Saturday, December 15, 2007

స్పైసీ దోసె


!! కావలిసిన పధార్ధాలు !!
బియ్యం -100గ్రా
అల్లం మిర్చి పేస్టు - 1/2 చెంచా
ఉల్లి ముక్కలు - 1కప్ఫు
కారం - 1/4 చెంచా

మైదా పిండి -50గ్రా
పుల్ల మజ్జిగ - 1 గ్లాసు
ఉప్పు - సరిపడ
పసుపు -చిటికెడు

!! తయారు చేయు విధానం!!

ముందుగా బియ్యం నానబెట్టి శుభ్రం చేసి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
ఈ పిండికి మైదా, అల్లం, మిర్చి పేస్టు, ఉల్లి ముక్కలు, ఉప్పు , కారం,
పసుపు వేసి అన్ని కలిసేలా కలిపి మజ్జిగ పోసుకుని జారుగా చేసుకోవాలి
కాలిన పెన్నం మీద పిండితో రవ్వ దోసె మాదిరిగా వేసి సరిపడ నూనె వేసి
రెండు వైపులా కాల్చి వేడిగా కొబ్బరి చెట్నీ లేదా అల్లపు చెట్నిలతో సర్వ్ చెయ్యాలి
మీకు నచ్చితే మీరూ చేసుకోండి :)

వంకాయ పచ్చడి


!! కావలసినవి !!


వంకాయలు పొడువ్వి 2(long, purple colour)వి
పచ్చిమిర్చి 6


టోమాటో 3

2 టెబల్ స్పూన్ చితపండు జ్యూస్

ఉప్పు

11/2 గరిటేడు నూనె

!!తాలింపుకు కావలసినవి !!

ఆవాలు 1 టీస్పూన్
జిలకర్ర 1/2 టీస్పూన్

శనగపప్పు 1/2 టీస్పూన్

మినపప్పు 1/2 టీస్పూన్

ఎండుమిర్చి 4

ఇంగువ చిటికెడు

!! చేసే విధానం !!

పాన్లో ఒక అర గరిటెడు నూనె వేసి
నూనె కాగాక అందులో వంకాయల్ని
తరిగి వేసి పచ్చిమిర్చి, టోమాటో
వేసి బాగా వుడికించి
చింతపండు జ్యుస్ వేసి ఉప్పువేసి
గ్రైండ్ చేసి వుంచండి

పాన్లో నూనె వేసి కాగాక
ఆవాలు,మినపప్పు,శనగపప్పు,
జిలకర్ర,ఇంగువ వేసి అవి చిటపట
అన్నతరువాత ఎండుమిర్చివేసి పచ్చడిలో కలపండి
ఇది అన్నానికీ,దోసలకీ, చాలాబాగావుంటుంది.
మరి మీరు tryచేస్తారా ? :)

గోంగూర పచ్చడి


ఈ పచ్చడి 1నెలరోజులు fridge లో వుంచితే
పాడుకాకుండగా వుంటుంది :)

!!కావలసినవి!!

గోంగూర 2 కట్టలు

వెల్లుల్లి పాయలు 20 పాయలు

పచ్చిమిరపకాయలు 15

(కారం ఎక్కువగా కావాలంటే ఒక5వేసుకోవచ్చు)

రుచికి ఉప్పు

ఆనియన్ 1

ఆవాలు 1 టీస్పూన్

ఎండు మిర్చి 6

నూనే 1/4కప్పు

!! చేసే విధానం !!

గోంగూరని బాగా కడిగి

నీళ్ళు లేకుండగా గుడ్డతో వత్తి

నీళ్ళన్ని తుడవాలి.

తరువాత పొట్టుతీసివుంచిన

వెల్లుల్లిపాయల్ని ఒకటికి

నాలుగు ముక్కలుగా తరిగి వుంచుకోండి

ష్టవ్ పై మూకుడుంచి అందులో

కొద్దిగ నూనె పోసి ఈ ఆకు కూరని అందులో వేసి

అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు

పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయి

బాగా వేగేంతవరకు వుడికించాలి.

ఇప్పుడు వుడికిన దాన్ని

మెత్తగా గ్రైండ్ చేసుకొండి.

పాన్ లో గరిటెడు నూనే వేసి

కాగాక అందులో ఆవాలు ఎండు మిర్చి

ఇంకా మిగిలిన వెల్లుల్లిపాయలు వేసి

అవి దోరగా వేగాక తీసి ఈ గ్రైండ్

చేసిన పచ్చడిలో వేయాలి . అందులోనే

ఆనియన్ ముక్కలు కలిపి వేడి వేడి అన్నం తో తింటే వావ్
భలేరుచి :)

(నేనైతే కొన్ని ఎండు మిర్చిని
చేత్తో నులిపి కలుపుతాను :)

ఇడ్లి పిండితో బజ్జిలు

ఇడ్లిలు పోసి మిగిలిన పిండిలో కొద్దిగ మైదా,
తరిగిన ఉల్లిపాయలు, 4పచ్చిమిర్చి,
కాస్త ఉప్పు,కరేపాక్, కోత్తిమిర. వేసి బాగా కలిపి
ష్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి కాగిన తరువాత
బజ్జీలుగా వేసి దోరగా వేయించిన
తరువాత తీసి టోమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి :)

Monday, December 03, 2007

సాగు - పూరీ




!! పూరీకి కావలసినవి !!

2 కప్స్ వీట్ ఫ్లోర్ {wheat flour}
2 టీస్పూన్స్ ఆయిల్
నీల్లు తగినంత
ఉప్పు రుచికి
deep fry కి కావలసిన నూనె

!! పూరీ చేసే విధానం !!

ఉప్పు,నూనే,నీళ్ళు, పూరీ పిండిలో కలిపి చపాతిపిండిలా గట్టిగా కలిపి వుంచుకోవాలి.
ఒక గంట తరువాత పూరీలను రౌండ్ గా వత్తుకొని కాగిన నూనేలో deep fry చేసి
light brown వచ్చాక తీసి సాగుతో సర్వ్ చేయండి.

!! సాగు కావలసినవి !!

11/2 కప్స్ mixed vegetables
{green beans, carrots,potatoes, and peas}
1 ఆనియన్ chopped
1 టోమాటో chopped
1/2 టీస్పూన్ ఆవాలు
3 టీస్పూన్స్ ఆయిల్
1 టీస్పూన్ chopped కోత్తమిరfor garnish
తగినంత ఉప్పు.

!! మసాల కావలసినవి !!

