Thursday, July 16, 2009

టోమాటో పప్పు



!! కావలసినవి !!

కందిపప్పు ------ 2 కప్పులు

మెంతులు ------ 1/2 స్పూన్

టోమాటో ------ 8

చింతపండు జ్యూస్ ------ 1 టేబల్ స్పూన్స్

పచ్చిమిర్చి ------ 6

పోపుగింజలు :- ఆవాలు , మినపప్పు , చనగపప్పు ,

జిలకర్ర , ఎండుకారం 1/2 టేబల్ స్పూన్ , ఇంగువ , ఎండుమిర్చి 2 ,

కరేపాకు , కొత్తిమిర
.

!! చేసే విధానం !!

ముందు కందిపప్పులో మెంతులువేసి వుడికించి పెట్టండి.

( పప్పులో మెంతులువేసి వుడికించినచో గుండెజబ్బులులకు

సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయని పెద్దలు చెప్పారు)


ఉడుకిన పప్పులో టోమాటో , పచ్చిమిర్చి , ఉప్పు , పసుపు , కరేపాకు,

చింతపండు గుజ్జు వేసి బాగా వుడక నివ్వండి.

కళాయిలో నూనే వేసి పోపుగింజలు , కారంపొడి , ఇంగువ , వేసి కొత్తిమిర

చల్లి దించేయడమే .

వేడి అన్నానికి నెయ్యివేసి తింటే మాంచి రుచి.

చపాతికీ , నాన్ కీ , అన్నీటికీ బాగుంటుంది.

బిసి ఉప్పినేకాయి (కన్నడ వాళ్ళ ఐటం) Instant Pickles



Instant Pickles
"వేడి ఊరగాయ" అని తెలుగులో అంటారు.

ఈ పచ్చడి(ఊరగాయ)అన్నానికీ,చపాతికీ

చాలా రుచిగావుంటుంది.మీరు ఒకసారి ట్రై చేస్తారా?

!! కావలసినవి !!

టోమాటోలు ---- 4

ఆవాలు ---- 1 టేబల్ స్పూన్

మెంతులు ---- 1/4 టీ స్పూన్

ఎండి మిర్చి ---- 6

ఎండుకారం ---- 1/3 టేబల్ స్పూన్


పోపు గింజలు:- ఆవాలు,ఎండుమిర్చి,కరేపాకు,ఇంగువ.

నూనే పెద్ద గరిటెడు

ఉప్పు,పసుపు తగినంత.

!! చేసే విధానం !!

ముందు మెంతులు,ఆవాలు,ఎండుమిర్చి. విడివిడిగా వేయించుకోవాలి.

వేయించిన వాటిని మెత్తగా గ్రైండ్ చేసి వుంచుకొండి.

బాణలి లో సగం గరిటెడు నూనె పోసి అందులో

ముక్కలు చేసి వుంచుకొన్న టోమాటోలు ఉప్పు,పసుపు,ఎండుకారం,వేసి

అటు ఇటు కలిపి మూతపెట్టి సన్నటి సెగపై మెత్తగా వుడికించండి.

బాగా వుడికిన టోమాటో లో ఈ గ్రైండ్ చేసిఉంచిన పొడి వేసి

బాగా కలిపి ష్టవ్ పైనుండి దించేయండి.

చిన్న కడాయిలో మిగిలిన నూనే వేసి పోపుగింజలతో పాటు

కరేపాకు,ఇంగువతో పోపుపెట్టేయడమే....తినగా తినగా..

ఆహా..ఏమి రుచి....మీరూ చేసి చూడండి .రాయలసీమవారికి

బహుప్రీతికరమైన వంటకం:)

గోరు చిక్కుడుకాయల కూర



!! కావలసినవి !!

