Friday, February 20, 2009
!! స్వీట్ పూరీ !!
!! స్వీట్ పూరీ !!
దీన్నే మడత పూరీ అనికూడ అంటారు :)
కావలసినవి !!
మైదాపిండి -- 500 గ్రా
పంచదార -- 250 గ్రా
యాలకులు -- 8
నెయ్యి -- వేయించడానికి సరిపడా
ఫుడ్ కలర్ --- చిటికెడు
!! చేసే విధానం !!
ముందుగా మైదాపిండి లో వంద గ్రాముల నెయ్యి కలిపి
ఆపై నీళ్ళు చల్లి ముద్దలా చేయాలి.
మైదా ముద్దను రెండు భాగాలుగా చేసి ఒక దానిలో ఫుడ్‌కలర్ కలపాలి.
ఈ రెండు రకాల ముద్దల్ని విడి విడిగా చపాతీలా చేయాలి.
ఇప్పుడు మామూలు చపాతిమీద రంగు చపాతి ఉంచి వీటిని చాపలా చుట్టాలి.
ఈ రోల్ను చాకుతో ముక్కలుగా కోసి,ఒక్కో ముక్కను మళ్ళీ పూరీలా ఒత్తి
నేతిలో కరకరలాడేలా వేయించాలి.
చక్కర ,యాలకులు కలిపి మెత్తగా పొడిలా చేయాలి.
ఈ పోడిని వేయించిన పూరీలమీద బాగా చల్లి...అంతే...స్వీట్ పూరీ తయార్....మీరు రెడినా...
!! సగ్గుబియ్యం వడలు !! sabudana vada !!
!! సగ్గుబియ్యం వడలు !!
సగ్గుబియ్యం --1 కప్
పోటాటో --(mashed potato)-- 1 కప్
గ్రీన్ చిల్లీస్ -- 4 , 5.
కోత్తమిర 1/2 కట్ట
జిలకర వేయించినది -- 1 టేబల్ స్పూన్
పంచదార -- 1/4
నూనే -- 100 గ్రా
ఉప్పు తగినంత
కరేపాక్ -- 2 రెబ్బలు
!! చేసే విధానం !!
ముందు సగ్గుబియ్యం నీళ్ళల్లో 1 గంట నానబెట్టాలి.
పోటాటో కుక్కర్ లో పెట్టి మెత్తగా చేసుకొని
దాన్ని మెత్తగా పిసికి వుంచికోవాలి.
నానిన సగ్గుబియ్యం,mashed potato ఉప్పు వేసి కలిపి,
అందులో చక్కర ,కోత్తమిర,కరేపాకు,చిల్లీ,అన్నీ సన్నగా తరిగి
వేసి జిలకర వేసి ఉప్పు తగినంత వేసి అంతా బాగా కలపండి.
మూకుడు లో నూనె వేసి వేడి చేసి అందులో ఈ మిశ్రమాన్ని వడలుగా
చేసుకొని నూనే లో వేయించాలి Deep fry on medium heat
అంతే.....సగ్గుబియ్యం వడలు తయార్...వేడి వేడి గా
కొబ్బెర చట్ని తో గాని టోమాటో సాస్ తో గాని తింటే మళ్ళి వదలరు :)
( పంచదార వేస్తే గోల్డెన్ కలర్ వస్తుందనీ...రుచిగా వుంటుందని వేయడమే )
సింగపూర్ స్టయిల్ నూడిల్స్
ఎగ్ నూడిల్స్ అంటే రిబ్బన్‌లా వుండేది
!! కావలసినవి !!
ఎగ్ నూడిల్స్ -- 300గ్రా ( ఉడికించి వడకట్టాలి
..పాకేట్‌పై సూచనలు పాటించాలి)
బీన్స్,క్యారెట్, గ్రీన్‌పీస్,కార్న్ -- 75 గ్రా
నూనె -- 2 టేబల్ స్పూన్స్
ఉల్లిపాయ -- 1
వెల్లుల్లి ముక్కలు -- 1 స్పూన్
సోయా సాస్ -- 3 స్పూన్స్
చిల్లీ సాస్ -- 2 స్పూన్స్
పంచదార -- 1 స్పూన్
పాలకూర -- 50 గ్రా
ఉల్లికాడలు -- 4
పాక్‌చోయ్ ఆకులు (pak choy)తరిగినది)
రైస్ వెనీగర్ -- 1 స్పూన్
గుడ్డు (egg) -- 2
తగినంత ఉప్పు
!! చేసే విధానం !!