1/2కప్ grated coconut
1 స్మాల్ ఆనియన్ cut into pieces
1 టీస్పూన్ జిలకర్ర
2 టీస్పూన్స్ ధనియాలు
2 టీస్పూన్స్ గసగసాలు{poppy seeds}
1 టేబల్ స్పూన్ పుట్నాలు ( వేయించిన పుట్నాలు)
(whole split peas)
5 గ్రీన్ చిల్లి
1టీస్పూన్ tamarind juice
1cinnamon stick,crushed
3cloves
1/4 టీ స్పూన్ పసుపు
1 టేబల్ స్పూన్ chopped corinader leaves

!! సాగు చేసే విధానం !!

ముందు మసాల కావలసినదంతా
కొద్దిగ నీళ్ళు పోసి
మెత్తగా pasteచేసి వుంచండి.

ష్టవ్ పై pan వుంచి అందులో
3 టీస్పూన్స్ ఆయిల్ వేసి అందులో
ఆవాలు, వేసి అవి చిటపట అన్న తరువాత
ఆనియన్ వేసి 2minutesతరువాత
టోమాటో వేసి అది కాస్త వుడికినతరువాత
తరిగివుంచిన కోరగాయలన్నీ అందులోవేసి
5-10minutes వుడికించండి.
ఈ గ్రైండ్ చేసిన మసాల వుడికిన
కూరగాయలలో వేసి, ఉప్పు,పసుపు,
11/2 గ్లాస్ నీళ్ళు కూడా ఆడ్ చేసి
10-12 minutesవుడికించండి.
chopped coriander leaves.తో
చక్కగా decorateచేసి
అందరికీ పూరీ సాగుతో
సర్వ్ చేయండి :) మరి నాకు ఎలావుందో
Comment రాస్తారాండీ ?? :).


Thursday, November 29, 2007

దిబ్బరొట్టె



!! కావలసినవి !!

మినప్పప్పు 250 గ్రాం
బియ్యపురవ్వ 150 గ్రాం
ఉప్పు సరిపడ
నూనె 1/2 కప్పు

!! చేసే విధానము !!

మినప్పప్పును శుభ్రం చేసుకున్న తరువాత మూడు గంటలపాటు నానబెట్టి
మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకూడదు. రుబ్బిన ముద్దలో
బియ్యపు రవ్వను కలిపి తగినంత ఉప్పు కూడా కలిపి అవసరమనుకుంటే
కొద్దిగా నీరు కలుపుకోవాలి.మందపాటి బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువ వేసి
అట్టు పోసుకోవాలి. తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిని
వేరుశనగపప్పు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. బ్రెడ్ ఎలా ఉంటుందో
దిబ్బరొట్టె అంత మందంగా ఉంటుంది.

పుల్లట్టు



!! కావలసినవి !!

బియ్యపు పిండి 250 గ్రాం
మైదా 100 గ్రాం
గడ్డపెరుగు 100 గ్రాం
జీలకర్ర 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 గ్రాం
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 టీ స్పూన్స్

!! తయారు చేసే విధానం !!


బాగా చిక్కగా ఉన్న పెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఆనియన్స్
ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,
మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
నాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీద
కాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన సైజులో పోసుకొని నెయ్యితో
కాల్చుకోవాలి.
పిండి ఎంత పుల్లగా ఉంటే అట్లు అంత బాగుంటాయి

రవ దోశ



!! కావలసినవి !!

గోధుమ రవ్వ 1కప్పు
మైదా 1/4 కప్పు
బియ్యంపిండి 1/4
పెరుగు 1 కప్పు
కరేపాక్,కొత్తమిర తగినంత
పచ్చి మెరపకాయలు 3{సన్నగా తరిగినవి}
ఆనియన్ 2{సన్నగా తరిగినవి}
జిలకర్ర 1/2 టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె దోశలకు తగినంత

!! తయార్ చేసే విధానం !!

రవ,బియ్యం పిండి, మైద,పెరుగు,మిర్చి కరేపాక్,కొత్తమిర,ఉప్పు,ఆనియన్,జిలకర్ర,
అన్నీ తగినంత నీళ్ళుపోసి కలిపి కాస్త పల్చగా వుండాలి.
పెన్నం వేడిచేసాక దోశ పల్చగా వేసి
రెండువైపులా బాగా కల్చి, కొబ్బెర చట్ని తొ కాని మాంగో పికల్ తొ కాని ఆరగించారంటే చాలాబాగుంటాయి :)

మైసూర్ మసాలా దోసె



!! కావలసినవి !!

మినప్పప్పు....... 2 కప్పులు
శనగపప్పు......... 2 కప్పులు
బియ్యం ............ 1/4 కప్ప్పు
మెంతులు......... 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
ఎండుమిర్చి తగినన్ని

!! మసాలా దినుసులు !!

పొటాటో........... 1/2కిలో
పసుపు............ 1/4 టీస్పూన్
ఉడికించిన బఠాణీలు............. 1/2 కప్పు
పచ్చిమిర్చి.................. 3
ఆవాలు........................ 1/4 టీస్పూన్
మినప్ప్పప్పు.................. 1 టీస్పూన్
శనగపప్పు ...................... 1 టీస్పూన్
కరివేపాకు ...................... 1 రెబ్బ
నూనె ............................ 2 టీ స్పూన్స్
అల్లం చిన్న ముక్క


!! చేసే విధానం !!

పొటాటో ముందే వుడికించి పొట్టుతీసి చేత్తో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చిదుముకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన
పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠానీలు,తగినంత
ఉప్పు వేసి పొటాటోను అందులో కలిపి బాగా కలియబెట్టి ఈ పొటాటో కూరను తయార్ చేసుకోవాలి.

బియ్యం,మినపప్పు, మెంతులు,విడివిడిగా కనీసం 3 గంటలు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బి,
తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి మళ్ళీ రుబ్బుకోవాలి. పిండిని బాగా
కలియబెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని
ఈ మసాల కూరని దోసలో వుంచి సర్వే చేస్తే వావ్ భలే రుచి :)

సెట్ దోసె



!! కావలసినవి !!

మినప్పప్పు 1 కప్పు
బియ్యం 3 1/2 కప్పులు
అటుకులు 1/2 కప్పు
మెంతులు 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
నూనె 1/2 కప్పు

!! చేసే విధానం !!