చిక్కుడు కాయలు --- 1/2 కిలో

ఎండు మిర్చి --- 4

వెల్లుల్లి --- 3

జిలకర్ర --- 1/2 టీ స్పూన్

చింతపండు గుజ్జు --- 2 టేబల్ స్పొన్న్స్

పచ్చికొబ్బరకోరు --- 3 టేబల్ స్పూన్స్

(ఎండు కొబ్బరైనా ఒకే)

పుట్నాలు (Roasted Chana Dal) 3 టేబల్ స్పూన్స్

పోపు గింజలు:- ఆవాలు,మినపప్పు,చనగపప్పు,జిలకర్ర,

పచ్చిమిర్చి 2 ,కరేపాకు 2 రెబ్బలు, నూనె 2 గరిటెలు.

ఉప్పు, రుచికి తగిననత

కొత్తిమిర ఒక కట్ట


!! చేసే విధానం !!

గోరుచిక్కుడుకాయలు బాగా కడిగి,తరిగి వుంచుకొండి.

ఎండుమిర్చి,వెల్లుల్లి,కొబ్బర,జిలకర్ర,పప్పులు,చింతపండు.అన్నీ గ్రైండ్ చేసి వుంచండి.

ష్టవ్ పై మూకుడు వుంచి ఒక గరిటెడు నూనె పోసి వేడి చేసిన తరువాత

అందులో పోపుగింజలు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత గోరుచిక్కుడు,

పసుపు,ఉప్పు, వేసి బాగాకలిపి మూతమూసివుంచండి.

10 నిముషాల తరువాత ఈ గ్రైండ్ చేసిన పేష్ట్ వేసి మళ్ళి బాగా కలిపి

10 నిముషాలు మాడకుండగ వుండకనివ్వండి. అప్పుడప్పుడు మూత తీసి కలియబెట్టాలి.

బాగా మెత్తగా వుడికిన తరువాత కొత్తిమిర చల్లి దించేయడమే...

చపాతికి,వేడి అన్నానికి,పుల్కాలు, వీటన్నిటికి భలే రుచిగా వుంటుంది.

గుమ్మడికాయ పులుసు


!! కావలసినవి !!

చిన్న గుమ్మడికాయలో సగం ముక్క

ఆనియన్స్ --- 3

పచ్చిమిర్చి --- 3

ధనియాలు --- 1 1/2 టేబల్ స్పూన్స్

మెంతులు --- 1/2 టీ స్పూన్

చింతపండు --- పెద్ద నిమ్మకాయంత

ఎండుమిర్చి --- 4

నూనె --- 2 టేబల్ స్పూన్స్

ఉప్పు,పసుపు --- రుచికి తగినంత

బెల్లం --- చిన్న నిమ్మసైజంత

పోపుగింజలు --- ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి.

ఎండుకొబ్బెర --- 1 టేబల్ స్పూన్

బియ్యం పిండి --- 2 టేబల్ స్పూన్స్

కరేపాకు --- 2 రెబ్బలు

కొత్తిమిర --- 1/2 కట్ట

కారం --- 1/2 టేబల్ స్పూన్


!! చేసే విధానం !!

ష్టవ్ పై దట్టమైన కడాయివుంచి అందులో ఒక స్పూన్ నూనె వేసి

పచ్చిమిర్చి,కరేపాకు,ఆనియన్ వేసి వేయించి అందులో

పొట్టు తీసిన గుమ్మడికాయ ముక్కలు వేసి, 2 గ్లాసుల నీళ్ళుపోసి ఉడకబెట్టాలి.

ఎండుమిర్చి,ధనియాలు,మెంతులు,ఎండుకొబ్బర,అన్నీ దోరగా వేయించి గ్రైండ్ చేసి

పులుసులో వేయాలి.పసుపు,బెల్లం,ఉప్పు,కారం కొత్తిమిర వేసి,చింతపండు గొజ్జుతీసి

పులుసులో వేసి బియ్యంపిండిని సగం గ్లాసు నీళ్ళల్లో కలిపి పులుసులో వేసి

(చిక్కగావుంటే ఒక గ్లాసు నీళ్ళుపోసి ) బాగా వుడకనివ్వాలి.

ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి తో పోపు పెట్టి

వేడి అన్నానికి నెయ్యివేసుకొని తింటే..ఆహా...ఏమి రుచి...