Friday, March 30, 2007

కాబేజి రోల్స్

!!!! కావలసినవి !!!!

కాబేజి.................1/4
మొక్కజొన్నపిండి.....10 గ్రాములు
కారెట్స్....................1/4
బియ్యం పిండి..........1/4 కప్
నూనె తగినంత..................

చేసే విధానము::

కాబేజీ , కారెట్ లను కొబ్బరిలాగా తురుమాలి .
పచ్చిమిర్చిని , ఉప్పు , మొక్కజొన్న పిండిని కలపాలి .
దీనిని ముద్దగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి .
మూకుడు లో నూనె వేసి నూనె లో దోరగా వేయించాలి
అంటే దోరగా గోల్డెన్ కలర్ వచ్చెంత వరకు వేయించీ
సాస్ తో గాని చిట్ని తో గాని సర్వ్ చేయండీ..ఆ..హా..ఏమి..రుచీ..ఆహా

చాక్లెట్ కేక్

2 ounces of chocolate
4 ఎగ్స్
1/2 కప్ మిల్క్
1 టీ స్పూన్ వెనీల
1/2 కప్ బట్టర్
1 1/2 కప్ షుగర్
1 టీస్పూన్ నిండుగ బేకింగ్ పౌడర్
1 3/4 కప్స్ ఫ్లోర్

!!! చేసే విధానం !!!

ముందుగా 5 టేబల్ స్పూన్స్ వేడి నీళ్ళల్లో boiling water ఈ చాక్లెట్ ని కరిగించండి . బట్టర్ , క్రీం , వేసి కలపాలి (Beat). Yolk add చేసి మళ్ళికలపండి అంటే బీట్ చేయండి . అందులోనే మిల్క్ వేసి మళ్ళీ కలపండి. కరిగించిన చాక్లెట్ వేసి మళ్ళీ కలపండి . ( బీట్ చేయండి ). మళ్ళి ఫ్లోర్ వేసి కలపండి .ఇంకా బాగా కలపండి ఎంత బీట్ చేస్తే అంత మ్రుదువుగా వస్తుంది .తరువాత ఎగ్ లో వున్న తెల్లటి సోన తీసి విడిగా బాగా నురుగు వచ్చేంత వరకు బీట్ చేసి , కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ రాండి . తరువాత వెనీల , బేకింగ్ పౌడర్ వేసి జాగ్రత్తగా వుంటలు లేకుండగ కలపండి Mix quickly and lightly, . కేక్ పాన్ లో కొద్దిగ బట్టర్ రాసి అందులో ఈ కలిపిన కేక్ మిక్చర్ ని అందులో వేసి నార్మల్ టెంపరేచర్ ల్లో 45 మినిట్స్ oven లో పెట్టాలి . చాక్లెట్ కేక్ తయార్ :)
మరి చేసి చూస్తారా ?

సేమ్యా పులిహోరా

!! కావలసినవి !!!

సేమ్యా 200 గ్రాములు
ఉల్లిపాయ 1
కరివేపాకు
పల్లీలు
జిలకర
నూనె తగినంత
నెయ్యి కొద్దిగా
ఎండు మిర్చి 6
ఆవాలు
మినపప్పు
నిమ్మకాయ 1

తయారు చేసే విధానం !!!!

పాన్ లో ఒక చెంచా నెయ్యివేసి సేమ్యాను దోరగా వేయించాలి . తరువాత నూనె వేసి తాలింపు సామాను

కరేపాకుతో, ఉలీముక్కలి ఎండుమిర్చి వేసి

అన్నీ ఎర్రగా వేయించాలి. పొయ్యి sim లో వుంచి ముందుగా వేయించి వుంచుకొన్న సేమ్యాను ఇందులో వేసి మరో నిముషానికి దించి పళ్ళెం లో పోసిపెట్టుకోవాలి . అదే పాన్ లో 2 గ్లాసుల నీళ్ళు పోసి సరిపదా ఉప్పు వేయాలి . నీళ్ళు మసలుతుండగా పళ్ళెం లో వేయించి వుంచిన సేమ్యానంతా వేసేయాలి . అది ఉడుకుతుండగా నిమ్మకాయ గింజలు లేకుండగ రసం పిండాలి . stove ని sim చేసి అట్లకాడతో కలుపుతూ 3 నిముషాలతరువాత దింపుకోవాలి ఘుమ ఘుమ లాడే పులిహోర తయార్........