మినప్పప్పు,బియ్యం,మెంతులు,అటుకులు కలిపి ఆరుగంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా
రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణములో కాస్త మందంగా దోసెలు చేసుకోవాలి
ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది

కొబ్బరి చట్నీ,కూర్మా లేక సాగు తో వడ్డణ మరీ రుచి :)

పైన కరేపాక్ , కొత్తిమిరతో Decorate చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది :)
మరి మీరు సెట్ దోసకు Prepare అవుతున్నారా ???

పేపర్ దోసె



!! కావలసినవి !!

మినప్ప్పప్పు 1/2 కప్పు
బియ్యం 4 కప్పులు
ఉప్పు తగినంత
జీలకర్ర 1 tsp
నూనె 1/2 కప్పు

!! చేసే విధానం !!

మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటలపాటు నానబెట్టాలి.తరువాత
విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు
మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను
ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా
ఉండేలా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చేవరకు కాల్చి
చట్నీ, సాంభార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.

Monday, November 26, 2007

కాలిఫ్లవర్ మంచురియా



!! కావలసినవి !!

కాలిఫ్లవర్ 1

{చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసి పెట్టుకోవాలి }

ఆనియన్స్.................. 2
అల్లం వెల్లుల్లి పేస్టు........2 టేబల్ స్పూన్స్
కారం...........................2 టేబల్ స్పూన్స్
పసుపు చిటికెడు................................
ఉప్పు తగినంత..................................
పచ్చిమిర్చి పేస్టు...........3 టేబల్ స్పూన్స్
కొత్తిమెర.......................1/2 కట్ట
రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు...........................
సొయా సాస్..................2 టేబల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్.....................2 టేబల్ స్పూన్స్
{1 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ నీ నీళ్ళలో కలిపి వుంచాలి }
గోధుమ పిండి...............1 టెబల్ స్పూన్
బియ్యం పిండి...............1/2 చుప్
బేకింగ్ పౌడర్................1/2 టేబల్ స్పూన్
నిమ్మకాయ జూసు.........2 టేబల్ స్పూన్స్
నునె వేయించడానికి........

తయారు చేసే విధానం::

ఒక గిన్నెలో గొధుమ పిండి, బియ్యం పిండి, 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్,
బేకింగ్ పౌడర్, ఉప్పు, 1 టేబల్ స్పూన్ సోయా సాస్,
1 టేబల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబల్ స్పూన్ కారం, పసుపు,
1 టేబల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, కొంచెం నీళ్ళు పోసి వేసి అన్ని కలుపుకోవాలి.

ఇప్పుడు కాలిఫ్లవర్ పువ్వులుగా కట్ చేసినవి ఇందులో వేసి కలపాలి.

పాన్ లో నునె నీ వేడి చేసి అందులో ఈ కాలిఫ్లవర్ పువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్ లో 3 టేబల్ స్పూన్స్ నునె వేసి అందులొ ఆనియన్ ముక్కలు వేసి వేయించాలి.

కొంచెం వేయించాక 1 టేబల్ స్పూన్ అల్లుం వెల్లుల్లి పేస్టు, 2 టేబల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్టు,
1 టేబల్ స్పూన్ కారం వేసి వేయించాలి.

అందులో 1 టేబల్ స్పూన్ సోయా సాస్ వేసి వేయించాలి.

ఇప్పుడు ష్టవ్ కాస్త మంటను తగ్గించి దానిలో ముందుగా నీళ్ళలో కలిపి వుంచుకున్న కార్న్ ఫ్లోర్ నీ,
రెడ్ ఫుడ్ కలర్ ని వేసి బాగా కలుపుకోవాలి.

అది అలా కలిపాక కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు కొత్తిమెర వేసి కలపాలి.
అందులో కాలిఫ్లవర్, నిమ్మజూసునీ వేసి కలపాలి.

ఇప్పుడు వేడి వేడి కాలిఫ్లవర్ మంచురియా ఆరగించండి. :)

Friday, November 23, 2007

కమలా రసం


కావలసినది
కమలాపండ్లు ముక్కలు..............100 gm
కొత్తిమిర......................................2 టీస్పూన్స్
ఎండు మిరపకాయలు...................3
వెల్లుల్లి రెబ్బలు.............................5
పచ్చిమిరపకాయలు......................3
నూనె............................................3 టీ స్పూన్స్
ఆవాలు.........................................1/4 టీ స్పూన్
జీలకర్ర..........................................1/4 టీ స్పూన్
ధనియాల్ పొడి..............................2 టీ స్పూన్స్
టమోటాలు....................................3
పసుపు చిటికెడు...............................................
ఇంగువ చిటికెడు...............................................
ఉప్పు తగినంత.................................................

చేసేవిధానము ::

ముందుగా కమలా పండు ముక్కలను సగం తీసుకొని ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి.

మూకుడులో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు,ఆవాలు,జీలకర్ర,ఇంగువ
వేసి కాస్త వేగాక కరివేపాకు,తరిగిన టమోటా ముక్కలు, రుబ్బిన కమలా పండు
ముద్ద వేసి మరి కొద్ది సేపు వేగనివ్వాలి.

తర్వాత 3 కప్పుల నీరు పోసి తెర్లి నివ్వండి .

తెర్లుతుండగా ఉప్పు,పసుపు,కొత్తిమిర,ధనియాల పొడి
మిగిలిన కమలా పండు వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి.
కమాలాపండు జూస్ రెడీ..........Try.......చేయండి మీరూ......

కొత్తిమిర రసం


కావలసినవి::

కొత్తిమిర.............................1 cup
పచ్చి శనగపప్పు................2 Teaspoon
జీలకర్ర...............................1/2 Teaspoon
టోమాటోలు........................2
వెల్లుల్లి రెబ్బలు.....................5
నూనె...................................3 టీస్పూన్స్
ఎండు మిర్చి.........................4
ఆవాలు................................1/4 టీస్పూన్
పసుపు చిటికెడు.....................................
ఇంగువ చిటికెడు .....................................
ధనియాల పొడి .....................................

చేసేవిధానము ::

మూకుడులో కొద్దిగా నూనె వేసి కొత్తిమిర ఆకులు,శనగపప్పు,ధనియాలు వేసి కొద్దిగా
వేపి చల్లారిన తర్వాత ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి.

మూకుడులో నూనె వేడి చేసి ఆవాలు
ఎండుమిర్చి ,జీలకర్ర,ఇంగువ వేసి అవి వేగాక తరిగిన టోమాటోలు వేసి
మగ్గనివ్వాలి. గ్రైండ్ చేసిపెట్టుకున్న ముద్దలో కావల్సినంత నీళ్ళు పోసి కలిపి ఇందులో
పోసి తెర్లనివ్వాలి (మరగనివ్వాలి)....కొత్తమీర రసం తయార్...మీకు నచ్చితే నాకో మెస్సేజి పెట్టండి

అల్లంచారు


!! కావలసినవి !!

