Sunday, June 10, 2007

పాకం గారెలు

కావలసినవి

పొట్టుమినపప్పు..................50గ్రా
బెల్లం ............................1 Kg
నెయ్యి....................50 గ్రా
యాలకులు.....................5
రిపైండ్ ఆయిల్ తగినంత
ఉప్పు తగినంత

తయార్ చేసే విధం

పొట్టుమినపప్పు నాలుగుగంటలపాటు నీళ్ళల్లో నానబెట్టి
పొట్టువచ్చేవరకుచేతితో రుద్ది నీళ్ళతో కడగాలి .

ఆ తరువాత ఈ పప్పును గ్రైండర్ లో మరీమెత్తగాకాకుండ
గ్రైండ్ చేసి తరిగిన బెల్లం వేసి ఒక గ్లాస్ నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి
లేతపాకం వచ్చేవరకువేడి చేయాలి .

ఇప్పుడు ఒక మూకుడులో నూనెపోసి వేడికాగానే
మినపప్పు ముద్దను తడి అరచేతిపైన లేదా అరటాకుపైన గాని
అద్ది నూనెలో వేయాలి .
వాటిని ఎర్రగా వేయించి , తీగపాకంలో ముంచి బాగా నాన నివ్వండి .
నోరూరించే పాకం గారెలు రెడి ...మరి మీరూ రెడినా....

గుత్తొంకాయ కూర
!! కావలసినవి !!


లేత వంకాయలు 250 gm

ఉల్లిపాయలు 150 gm

పల్లీలు 50 gm

నువ్వులు 50gm

జీలకర్ర 1 tbsp

మెంతులు 1/2 1 tbsp

కొబ్బరిపొడి...........100 gm


చింతపండు పులుసు.....1/4 cup
నూనె...............50 gm

ఉప్పు తగినంత..............

కారం పొడి............1 tbsp

పసుపు..............1 tsp

అల్లం వెల్లుల్లి ముద్ద.......1
tbsp

కొంచం బెల్లం.................


చేసే విధానం::


ముందుగా ఖాళీ మూకుడులో జీలకర్ర,మెంతులు,పల్లీలు,నువ్వులు విడివిడిగా వేయించాలి.

అవి పక్కన పెట్టి అందులోనే సగం నూనె పోసి సన్నగా తరిగిన ఆనియన్స్

వేసిగోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి.

ఇవి అన్ని కొబ్బరిపొడితో కలిపిరుబ్బి పెట్టుకోవాలి.

ఈ ముద్దలో ఉప్పు,కారం పొడి,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద,

చింతపండు పులుసు,బెల్లం వెసి బాగ కలిపి పెట్టుకోవాలి.

వంకాయలను నాలుగుపక్షాలుగా కోసి ఉప్పు వేసిన నీల్లల్లో వెసి పెట్టాలి.

ఈ రుబ్బిన ముద్ద వంకాయమధ్యలొ బాగా కూరి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత మూకుడులో మిగిలిన నూనె వేసికాగిన తర్వాత

ఈ మసాల కూరిన వంకాయలను వేసి మూత పెట్టలి.

ఈ కూరనునిదానంగా చిన్న మంటపై కుక్ చేయాలి.

అన్ని వంకాయలు మగ్గి మెతబడిన తర్వత

మిగిలిన ముద్దలో కొద్దిగా నీరు కలిపి అందులో పోసి

మెల్లిగ కలిపి మూత పెట్టాలి..కూర ఉడికిన తర్వాత నూనె తేలుతుంది.

కొతిమిర చల్లి దించేయడమే..ఇక గుత్తొంకాయ కూర రేడి.

ఆలస్యం దేనికీ నోరూరించే గుత్తోంకాయ మీరూ చేయండి..మ్మ్...రెడికాండీ
ఆహా ఏమిరుచీ......

పాలతో మైసూర్ పాక్

కావలసినవి

పంచదార 150 gm
శనగపిండి 150 gm
నెయ్యి 150 gm
పాలు అర కప్పు


చేసే విధానం

పంచదార శనగపిండి, పాలని ఒక గిన్నెలో ఉండలు లేకుండా కలపాలి. అందులో అర
కప్పు నీళ్ళు పోసి కలిపి పొయ్యి మీద దళసరి గిన్నె పెట్టి అందులో ఈ మిశ్రమాన్ని పోసి
అడుగంటకుండా సన్నని సెగ మీద కలియబెడుతు ఉండాలి. మధ్య మధ్యలో కరిగించిన
నెయ్యి కొద్ది కొద్దిగా పోస్తూకలియబెడుతూ ఉండాలి.బాగా దగ్గర పడి నెయ్యి పూర్తిగా
అయిపోయేవరకు ఉంచి దానిని ఒక నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి బాగా నెరపి
కావల్సిన సైజులో కోసుకోవాలి. ఇది కూడా మృదువుగా ఉంటుంది.
షడ్రుచులు..బ్లాగునుండి సేకరించినది

