Wednesday, September 24, 2014

బెండకాయ గొజ్జు


















Lady's Fingers .... Benda kaayalu 


















ఈ వంటకం కూడా కర్నటక వాళ్ళు ఎక్కువగా చేసుకొనే ఐటం.

బెండకాయ తో కాని...కాకరకాయ...సొర్రకాయ...తెల్లగుమ్మడికాయ తొ కాని 

ఈ కూటు చేసుకోవచ్చు

ఈ గొజ్జు---చపతికి కాని---వేడి వేడి అన్నానికి కాని

దోస కాని మహా మహా రుచిగా ఉంటుంది---మరి మనము నేర్చుకొందామా

గొజ్జుకు కావలసినవి

బెండకాయలు-----1/4 కిలో

పచ్చిమిర్చి----4

కరేపాకు--కొత్తమీరి--ఉప్పు--పసుపు. తగినంత

చిన్న గొలికాయంత jaggery బెల్లం )

నూనె.......4..టేబల్‌స్పూన్స్ 

చింతపండు గొజ్జు---చిన్న కప్పులో సగం.

తాలింపుకు కావలసినవి::-

ఇంగువ..ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి 2


మసాలకు కావలసిన ఐటమ్స్::=

శనగపప్పు..............2......టేబల్‌స్పూన్
మినపప్పు...............2.....టేబల్‌స్పూన్
నువ్వులు.................2....టేబల్‌స్పూన్
ధనియాలు...............1.....టీస్పూన్ 
ఎండుమిర్చి..............8
కొద్దిగ బియ్యం...........1.....టీస్పూన్
పచ్చి కొబ్బర తురుము...1/2 కప్


గొజ్జు చేసే విధానం::-


ముందు బెండకాయలు కడిగి నీళ్ళు లేకుండ తుడిచి 
మీకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొండి.

ష్టవ్ వెలిగించి ష్టవ్ పై పాన్ ఉంచి 2..స్పూన్స్ నూనె వేసి దొరగా వేయించి
ఉంచండి.

అదే పాన్ లో మసాల ఐటమ్స్ అన్నీ వేయించుకొని పౌడర్ చేసి ఉంచండి.

అదే పాన్లో చింతపండు గొజ్జు...బెల్లం...పసుపు...ఉప్పు...కరేపాకు...కొత్తమీర వేసి
చింతపండు పచ్చి వాసన పోయెంత వరకు ఉడికించండి.

ఉడికిన గొజ్జులో 2 గ్లాసుల నీళ్ళుపోసి మసాల పౌడర్ 3స్పూన్స్ వేసి బాగా వుడికించండి.

(చిక్కగా అనిపిస్తే మరికాస్త నీళ్ళుపోసుకోవచ్చు.)

బాగా వుడికిన తరువాత ఘుమ ఘుమ వాసన వస్తుంది అప్పుడు ఆవాలు జిలకర్ర ఎండుమిర్చి ఇంగువతో పోపు పెట్టి గొజ్జులో వేసి కలపడమే.....ఘుమ ఘుమ లాడే బెండకాయ గొజ్జు రెడి.