ఈ గోంగూర పప్పును రెండు విధాలుగా చేసుకోవచ్చు
ఒకటి ఆకు సన్నగా తరిగి ఉడికించడం.
రెండోది ఆకు మెత్తగా గ్రైండ్ చేసి వుడికించడం.
ఇప్పుడు మనం రెండో విధానాన్ని నేర్చుకొంద్దాం.
గోంగూర 3 కట్టలు తీసుకొని ఆకు దూసి,((pluck the leaves)
బాగా శుబ్రంగా కడిగి నీళ్ళు లేకుండగా తుడిచి పెట్టండి.
ష్టవ్ పై పెద్ద మూకుడు వుంచి అందులో ఒక్క గరిటెడు నూనె పోసి
నూనె కాగాక అందులో ఈ గోంగూర ఆకులు వేసి పచ్చివాసన
పోయెంత వరకు వేయించి 1/2 టేబల్ స్పూన్ ఉప్పువేసి
మెత్తగా గ్రైండ్ చేసి గట్టిగా మూత వున్న డబ్బాలో వేసి వుంచండి.
ఎప్పుడు మీరు పప్పు కాని, పచ్చడి కాని చేసుకోవాలంటే
ఈ ముద్దని వాడుకోవచ్చు.
!! ఇప్పుడు గోంగూర పప్పుకు కావలసినవి చూసుకొందాం !!
గైండ్ చేసిన గోంగూర ముద్ద ఒక కప్పు
కందిపప్పు ------------- 2 ---- కప్పులు
ఆనియన్స్ ------------- 2
గ్రీన్‌చిల్లి ------------- 8 -----
వెల్లుల్లి -------------- 1 full garlic of 6--7
నూనె -------------- 1 ---- గరిటెడు
ఉప్పు రుచికి రగినంత...కరేపాకు ఒక రెబ్బ...
పోపు గింజలు ::-- చనగపప్పు----మినపప్పు----ఆవాలు----
జిలకర్ర----ఎండు మిర్చి--2--చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వుంచుకోండి.
!! చేసే విధానం !!
కందిపప్పు కడిగి 3 గ్లాసుల నీళ్ళుపోసి 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి
కంది పప్పుతో పాటు కుక్కర్ లో ఉడికించండి
5...వెల్లుల్లిపాయలు---రౌండుగా తరిగి...కొద్ది నూనెలో
దోరగా వేయించి పక్కన వుంచండి.
ఉడికిన పప్పులో----గోంగూర ముద్ద----పచ్చిమిర్చి----
4 ----పచ్చి వెల్లుల్లిపాయలు----పసుపు----ఉప్పు----వేసి---
(గోంగూర ఆకు గ్రైండ్ చేసే టప్పుడు ఉప్పు వేసుంటారు
కాబట్టి చూసుకొని ఉప్పు వేయండి)
బాగా మెత్తగా వుడికించి ష్టవ్ పై నుండి కిందికి దించేయండి.
అదే ష్టవ్ పై చిన్న మూకుడు వుంచి అందులో గరిటెడు నూనె పోసి
వేడి అయ్యాక అందులో పోపుగింజలన్నీ వేసి దోరగా వేగాక
అందులో కరేపాకు----వేయించిన వెల్లుల్లి పాయలు వేసి---
ఆ పోపు అంతా గోంగూర పప్పులో వేసి బాగా కలపండి.
కమ్మటి గోంగూర పప్పు తయార్..........................