కాజూ మైసూర్ పాక్

కావలసినవి

శనగపిండి 150 gm
పంచదార 200 gm
నెయ్యి 150 gm
జీడిపప్పు 150 gm


చేసే విధానం

ముందుగా జీడిపప్పును బరకగా పొడి చేసుకోవాలి. దానిని శనగపిండిలో కలపాలి.
పొయ్యిమీద దళసరి గిన్నెగాని మూకుడుగానీ పెట్టి పంచదారలో అర కప్పు నీరు
పోసి లేత పాకం వచ్చేవరకు మరిగించి జీడిపప్పు, శనగపిండి మిశ్రమాన్ని వేసి
ఉండలు లేకుండా కలపాలి. అల కలుపుతూ మధ్య మధ్యలో కరిగించిన నెయ్యిని
గరిటతో పోస్తూ కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడి శనగపిండి మిశ్రమం గుల్ల
విచ్చి బుస బుస పొంగుతుంది. అప్పుదు దింపి నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి
సమానంగా అయ్యేలా నెరిపి కావల్సిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి.
ఇది మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది

మీరూ చేసేందుకు తయార్ కాండి :)
shadruchulu.blogspot.com....సేకరించినది

అరిసెలు

కావలసినవి::

బియ్యం..............2 కప్పులు
బెల్లం...............2 కప్పులు
నెయ్యి .............5 గ్మ్
యాలకుల పొడి........1 త్స్ప్
నూనె వేయించడానికి తగినంత

చేసే విధానం::

బియ్యం రెండు గంటలు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని తడి మీదనే మెత్తగా
పొడి చేసుకోవాలి ఆరనివ్వకూడదు.

బెల్లం లో అరకప్పు నీరు పోసి ముదురుపాకం..చేసుకోని,
యాలకులపొడి నెయ్యి వేసి కలిపి దింపేసి తడి బియ్యం పిండి వేసి
మొత్తం బాగా కలపాలి.

నూనె వేడి చేసి, బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా
చేసుకుని, ప్లాస్టిక్ కాగితంపైగాని అరిటాకుపైగాని నెయ్యి రాసుకుని చేతితో
పూరీల్లాగా వత్తుకుని నూనెలో నిదానంగా ఎర్రగా వేయించుకోవాలి.

(ఇష్టముంటే నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చు.)

నూనెలో నుండి తీసి అరిసెలు వత్తే పీటపైగాని
రెండు చిల్లుల గరిటలతోగాని వత్తి నూనె అంతా తీసేసి విడిగా ఆరనివ్వాలి.
ఘుమ ఘుమ లాడే అరిసెలు తయార్...

బ్రెడ్ బజ్జీలు

కావలసినవి

బ్రెడ్-------------------------- 8 స్లైసులు
శనగ పిండి------------------- 2 కప్పులు
ఉప్పు తగినంత
కారం పొడి -------------------1 tsp
అల్లం వెల్లుల్లి----------------- 1 tsp
వంట సోడా చిటికెడు
గరం మసాల పొడి ------------1/2tsp
వాము లేదా జీలకర్ర ----------1/2tsp
నూనె వేయించడానికి

చేసే విధానం

బ్రెడ్ ముక్కలను త్రికోణాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

వాటిని టోస్టర్లోకాని పెనం పై కాని కాస్త గట్టిపడేటట్టు కాల్చి పెట్టుకోవాలి.
గిన్నెలో శనగపిండి,ఉప్పు,కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద, వాము లేదా
జీలకర్ర,గరం మసాలా పొడి,వంట సోడా కలిపి నీళ్ళు పోసి దోసపిండి
మాదిరిగా గరిటజారుగా కలిపి ఓ పది నిమిషాలు ఉంచాలి.
(అరగంటసేపు నానితే ఏ బజ్జీలైనా చాలాబాగా వస్తాయి )

నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ ముక్కను పిండిలో
ముంచి నూనెలో వేసి ఎర్రగావేయించాలి .
వేడి వేడిగా సాస్ నంజుకుని తింటే వావ్...
ఆ..హా..ఏమి..రుచీ...

అటుకుల ఉప్మా

కావలసినవి !!!

గట్టి అటుకులు..........2 కప్పులు
ఆనియన్.............1
పచ్చిమిర్చి...............2
ఎండుమిర్చి..............2
ఆవాలు..................1/4 టేబల్‌స్పూన్
జీలకర్ర...................1/4 టేబల్‌స్పూన్
మినప్పప్పు.............1 టేబల్‌స్పూన్స్
శనగపప్పు..............1 టేబల్‌స్పూన్
కరివేపాకు...............2 రెబ్బలు
కొత్తిమిర................2 టేబల్‌స్పూన్స్
నూనె..................3 టేబల్‌స్పూన్స్
పచ్చి కొబ్బరి తురుము...3 టేబల్‌స్పూన్స్
ఉప్పు రుచికి తగినంత

చేసే విధానం !!!
ముందు అటుకులను నీళ్ళలో బాగా కడిగి నీళ్ళన్నీపిండేసి ఉంచండి

గట్టి అటుకులు ఐతేనే బాగుంటుంది.