మీడియంసైజ్ అల్లం ముక్క
ధనియాలు...................1 స్పూన్
జిలకర........................1/2 స్పూన్
వెల్లుల్లి పాయలు...............3
నీళ్ళు..........................3 గ్లాసులు
కర్వేపాకు రెబ్బలు......2
నిమ్మకాయ సైజు చింతపండు.........
ఉప్పు తగినంత............................
కొద్దిగ కొత్తిమిర తురుము...............

చేసేవిధానం::

అల్లం ముక్క, ధనియాలు, జిలకర,
వెల్లుల్లి కలిపి ముద్దగానూరుకోవాలి.

నీళ్ళలో చింతపండు, ఉప్పు కలిపి బాగా పిసికి పెట్టుకోండి .
ష్టవ్ పై
మూకుడు ఉంచి అందులో చింతపండు నీళ్ళు పోసి కర్వేపాకువేసి..
ఉప్పు వేసినీళ్ళు తెర్లితున్నప్పుడు
అల్లం ముద్ద అందులో వేసి బాగా తెర్లినాక
కొత్తిమిర వేసి దించడమే .

పైన జిలకర ఆవాలు ఎండు మిర్చి వేసి తాలింపు పెట్టండి
ఘుమ ఘుమ లాడే అల్లం చారు మీకోసం....

కాలిఫ్లవర్ టొమాటో కూర


కావలసినవి::

కాలిఫ్లవర్.........................1
ఆనియన్స్.................3
పచ్చిమిర్చి.......................6
టొమాటోలు......................3
కారం పొడి........................1 1/2 టేబల్ స్పూన్
నునె................................4 టేబల్ స్పూన్స్
ఆవాలు............................1 టీస్పూన్
పసుపు చిటికెడు...................................................
ఉప్పు తగినంత.....................................................

తయారు చేసే విధానం ::

మూకుడులో నునె వేసి అది వేడి అయ్యాక
అందులో ఆవాలు , ఆనియన్ ముక్కలు , పచ్చిమిర్చి వేసి వేయించాలి .

ఇప్పుడు అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి వేయించాలి.
అందులో టొమాటో ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి ఉడికించాలి.

తరువాత అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి .
అందులోనే కొంచెం నీళ్ళు వేసి కాలిఫ్లవర్ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .

ఘుమ ఘుమలాడే కాలిఫ్లవర్ కూర తయార్....
మరి మీరు చేస్తారా ఈకూరని ?? నచ్చితే నాకో మెస్సేజ్ ఇవ్వండి

ఆనపకాయ టొమటో కూర




!! కావలసినవి !!

సొరకాయ ............................1 ( ఆనపకాయ )
ఆనియన్స్............................3 to 4
పచ్చిమిర్చి...........................4
టొమాటో.............................3
కారం.................................1/2 to 1 టేబల్ స్పూన్స్
నునె.................................3 టేబల్ స్పూన్స్
ఆవాలు..............................2 టేబల్ స్పూన్స్
పసుపు............................................

ఉప్పు తగినంత....................................

తయారు చేసే విధానం::

మూకుడులో నునె వేసి వేడి అయ్యాక అందులో

ఆవాలు...ఆనియన్ ముక్కలు...పచ్చిమిర్చి వేసి వేయించాలి .

ఇప్పుడు అందులో సొర్రకాయ ముక్కలు వేసి వేయించి అందులో

ఎండుకారం..పసుపు..ఉప్పు..వేసి బాగా కలియపెట్టాలి

అందులో టొమాటో ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి ఉడికించాలి.

అందులో కొంచెం నీళ్ళు వేసి సొర్రకాయ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి.

మంచి వాసనటొ..సొర్రకాయ ( అనపకాయ ) కూర రెడి

శనగపప్పు కొబ్బరి కూర



కావలసినవి ::

కొబ్బరి...................1 cup

శనగపప్పు...............1/2
కప్పు

ఆనియన్ ................1

పచ్చిమిర్చి...............3

ఎండుమిర్చి..............3

కార్న్.....................1/2 కప్పు

బీన్స్.....................1/2 కప్పు

కరివేపాకు................3

ఆవాలు..................1/4 టేబల్ స్పూన్

నునె.....................2 లేక 3 టేబల్ స్పూన్స్

క్యారేట్ ముక్కలు చిన్న కప్పు .........................
పసుపు - చిటికెడు..............................
ఉప్పు - తగినంత
..........................................

చేసే విధానం::

శనగపప్పుని బాగా కడిగి అందులో
1 కప్పు నీళ్ళు పోసి కుకర్ లో 1 విసెల్ రానివ్వాలి.
ఆ తర్వాత శగపప్పులో మిగిలిన నీళ్ళు తీసేయాలి.

మూకుడు లో నునె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు,

ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.

అందులోనే ఆనియన్ ముక్కలు వేసి వేయించండి

లైట్ గా వేగిన తరువాత క్యారేట్,బీన్స్ కార్న్ ముక్కలు, వేసి వుడికించాలి.

ఇప్పుడు వుడికించిన శనగపప్పుని, అందులో కలిపి ఉప్పు, పసుపు కొబ్బర వేసి వేయించాలి.

కాసేపు సన్నటి సెగపై అలాఉంచి 2 నిముషాల్లో దించేయండి.

ఘుమ ఘుమ లాడే శనగపప్పు-కొబ్బరి కూర రెడీ..మరి మీరూ సిద్ధమేనా...

పులిహొర



కావలసినవి::

బియ్యం...................2 కప్పులు
నునె....................4 టేబల్‌స్పూన్స్
పచ్చిమిర్చి................10(కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి)
శనగపప్పు................2 టేబల్‌స్పూన్స్
మినపప్పు................2 టేబల్‌స్పూన్స్
జీడిపప్పు.................3 టేబల్‌స్పూన్స్
వేరుశనగపప్పు..............3 టేబల్‌స్పూన్స్
ఆవాలు..................2 టేబల్‌స్పూన్స్
పసుపు..................1/4 టేబల్‌స్పూన్
చింతపండు పేస్టు............8 టేబల్‌స్పూన్స్
ఎండుమిర్చి.............5
కరివేపాకు రెబ్బలు.........3
ఉప్పురుచికి తగినట్లు................