మూకుడులో 1 స్పూన్ నుఊనె వేసి వేడి చేసి,
గిలకొట్టిన ఎగ్స్ వేసి దీనిని ఒక ధిక్ షీటుపైన పరచాలి.
దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఓ పక్కన వుంచుకోవాలి.
మూకుడులో నూనె వేడి చేసి ఒక నిముషం పాటు వెల్లుల్లి వేయించాలి.
తరిగిన ఉల్లిపాయముక్కలువేసి మరో నిముషం వేయించాలి.
బీన్స్,క్యారేట్, గ్రీన్‌పీస్,కార్న్. వేసి వుడికించాలి.
(నాన్వెజి వాళ్ళు ఇక్కడ చికెన్,రొయ్యలు,వేసుకోవచ్చు
ఐ మీన్ ఉడికించుకోవచ్చు )
సోయాసాస్,వెనీగర్,చిల్లీసాస్,పంచదార కలపాలి.
3 నిముషాలు సన్నటి సెగపై వుంచి,
పాలకూర,పాక్చోయ్,ఉప్పు,ఉల్లికాడలు,వేసి నీడిల్స్ కలిపి
రెండు మూడు నిముషాలు ఉడికించాలి.
ఎగ్ ముక్కల్ని కలియబెట్టాలి.
సింగపూర్ స్టయిల్ నూడిల్స్ తయార్..... :)
మైసూర్ పాక్
!! మైసూర్ పాక్ !!
!! కావలసినవి !!
శనగపిండి --1 కప్
పంచదార -- 2 1/2 లేక 3 కప్పులు
ఈలాచి -- 4 ( పొడి చేసుకోవాలి )
నెయ్యి,బట్టర్ -- 1 1/2 కప్
వంట సోడా - 1/2 టేబల్ స్పూన్
!! చేసే విధానం !!
శనగపిండినీ దోరగా వేయించాలి (తక్కువ మంట మీద వేయించాలి)
చక్కర లో 1 గ్లాస్ నీళ్ళు పోసి పాకం పెట్టాలి ।
పాకం జిగురుగా వుండాలి అంటె రెండు వేళ్ళతో చుస్తె అది తీగలా సాగుతున్నట్టు వుండాలి.
ఇప్పుడు ఆ పాకంనీ తక్కువ మంటలో పెట్టి అందులో వేపిన శనగపిండినీ ,ఈలాచి పొడినీ కలపాలి
ఇప్పుడు కొంచెం నెయ్యినీ ,బట్టర్ నీ ( కరగబెట్టినది ) అందులో వేసి కలపుతూ వుండాలి
ఒక 10 నిమషాలు పాటు దానిని అలాగే కలుపుతూ వుందాలి
అందులో సోడానీ వేసి కలపాలి .ఇప్పుడు గరిటికి అంటుకొకుండా వుండెవరకు కలుపుతూ వుంచాలి
ఒక ప్లెటులో నెయ్యిని రాసి దానిలో ఆ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసి అది వేడి వునప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి
మైసూర్ పాక్ తయార్...మీరూ చేసి చూడండి :)
వాంగి బాత్
!! వాంగిబాత్ పౌడర్ !!
చెన్నాదాల్ -- 1 కప్
మినపప్పు (Urad dal) --1 కప్
ధనియ -- 3/4 - కప్
డ్రై చిల్లీ -- 25 గ్రా (కారం తగినంత)
లవంగాలు -- 3 ( clove )
చెక్క ( Cinnamon stick ) 1
కరేపాక్ 2 రెబ్బలు
ఎండు కొబ్బెర పౌడర్ (dessicated coconut )1/3 కప్పు
ఉప్పుతగినంత
!! చేసే విధానం !!
