Thursday, April 23, 2009

~*~ మీకు తెలుసా ?~*~



1)పూరీ పిండి కలిపేటప్పుడు కొంచం చక్కర కలిపితే

చాలా సేపటివరకు పూరీలు తాజాగా వుంటాయి
.


2)పూరీ పిండి కలిపేటప్పుడు అందులో గోరువెచ్చని నీటిలో 1/2 స్పూన్ ఈష్ట్,

అరకప్పు చల్లటి పాలు, వేసి కలిపి గంటన్నరసేపు నానబెట్టి

పూరీలు చేయండి..మరునాటి వరకు పూరీలు కరకరలాడుతూ వుంటాయి.

~~ మీకు తెలుసా? ~~


మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం,జిలకర్ర,కొంచం ఉప్పు,ఇంగువ,కలిపి

మెత్తగా రుబ్బి వడియాలుగానో,చిప్స్ గానో,పెట్టుకొని ఎండాక

వేయించుకొని తింటే భలే రుచి.

తోటకూర పులుసు


::కావలిసిన పదార్థాలు::

తోటకూర కట్టలు 2

ఆనియన్ 2

టమోటాలు 2

చింతపండు గుజ్జు 2 స్పూన్స్

కారం-- ఉప్పు--తగినంత..చిటికెడు పసుపు

పచ్చిమిర్చి 3

తిరగమోత గింజలు
(ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి..అన్నీ ఒక స్పూన్)

::తయారుచేసే విధానం::

ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి.

అలాగే పచ్చిమిర్చి,ఉల్లిపాయలు,టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి.

మూకుడులో తిరగమోత వేసి ముందుగా ఉల్లిపాయ,టమోటా,పచ్చిమిర్చి,

వేసుకుని బాగా వేగిన తర్వాత తరిగిన తోటకూర వేసుకుని చింతపండు గుజ్జు,పసుపు,

ఉప్పు,కారం ,వేసి 3 గ్లాసుల నీరు పోసి ఉడికించాలి.

బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేయాలి.

పులుసు మరీ నీళ్ళగా వుంటే ఒక స్పూన్ బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి

తోటకూర పులుసులో కలపడమే. పులుసు కాస్త చిక్కపడుతుంది.

కర్నాటిక వాళ్ళు ఇందులోనే పచ్చి కొబ్బెర వేసుకొంటారు

కావాలంటే మీరూ 2 స్పూన్స్ కోరిన పచ్చి కొబ్బెర వేసుకోవచ్చు
:)