చేసే విధానం::

బియ్యం 3 సార్లు బాగా కడిగి..4 కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ లో 2 విజిల్ వచ్చాక దించేయాలి
అన్నం పొడి పొడి గా ఉండాలి...

మూకుడులో..ఒక స్పూన్ నునె వెసి అందులో
కొద్దిగ ఆవాలు..ఎండుమిర్చి..కరివేపాకు ఒకరెబ్బ వేసి
ఆవాలు చిటపట లాడాక చింతపండు గొజ్జుని అందులో వేసి ఉడికించాలి.

సగం ఉడికిన చింతపండు గొజ్జులో పచ్చిమిర్చి వేసి మళ్ళీ చింతపండు ఉడికించాలి,
చింతపండు వుడికి చిక్కపడాలి..నునె పైకి తెలుతుంది.

ఇప్పుడు వుడుకించిన బియ్యాన్నికి పసుపు..ఉప్పు..వేసి బాగా కలిపి
ఈ చింత పండు గొజ్జుని కూడా అందులో వేసి బాగా కలపాలి.

ఇంకో మూకుడు లో నునెను వేసి అందులో ఆవాలు..ఎండుమిర్చి..
మినపప్పు..శనగపప్పు..జీడిపప్పు , వేరుశనగ గుళ్ళు..కరివేపాకు..వేసి బాగా వేయించాలి,

ఈ వేగిన తాలింపుని చింతపండు గొజ్జు కలిపిన అన్నానికి
వేసి బాగా కలపాలి...ఘుమ ఘుమ లాడే పులిహోర తయార్..
పండగలకు ఈ వంటకం మహా శ్రేష్టం

రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం...9th Day prasaadam

9వ రోజు ప్రసాదం

!!! రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం ( పరమాన్నం ) !!!

!! పరమాన్నం !!

కావలసినవి::

మిల్క్ మేడ్ దొరికితే.....1 టిన్ తీసుకోండి
చిక్కటి పాలు.........6 కప్పులు
బియ్యం.............1 కప్
చక్కర..............1,1/2 కప్పులు
ద్రాక్షా................5
జీడిపప్పు..............6
ఎలక పౌడర్............1/2 స్పూన్
నెయ్యి................5 టేబల్ స్పూన్స్
చేసే విధానం::

దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసి
అందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి.

తరువాత పాలు..ఏలక పౌడర్..వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండి.

చిన్న మూకుడు ష్టవ్ పై పెట్టి
అందులో కాస్త నెయ్యి వేసి ఈ ద్రాక్షా..జీడిపప్పు దోరగా వేయించి వుంచండి.
తరువాత కుక్కర్ మూత తీసి వుడికిన అన్నానికి చెక్కరవేసి
ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించండి.

(రెండోసారి ఉడికించి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా అవుతుంది)

అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా
ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి !!! మీ రడిగిన వరాలన్నీ ఆ పరమ్మాన్నం మైకంలో ఇచ్చేయటమే :)అమ్మ పని :)

Tuesday, October 16, 2007

మహిషాసుర మర్ధిని ( ప్రసాదం )..8th Day prasaadam

8వ రోజు ప్రసాదం

!! బెల్లం అన్నం !!

!! కావలసినవి !!

బియ్యం..............100 gm
బెల్లం................150 gm
యాలకులు..........5
నెయ్యి................50 gm
జీడిపప్పు............10

చేసే విధానం::

బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .
తరువాత మెత్తగా వుడికించాలి .

అందులో
దంచిన బెల్లం వేసి
మొత్తం కరిగెంత వరకు వుడికించాలి .

జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,
యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి
దించేయడమే .

తియ్యటి తీపితో ఆ తల్లి శాతించి మీ కోరికలన్నీ తీరుస్తుంది :)
ఇది సత్యం

దుర్గాష్టమి ( ప్రసాదం ( కదంబం )7th Day

7th Day prasaadam

!! కదంబం !!

!! కావలసినవి !!

1/2 కప్...కందిపప్పు
1/2 కప్ బియ్యం..( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1...వంకాయ
1/4....సొర్రకాయ
1....దోసకాయ
బీన్స్ తగినన్ని
1.....పోటాటో
2 పిడికిళ్ళు..వేరుశెనక్కాయలు ( పీనట్ )
2..బేబీ కార్న్
1/2...క్యారెట్
2...టోమాటో
2..కరేపాక్ రెబ్బలు
1tsp..కోత్తమీర తురులు
1 చిప్ప..కోరిన పచ్చి కొబ్బెర
4...గ్రీన్ చిల్లిస్
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3..చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము ::

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి
కుక్కర్ లో కందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .
మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత
పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి
బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతా వుడికిన రైస్ లో వేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసి
మరోసారి వుడికించండి అంతా బాగా వుడికిన తరువాత ,ఎండు మిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి
కొబ్బెర వేసి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి :)


శ్రీ మహాలక్ష్మిదేవి( ప్రసాదం ( రవ కేసరి ) 6th Day

6th Day prasaadam

!! రవ కేసరి !!

!! కావలసినవి !!

రవ 1 కప్
షుఘర్ 3/4 కప్
గీ 2 టెబల్ స్పూన్
కేసరి కలర్ Tel Saffron టెల్ ఒక పించ్
యాలకులు 4
డ్రై ద్రాక్షా 6
జీడిపప్పు 10
మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్ 1/2 కప్

!!! చేసే విధానం !!!

ముందు మూకుడులో కాస్త గీ వేసి రవ దోరగా వేయించి తీసి ప్లేట్ లో వేసి వుంచండి .
అదే మూకుడులో కాస్త గీ వేసి జీడిపప్పు , ద్రాక్ష వేయించి తీసి వుంచండి .
నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా బాయిల్ చేసి అందులో
కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి వుంటలు రాకుండగా గీ వేస్తూ బాగా కలిపి
అందులో ద్రాక్షా , జీడిపప్పు ,మిగిలిన గీ అంతా వేసి బాగా కలిపి
వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి ఆరగింపు పెట్టి
భోగ భాగ్యాలతో పాటు సౌభాగ్యం కూడా ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి
మీ కోరికలన్నీ నెరవేరినట్టే :) ఆ చల్లని తల్లి దీవెనల కన్నా మనకు కావలసినది ఏమి ?

సరస్వతి పూజ ( ప్రసాదం పెరుగన్నం , దద్ధోజనం ) 5th Day


5th Day prasaadam

!! పెరుగన్నం !!

