Wednesday, October 28, 2015

వంకాయ మసాల కూర

















కావలసినవి::

వంకాయలు--------------1/2 కిలో
టోమాటో మిడియంసైజ్--2
ఆనియన్ పెద్దది----------1 
గరం మసాల--------------2 స్పూన్స్
ధనియా పౌడర్-----------1స్పూన్
ఎండుకారం---------------1స్పూన్

మసాలకు కావలసినవి:: 

{ వెల్లుల్లిపాయలు-----8
ఆనియన్-పెద్దవి------1
బాదాం(Almond)--4
గసగసాలు-----1 స్పూన్
అల్లం తురుము----1 స్పూన్
పచ్చికొబ్బరతురుము---2 స్పూన్స్.}


ఉప్పు--పసుపు--తగినంత
నూనె-----3స్పూన్స్

కూర చేసే పద్ధతి::

గసగసాలు కొద్ది నీల్లలొ 2 గంటలు నానపెట్టండి

(ఎందుకు అంతసేపు నానబెట్టాలి అర్ధగంట చాలనుకోవచ్చు మీరు
కాని మా అత్తగారు చెప్పారు గసగసాలు ఎంత నానితే అంత రుచి..బాగా ఒదుగు నిచ్చే పధార్తమని) కాబట్టి అది మీ ఇష్టం మీదే ఆధారపడింది.  

నానిన గసాగసాలతోపాటు అన్ని మసాల పధార్తాలు బాగా మెత్తగా రుబ్బి ఉంచుకోండి.

వంకాయలు బాకా నీళ్ళతో కడిగి మీకు కావలసిన సైజులో ముక్కలు తరుక్కొని

ఉప్పు-పసుపు-వేసిన నీళ్ళలో వేసి ఉంచండి.

ష్టవ్ పై మూకుడు పెట్టి అదికాస్త హీట్ అయిన తరువాత అందులో 3 స్పూన్స్ నూనె వేసి

ఈ గ్రైండ్ చేసిన మసాల ముద్ద అంతా ఆ నూనెలో వేసి బాగా పచ్చివాసన పోయేంతవరకు వుడికించండి. 

ఆ మసాలలోనే టొమాటో--గరం మసాలపౌడర్ --ఎండుమిర్చి--ధనియాపౌడర్--అంతా వేసి..బాగాకలపండి. 

ఇప్పుడు తరిగి ఉంచిన వంకాయలను నీళ్ళు లేకుండ తీసి ఆ ముక్కలు --ఆ ఉడుకుతున్న మసాలలో వేసి..మసాలకలిసేటట్లుగ బాగా కలిపి..ఒక గ్లాసు నీళ్ళు వేసి-ఉప్పు-పసుపు.. వేసి...మళ్ళి అంతా బాగా కలిసి పోయేటట్లుగా కలిపి మూత పెట్టి 15 నిముషాలు  బాగాఉడికించండి. 

ఉడికిన మసాలలో..కొత్తమీర తురుముతో అలంకరించి...సర్వ్ చేయండి..ఘుమఘుమలాడే వంకాయ మసాల రెడి.

ఈ కూర అన్నానికి--చపాతికి--పూరికి--నాన్ కి ఏదానికైనా భలే రుచిగా ఉంటుంది
మరి మీరు చేస్తారా?