 1 కప్పు

వాంగిబాత్ పౌడర్ -- 3 స్పూన్స్

వంకాయలు -- 5

పోటాటో -- చిన్నవి -- 2

టోమాటోస్ -- 3

గ్రీన్ చిల్లీ -- పెద్దవి -- 2

కరేపాక్ ఒక రెబ్బ

కొత్తమిర తురుము -- 1 -- టేబల్ స్పూన్

అన్నీ కలిపిన పోపుగింజలు -- 1 టేబల్ స్పూన్

పచ్చికొబ్బెర -- 1/4 కప్

వేయించిన జీడిపప్పు ముక్కలు 20

నీళ్ళు -- 2 -- కప్పులు

ఉప్పు -- తగినంత

నెయ్యి -- 2 --టేబల్ స్పూన్స్

నూనె -- 1/4 కప్

కరేపాక్ --
2 -- రెబ్బలు

!! చేసే విధానం !!

చిరోటి రవ కొద్దిగ నెయ్యివేసి దోరగా వేయించుకోవాలి.

వంకాయలు,పోటాటో,టోమాటో,లు మీకు కావలసిన షేపులో కట్ చెసి

నీళ్ళల్లో ఉప్పువేసి వుంచండి.

పచ్చిమిర్చి,కరేపాక్, కట్ చేసి వుంచుకొండి.

ఇప్పుడు ష్టవ్ పై మూకుడు (Wok) వుంచి అందులో ఒక గరిటె నూనె వేసి

నూనె కాగాక అందులో పోపుగింజలు కరేపాకు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత

అందులో పచ్చిమిర్చి,కరేపాక్ వేసి,అందులోనే తరిగిన వంకాయలు,పోటాటో,

టోమాటో లు వేసి అవికాస్త వుడికాక వాటిపై వాంగిబాత్ పౌడర్ వేసి

బాగా కలయబెట్టి నీళ్ళు పోసి ఉప్పువేసి నీళ్ళు బాగా తెర్లేవరకు

వుంచి అందులో రవ వేసి బాగా కలపాలి వుంటలు కట్టకుండగా కలపాలి.


రవ గట్టిగా పొడిపోడిగా మౄదువుగా రావాలి అందులోకి


మిగిలిన నెయ్యి, కొత్తమిర, జీడిపప్పు,వేసి సర్వ్ చేయడమే

ఘుమఘుమలాడే రవ వాంగీబాత్ తయార్ :)


!! వాంగిబాత్ పౌడర్ చేసే విధానం !!

చెన్నాదాల్ -- 1 కప్

మినపప్పు -- (Urad dal) --1 కప్

ధనియ -- 3/4 - కప్

డ్రై చిల్లీ -- 25 గ్రా (కారం తగినంత)

లవంగాలు -- 3 ( clove )

చెక్క (Cinnamon stick) 1

ఎండు కొబ్బెర --(dessicated coconut)-- 1/2 కప్పు

జీడిపప్పువేయించినవి
-- 4

!! చేసే విధానం !!

ముందు మూకుడు ష్టవ్ పై వేడి చేసి అందులో

విడి విడిగా అన్నీ దోరగా వేయించుకోవాలి

కొబ్బెర కొద్దిగ వేడి చేస్తే చాలు

తక్కిన వన్నీ దోరగా light golden brown వేయించి

అన్నీ గ్రైండర్లో మెత్తగా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి
.

Saturday, May 23, 2009

టోమాటో పచ్చడి


10 నిముషాల్లో చేసే టోమాటో పచ్చడి

1/2 ఆనియన్ సన్నగా చాప్ చేసి వుంచండి,
4 టోమాటోస్ కుడ చాప్ చేసి వుంచుకొండి
1 టేబల్ స్పూన్ ఎండుకారం
ఆవాలు,జిలకర 1/2 టీ స్పూన్


మూకుడులో ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు,జిలకర వేసి
ఆవాలు చిట్లిన తరువార అందులో ఆనియన్ వేసి
1 నిముషం వేయించి,అందులోనే టోమాటో వేసి ఉప్పు,వేసి
బాగా మెత్తగా అయిన తరువాత అందిలో కారంపొడివేసి
కావాలంటే కాస్త చెక్కర వేసి 1 నిముషం అట్టే వుంచి
దించడమే...మసాల దోసకి,సాదా దోసకి, చీస్ దోస,
చపాతికీ,బ్రెడ్,అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది....
ఇది నిల్వ చేసి కూడా వుంచుకోవచ్చు
ఫ్రిజ్ లో వుంచితే నెలరోజులు బాగావుంటుంది

Thursday, May 21, 2009

బనాన సర్‌ప్రైజ్ ~~ Banana Surprise

Banana Surprise

!! కేరళ నేద్రపళం హల్వా !!

బనాన సర్‌ప్రైజ్

!! కావలసినవి !!

పెద్ద అరటిపళ్ళు ~~ 2

చెక్కర ~~ 300 గ్రా

కొరిన పచ్చి కొబ్బెరకోరు ~~ 1 కప్పు

నెయ్యి ~~ 1/2 కప్పు

ఆరజ్ జ్యూస్ ~~ 1 కప్పు

నేతిలో వేయించిన జీడిపప్పు ~~ 15


!! చేసే విధానం !!

ముందు అరటిపల్లు కట్ చేసి వుంచాలి.(గుజ్జుచేసినా ఒకే)

ష్టవ్ పై మూకుడు వుంచి అందులో 1/4 కప్ నీళ్ళుపోసి

బాగా పొంగువచాక అందులో చెక్కరవేసి

కాస్త పాకం వచ్చాక, 2 స్పూన్స్ నెయ్యివేసి

అందులో కట్ చేసిన అరటిపళ్ళు వేసి రంగు మారేవరకు వేయిస్తునే వుండాలి.

అందులోనే 1 స్పూన్ కొబ్బెర వెసి పచ్చివాసన పోయేవరకు కలిపి

పక్కన వుంచుకోవాలి.

మూకుడులో 2 స్పూన్స్ నెయ్యి వేసి, ఆరంజ్జ్యూస్ వేసి

బాగా పొంగు వచ్చాక అందులో అరటిపళ్ళు,మిగిలిన కొబ్బెర,

వేయించి ముక్కలు చేసిన జీడిపప్పు, వేసి కాస్త గట్టిపడేవరకు

వుంచి తీసేయడమే ..ఇది బ్రేడ్కు,ఐస్క్రీంకు చాలా బాగుంటుంది.

ఒక విధంగా హల్వామాదిరిగా టేష్ట్ వస్తుంది.

మరి FrienDs మీరూ చేసి చూడండి :)