బియ్యం 1/4 కిలో
పాలు 1/2 లీ
చిక్కటి పెరుగు 1/2 లీ
నూనె 1/2 కప్పు
నెయ్యి 1 స్పూన్
కొత్తమిర , కరేపాక్
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి
పోపు సామాగ్రి
జీడిపప్పు 20
ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి

!! చేసే విధానం !!

ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక
కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి
సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని
ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసి
ఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి
కాస్త నేతిలో జీడిపప్పులు వేయించి అవీ వేయండి
రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ
ఎందుకో తింటే మీకే తెలుస్తుంది ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ :)


Saturday, October 13, 2007

లలితా దేవి ( ప్రసాదం (అల్లం గారెలు ) 4th Day

4th Day prasaadam

!! అల్లం గారెలు !!

!! కావలసినవి !!

మినపప్పు2 కప్స్
అల్లం స్మాల్ పీస్
గ్రీన్ చిల్లీ 6 సన్నగా తరిగి పెట్టండి
జీరా 1/4 స్పూన్
ఉప్పు రుచికి తగినంత
కరేపాక్ , కోత్తమిర తగినంత
నూనె గారెలు వేయించేందుకు

!!! చేసే విధానం !!!

మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .
నానిన మినపప్పును గ్రైండర్లో వేసి అందులోనే అల్లం . గ్రీన్ చిల్లి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో
కరేపాక్ , కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .
దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ లలితాదేవిని ఆరాధించి నైవేద్యం పెట్టి చల్లగా కాపాడు తల్లీ అని వేడుకొని మనం ఆరగించటమే :)!!!!!

అన్నపూర్ణా దేవి ( ప్రసాదం ( కొబ్బెరన్నం ) 3rd Day


3rd Day prasaadam

!! కొబ్బెరన్నం !!

!! కావలసినవి !!

బియ్యం 1/2 కిలో
తురిమిన పచ్చికొబ్బెర 1 కప్
పచ్చిమిర్చి 5
కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .
పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .
జీడి పప్పు 10
నూనె , 1/4 కప్
నెయ్యి 1 టెబల్ స్పూన్

!! చేయవలసిన పద్ధతి !!

అన్నం పోడి పోడి గా వండుకొని
పచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి
ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి .
అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి
ఎండుమిర్చి , ఇంగువ , వేసి
ఆవాలు చిటపట చిటపట అనగానే
పొడవుగా తరిగిన గ్రీన్ చిల్లీ , కరేపాక్ , కోత్తమిర ,
అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి
ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .
కడుపునింపే అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి
మన కడుపు చల్లగా చూడమని వేడుకొనటమే మనం చేయవలసిన పని
కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత తెలిసినదే కదా )
ఆ తల్లి దీవెనలు వుంటే అడివిలో నైనా పిడికెడు అన్నం దొరక్కపోదు :)

గాయత్రి దేవి ( ప్రసాదం ( పులిహోర ) 2nd Day

2 Day prasaadam

!! పులిహోర !!
!! కావలసినవి !!

బియ్యం 150 గాం
చింతపండు 50 గ్రాం
పసుపు1/2 స్పూన్
ఎండుమిర్చి 5
ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగ పప్పు 2 స్పూన్
వేరు శనగ పప్పు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా

!! చేయవలసిన విధానం !!

అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .
చింతపండును అరకప్పు నీళ్ళు పోసి
నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి,
మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గొజ్జు వేసి
కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి ( కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చు గొజ్జిలో )
వుడికిన గొజ్జు అన్నంలో కలిపండి .
బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాత వేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే జగదేక మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము

Friday, October 12, 2007

శ్రీ బాలత్రిపురసుందరిదేవి (ప్రసాదం)( పొంగల్ )

1st Day prasaadam
(ప్రసాదం)( పొంగల్ )

!! కావలసినవి !!

పెసరపప్పు 150 గ్రాం
కొత్త బియ్యం 100 గ్రాం
బ్లాక్ పెప్పర్ 15
గ్రీన్ చిల్లి 6
పచ్చి కొబ్బెర 1 కప్
కాచిన నెయ్యి 1/4 కప్
జీడిపప్పు cashewnuts 15
జీర 1/2 టేబల్ స్పూన్
ఆవాలు 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి 3
మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కోత్తమిర , కరేపాకు , తగినంత
ఉప్పు రుచిని బట్టి
ఇంగువ 2 pinches

!! చేయవలసిన విధానము !!

దళసరి wokలో కాస్త నేయి వేడి చేసి
పెసరపప్పుని దోరగా ఏయించండి .
బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన
తరువాత బియ్యంకూడా బాగా వేయించండి
తెలుపు రంగు పోకూడదు సుమా 5 minutes
వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మారకూడదు
అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి
జీడిపప్పులను వేయించి పెట్టడి.

సన్నగా తరిగిన చిల్లి ,
పచ్చికొబ్బెర కోరు
పెప్పర్ , జిలకర వేయించిన బియ్యం
పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో
కుక్కర్లో వుంచి 3 whistlesవచ్చాక
ష్టవ్ off చేయండి.

చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,
శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,
ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టి
మిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసి
వేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి
భక్తిగా పూజించి
దసరా 10 రోజులు మాకు శక్తి
నిచ్చి మాచే పూజలందుకొనుమా
మా కోరికలు తీర్చుమా
అని ప్రాథించాలి :) !!!!!!




Thursday, September 13, 2007

చిరోటి రవ కుడుములు



!! కావలసినవి !!

చిరోటి రవ 1/4 కేజి ( 1 గ్లాస్ )
మైదా పిండి 2 స్పూన్స్
కొద్దిగ ఉప్పు ( ఉప్పు మంగళకరానికి శ్రేష్టమంటారుగా పెద్దలు
అందుకే శాస్రానికి వేయాలంటే వేయాలి )
నూనె 2 స్పూన్స్
చిటికెడు సోడా

ఇదంతా కొద్దిగ నీళ్ళుపోసి పూరీ పిండిలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి.
2 3 గంటలు నానిన తరువాత పూరీలుగా వత్తుకోవాలి

!! పూర్ణానికి కావలసినవి !!

శనగ పప్పు 1 గ్లాసు
బెల్లం 2 గ్లాసులు
వేయించేందుకు తగినంత నూనే
ఎండుకొబ్బెర 3 టేబల్ స్పూన్స్
గసగసాలు 1 1/2 స్పూన్స్
జీడిపప్పు ముక్కలు 3 టేబల్ స్పూన్స్

!! చేయవలసిన విధానం !!