ముందు మూకుడు ష్టవ్ పై వేడి చేసి అందులో
విడి విడిగా అన్నీ దోరగా వేయించుకోవాలి
కొబ్బెర కొద్దిగ వేడి చేస్తే చాలు
తక్కిన వన్నీ దోరగా light golden brown వేయించి
అన్నీ గ్రైండర్లో మెత్తగా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి.
!! వాంగి బాత్ !!
!! కావలసినవి !!
రైస్ -- 2 కప్పులు
వంకాయలు -- పెద్దవి 6
దోసకాయలు -- 2
వాంగిబాత్ పౌడర్ -- 3 టేబల్ స్పూన్స్
కరేపాక్ రెబ్బలు 2
లెమన్ జ్యుస్ -- 1 టేబల్ స్పూన్
ఉప్పు తగినంత
పోపు గింజలు -- 2 టేబల్ స్పూన్స్
జీడిపప్పు -- 15 నేతిలో వేయించినవి
నూనె -- 2 గరిటెలు
నెయ్యి -- 2 టేబల్ స్పూన్స్
పసుపు -- 1/4
!! చేసే విధానం !!
ముందు రైస్ పొడి పోడిగా వండుకొని
అందులో పసుపు,ఉప్పు వాంగిబాత్ పౌడర్ 2 స్పూన్స్ ,కలిపి పెట్టుకోండి.
మూకుడులో నూనె వేసి అందులో ఆవాలు,జీర,డ్రై చిల్లీ వేసి
అవి వేగాక అందులో వంకాయ,దోసకాయ,
విడి విడి గా ఉప్పువేసి వుడికించి కొద్దిగా
వాంగిబాత్ పౌడర్ వేసి దించండి.
రైస్ లోకి కాస్త నెయ్యి కలిపి వాంగిబాత్ పౌడర్,
వుడికించిన వంకాయ, దోసకాయ జీడిపప్పు ఉప్పు వేసి బాగా కలపండి.
ష్టవ్ పై మూకుడు పెట్టి నూనే వేసి
ఆవాలు,ఉద్దిపప్పు,చనగపప్పు,జిలకర,ఇంగువ.
డ్రై చిల్లీ కరేపాక్ వేసి అవి చిటపటా చిటపటా
అన్న తరువాత తీసి అన్నంలోకి వేసి
లెమన్ జ్యూస్ వేసి కలిపి వడ్డించడమే....
( లెమన్ జ్యూస్ కావాలంటే వేసుకోవచ్చు,లేకుంటే లేదు )
(వేరుశనగపప్పు Peanut దోరగా వేయించుకొని వేసుకోవచ్చు
జీడిపప్పు బదులుగా )
అరటిపండు హల్వా
!! అరటిపండు హల్వా !!
!! కావలసినవి !!
అరటిపండ్లు 5 పెద్దవి
పంచదార 1 కప్
నెయ్యి 3 టేబల్ స్పూన్స్
జీడిపప్పు 15
యాలక్కులు (cardamons) 6
!! చేసే విధానం !!
అరటిపండు తోలుతీసి బాగా గుజ్జుగా mash చెసుకొండి.
మూకుడులో 11/2 స్పూన్ నెయ్యివేసి అందులో
జీడిపప్పుని దోరగా వెయించండి.
తరువాత మళ్ళి కొద్దిగ నెయ్యివేసి ఈ అరటి పండు గుజ్జుని అందులో వేసి బాగా రోష్ట్ చేయండి.
ఇలా 10 నిముషాలు రోష్ట్ (roast for 10 min)
చేసి అందులో పంచదార వేసి మళ్ళి 10 నిముషాలు రోష్ట్ చేయండి.
అందులో యాలక్కుల పౌడర్ వేసి బాగా కలిపి
కొద్దిగా నెయ్యివేసి అందులోనే జీడిపప్పుకూడావేసి
నెయ్యి అంటించిన ప్లేట్ లో ఈ హల్వాని వేసి
diamond shapes లో కట్ చేసుకోండి
అరటిపండు హల్వ తయార్...మీరూ ట్రై చేస్తారా ? :)