శనగ పప్పు నీళ్ళు వేసి వుడికించి
ఆ నీళ్ళన్ని వంపేసి అందులో చితగొట్టిన
బెల్లం పొడిని వేసి
ఒక 2 నిముషాలు వుడక నిచ్చి
గ్రైండ్ చేయండి.అందులో కొబ్బెర,
గసగసాలు,నేతిలో వేయించిన
జీడి పప్పు వేసి బాగా కలపండి.
ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్ లో తీసివుంచాలి.
పూరీలుగా వత్తుకొన్న వాటిపై
ఈ పూర్ణాన్ని పెట్టి చుట్టూ
గోటితో మడతలుగా మడచి
నూనేలో దోరగా వేయించడి
పళ్ళెంలో అందంగా పేర్చి,
వినాయుకుడి ముందు నేవెధ్యం పెట్టాలి .
తరువాత మీరారగించవచ్చు :) !!!

కోవా కజ్జికాయలు



కావలసినవి ::

1 లీటరు పాలు
1/2 కిలో చక్కెర
1/2 కిలో
బెల్లం
కొబ్బెర చిప్పలు నాలుగు
యాలకుల పొడి 1 tsp స్పూన్

చేసే విధానం::

పాలు మరగనిచ్చి చిక్కపడ్డాక
చక్కరవేసి గరిటతో కలుపుతూ
దగ్గరగా వచ్చినప్పుడు
యాలకుల పోడి వేసి
కోవా అయ్యెంతవరకు కలయ పెడుతూ ఉండండి .

తురిమి వుంచిన కొబ్బెర తురుమును

బెల్లాన్ని రెండూ కలిపి ష్టౌ మీద పెట్టి
రెండూ దగ్గరపడి గట్టిపడ్డ తరువాత
చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి.

ఒక్కొక్క వుండనూ తీసుకొని

దానిమీద తయారు చెసుకొన్న కోవాను
పల్చగా చుట్టి పళ్ళెం లో పెట్టుకొని
బాగా ఆరనిచ్చాక
పొడి డబ్బా లో వుంచుకోనాలి
రుచికరమైన కోవా కజ్జికాయలు మీకోసం

ఢోక్లా

కావలసినవి

సెనగపిండి................200gm
పెరుగు....................1 కప్
అల్లం గోలికాయంత
సోడా......................1 టేబల్ స్పూన్
నిమ్మరసం................1 టేబల్ స్పూన్
నూనె.....................1 టేబల్ స్పూన్

పోపుకి కావలసినవి::

నూనె..3 టేబల్ స్పూన్స్
ఆవాలు..1 టేబల్ స్పూన్
కరివేపాకు..2 టేబల్ స్పూన్స్
కొత్తిమిర..2 టేబల్ స్పూన్స్

చేసే విధానం::

సెనగపిండి, పెరుగు,ఉప్పు,తగినంత నీరు కలిపి
కాస్త చిక్కగా కలిపి కనీసం 4 గంటలు నాననివ్వాలి.

పచ్చిమిర్చి,అల్లం ముద్ద, పసుపు అందులో వేసిబాగా కలపాలి
ఒక పెద్ద గిన్నెలో నీరుపోసి వేడి చేయాలి

ఒక చిన్న గిన్నెలో సోడా ,నూనె,నిమ్మరసం కలిపి పిండిలో వేసి బాగా కలియబెట్టాలి
ఒక వెడల్పాటి గిన్నెకు అన్నివైపులా నూనె రాసి ఈ పిండి మిశ్రమం వేసి సమానంగా సర్ది
పెద్ద గిన్నెలో మరుగుతున్న నీటిలో పెట్టి ఆవిరిపై పదిహేనునిమిషలు ఉడికించాలి

చల్ల్లారాక ముక్కలుగా కోయాలి.ఇప్పుడు నూనె వేడి చేసి ఆవాలు
కరివేపాకు వేసి చిటపటలాడాక దింపి పావు కప్పు నీరు కలిపి ఈ ఢోక్లా ముక్కలపై
సమానంగా పోయాలి.ఆ నీటిని పీల్చుకుని అవి మృదువుగా అవుతాయి. కొత్తిమిర,
కొబ్బరి తురుముతో అలంకరించి వడ్డించాలి......
మీరూ Try చేసి చూడండీ

ఢిల్లీ బాదుషా






కావలసినవి::

మైదాపిండి.............1/2 కేజి
చక్కర..................1/2 కేజి
నీళ్ళు..................1/2 కప్పు
చిటికెడు సోడా
డాల్డా..................1/4 కప్పు
ఏలకుల పొడి..........1/2 స్పూన్
నూనే..................2 కప్పులు

చేసే విధానం::

మైదా పిండిలో సోడా,నెయ్యి,నీళ్ళు
వేసి 15 నిముషాలు బాగా కలపాలి.

పిండిని వడపిండిలా కలుపుకోవాలి
వాటిని వడలమాదిరిగా చేసుకొని
వేడి చేసిన నూనేలో వేయించండి.

అరకప్పు నీళ్ళలో 1/2 చక్కర వేసి
చక్కర కరిగెంతవరకు వుంచండి.

లైట్ గా తీగపాకం వచ్చెంతవరకు
పెడితే బాదుషాలపై చెక్కర నిలబడుతుంది
ఈ పాకంలో వేయించిన బాదూషాలు వేసి
15 నిముషాల తరువాత తీసి ప్లేట్ లో వుంచండి
కన్నులకు ఇంపుగా కనిపించే బాదూషాలు రెడీ..
...మీరూ Try చేసి చేయండి

బేసన్ లడ్డు



కావలసినవి ::

సెనగపిండి ఒక కప్పు
చక్కర............100 gms
కోవా..............50 gms
నెయ్యి............60 gms
ఏలకులు.........15

చేసే విధానం ::

మూకుడు వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి
సెనగపిండిని పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

చక్కర ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసిపెట్టుకోవాలి.

కోవాను కూడా కొద్ది కొద్దిగా వేపి సెనగపిండి చక్కరపొడి
అన్ని బాగా కలిపి కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి
చేతికి నెయ్యి రాసుకొని వుండలు కట్టితే
చేతికి నెయ్యి రాసుకొంటే ఉంటలు ఇరిగిపోవు
మీకు నచ్చిదా....మరి మీరూ నేర్చుకోండి

శనగపప్పు బొబ్బట్లు







కావలసినవి::

శనగపప్పు...........500 gm
బెల్లం..............500 gm
మైదాపిండి.......... 250 gm
యలకుల పొడి........1 టేబల్ స్పూన్
పచ్చ కర్పూరం పొడి..1/2 టేబల్ స్పూన్
నూనె అర కప్పు...నెయ్యి అరకప్పు


చేసే విధానం::

శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి
తర్వాత నీళ్ళువార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి
చివరలో యాలకులు,పచ్చ కర్పూరం పొడులు కలపాలి
ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.

తరువాత మైదాపిండిలో కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి
ఈ పిండిముద్దను కనీసం ఒక 3 గంటలు అయినా నాననీయాలి.

నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని
చేతితో వెడల్పు చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి
నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్ కాగితం మీద
పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి.

పొయ్యి మీద పెనం వేడి చేసి సన్నటి సెగపై
ఈ చపాతిలా వత్తుకొన్న బొబ్బట్టును
నెయ్యి వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

వేడి బొబ్బట్టుపై వేడి వేడి గా కాచిన నెయ్యి వేసుకొని తింటే " వావ్ " అనక మానరు
పాలు కావలసిన వారు పాలు వేడి చేసి బొబ్బట్లపై వేసుకొని తింటే మరీ రుచి
మీకు నచ్చితే మీరూ చేసుకొనీ..నాకో మెస్సేజి పెట్టండి
ఆ..హా...ఏమి రుచీ....

Tuesday, September 11, 2007

ఇడ్లీ పొడి

!! కావలసినవి !!

ఎండు మిర్చి 15
సెనగపప్పు 250 gm
ఎండుకొబ్బరి పొడి 50 gm
జీలకర్ర 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tsp


!! చేయు విధం !!


బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పప్పు, జీలకర్ర విడివిడిగా వేపి
తీసి చల్లారిన తర్వాత ఉప్పు,కొబ్బరి తురుము కలిపి మిక్సీలో మెత్తగా
పొడి చేసుకోవాలి.

Wednesday, September 05, 2007

మైసూర్ బొండా


మైసూర్ బొండా

కావలసినవి::

మైదా...............2 కప్స్
పుల్లటి పెరుగు..........2 కప్స్
బియ్యంపిండి.............1/2 కప్
ఆనియన్ ముక్కలు.......1/2 కప్
పచ్హిమీరపకాయలు.........4
సొడా.................1/4 టేబల్ స్పూన్
ఉప్పు తగినంత...కొత్తిమెర తురుము

తయరుచెసే విధానం::

మైదా , పెరుగు , బియ్యంపిండి ,ఆనియన్ ముక్కలు , పచ్హిమిర్చి ముక్కలు , కొత్తిమెర , ఉప్పు , సొడా అన్ని కలిపి వుంచాలి.
కొంచం గట్టిగా కలుపుకోవాలి.

మూకుడులో నునే వేడిచెసి , అందులొ కలిపిన పిండిని బొండాలుగా ఫ్రై చేసుకోవాలి
దీనికి గ్రీన్ చట్ని చాలా బాగుంటుంది...

గ్రీన్ చట్ని రెసిపి బజ్జీల త్రేడ్డులో ఉంటుంది .
మీకు నచ్చితే ...చేసి తిని ఆనందించండి

Tuesday, September 04, 2007

అరటికాయ వేపుడు

కావలసినవి::

అరటికాయలు............3( చక్రాలుగా తరుక్కోవాలి)
ఆనియన్స్..............2
ఎండుమిర్చి............5
జీలకర్ర..................1 టేబల్ స్పూన్స్
వెల్లుల్లి...................4 పాయలు
ఎండు కారం..............1/2 టేబల్ స్పూన్
కరివేపాకు................1 రెబ్బ
నునె...................3 టేబల్ స్పూన్స్
ఆవాలు.................1/2 టేబల్ స్పూన్

తయారుచేసే విధానం::

ముందుగా జీలకర్ర..వెల్లుల్లి..ఎండుమిర్చి ఆనియన్ ముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి.

మూకుడు లో నూనె వేసి అది వేడి అయ్యాక అందులో
ఆవాలు..కరివేపాకు..ఎండుమిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు ఆనియన్ ముద్దను వేసి బాగా ఫ్రై చెయ్యాలి.

అది కొంచెం వేగాక అందులో అరటికాయ ముక్కలు వేసి వేయించి
అందులో కారం..పసుపు..ఉప్పు వేయ్యలి.

ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ మూకుడు మీద మోత తీసి కలుపుతు ఉండాలి
2 మినిట్స్ అయ్యాక ష్టవ్ ఆర్పేసి..మీరు తినే వరకు అలాగే ఉంచండి
తర్వాత వేడి వేడి కూర వేడి వేడి అన్నంలోకి యమరిచిగా ఉంటుంది
మీరూ చేసి చూడండి

Friday, August 24, 2007

క్యాప్సికం మసాల

!!! కావలసినవి !!!
క్యాప్సికం - 2
ఆనియన్స్ 2
పచ్చిమిరపకాయలు - 5
కారం - 1 tbl spoon
ధనియాలు - 1 tbl spoon
నువ్వులు - 1/4 cup
వేరుశనగుళ్ళు - 1/2 cup
కొబ్బరి - 1/2 cup (పొడి)
ఆవాలు - 1/4 tbl spoon
మెంతులు -చిటికెడు
చింతపండు - నిమ్మకాయంత(నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు -తగినంత
నునె - 3 tbl spoons
కొత్తిమెర

!!! తయారు చేసే విధానం !!!
1.పాన్ లో (నునె లేకుండ)ధనియాలు, వేరుశనగుళ్ళు, నువ్వులు,కొబ్బరి వేసి
వేయించి దానిని మంట మీద నుంచి దింపి చల్లారబెట్టాలి.
2.ఇప్పుడు దానిని గ్రైండ్ చేసుకోవాలి (కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి).
3.పాన్ లో నునె వేసి అందులో ఆవాలు, మెంతులు వేయించాలి.
4.ఇప్పుడు ఆనియన్ ముక్కలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
5.అందులో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించాలి.
6.అది కొంచెం వేయించాక దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్నవేరుశనగుళ్ళుముద్దనీ
వేసి వేయించుకొవాలి.
7.అందులో కారం,ఉప్పు వేసి వేయించాలి.
8.ఇప్పుడు నానబెట్టి వుంచుకున్న చింతపండు పులుసు కొంచెం అందులో వేసి, అది కొంచెం గట్టి పడేవరకు వుంచాలి.
9.అలా కొంచెం గట్టిపడేక మంట మీద నుంచి దింపేముందు కొత్తిమెర వేయ్యాలి.