మూకుడులో నూనె వేడి చేసి ఎండుమిర్చి,పోపు సామాను వేసి కొద్దిగా వేపి పసుపు,
తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి.

నీళ్ళు పిండి పెట్టుకొన్న అటుకులను ఈ పోపులో వేసి తగినంత ఉప్పు వేసి
బాగా కలియబెట్టి మూతపెట్టాలి.

రెండు నిమిషాల తర్వాత కొత్తిమిర,కొబ్బరి తురుము వేసి దించేయండి

వేడి వేడి గా తింటే ...ఆ..హా..ఏమి..రుచీ..ఆహా..

వెజి సలాడ్

వెజి సలాడ్

కావలసినవి::

లేత మొక్కజొన్నలు....2 కప్పులు
తురిమిన క్యారట్......1/2 కప్పు
క్యాప్సికం ముక్కలు....1/2 కప్పు
కీరదోస ముక్కలు.....1/2 కప్పు
టోమాటో...........1/2 కప్పు
క్యాబేజ్............1/2 కప్పు
తరిగిన పచ్చిమిర్చి.....2
కరివేపాకు...........1 రెబ్బ
నిమ్మరసం...........1 స్పూను
నూనె..............1 స్పూను
ఉప్పు తగినంత

చేసే విధానం::

మొక్కజొన్నలు బాగా కడిగి అందులోకి క్యారెట్ తురుము..క్యాప్సికం ముక్కలు..దోసకాయ ,టోమాటో ముక్కలూ,
క్యాబేజ్ , పచ్చిమిర్చిముక్కలు, అన్ని సన్నకా తరుక్కోని తగినంత ఉప్పు నిమ్మరసం చేర్చి బాగా కలపాలి.

మూకుడులో నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి తాళింపు
సామాగ్రి అంతా వెయ్యాలి.

ఈ సలాడులో తాలింపు చేర్చి కొత్తిమిరతో అలంకరించి
ఆ తరువాత సర్ చేయండీ....

Saturday, June 02, 2007

అల్లం పచ్చడి

కావలసినవి::

శనగపప్పు.............2 టేబల్‌స్పూన్స్
మినపప్పు.............2 టేబల్‌స్పూన్స్
ధనియాలు.............1 టేబల్‌స్పూన్
జీలకర్ర................1 టేబల్‌స్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయంత
అల్లం.................3 ఇంచ్ పిఎచె
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి..........10
బెల్లం................చిన్న నిమ్మకాయంత
నునె................3 టేబల్‌స్పూన్స్

చేసే విధానం::

మూకుడు లో నునె వేసి అందులో శనగపప్పు..మినపప్పు
దనియాలు..జీలకర్ర..పచ్చిమిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లం వేసి కొంచెం వేయించి పెట్టుకోండి.

అల్లం వేయించిన సామాగ్రి అంతా చల్లరబెట్టి
అందులో చింతపండు..ఉప్పు..బెల్లం వేసి
అందులొ కొంచెం నిళ్ళూ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.

ఘుమ ఘుమ లాడే అల్లం పచ్చడి రెడి
ఒంటికి ఈ పచ్చడి చాలా మంచిది...

వెజిటబుల్ సమోసాకావలసినవి ::--

సమోసా తయారి ::-
మైదా --------------------- 1 cup
నెయ్యి --------------------- 1/2 cup
బేకింగ్ పౌడర్ --------------- 1/4 tbl spoon
ఉప్పు - తగినంత
నీళ్ళు

కూర తయారికి ::--
బంగాలదుంపలు - 3( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).
ఉలిపాయాలు - 1 ( ముక్కలు)
పచ్చి బఠానీలు ------------------------1 cup
పచ్చిమిరపకాయలు --------------------2
కొత్తిమెర చాప్ చేసింది------------------- 1 టేబల్ స్పూన్
నిమ్మ జూసు ---------------------------- 2 tbl spoon
పసుపు -------------------------------- 1/2 tbl spoon
గరం మసాల ---------------------------- 1/2 tbl spoon
కారం ----------------------------------- 1 tbl spoon
ఆవాలు --------------------------------- 2 tbl spoons
అల్లం వెల్లుల్లి పేస్టు----------------------- - 1 tbl spoon
ఉప్పు - తగినంత
నునె - వేయించడానికి
కరివేపాకు -------------------------------- 2 రెబ్బలు

తయారు చేసే విధానం ::--

మైదా లో ఉప్పు,బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి.
కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి.
కలిపిన పిండి ని 30 నిమషాలు పాటు తడిబట్టతో పెట్టి వుంచాలి.

కూర విధానం ::--

ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి.
అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి.
అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
ఇప్పుడు పచ్చిబఠానిలు,అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల,కొత్తిమెర,కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
కొంచెం వేయించాక అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.
అందులో నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.
కలిపేసి పెట్టుకున్న మైదా ని మళ్ళీ బాగా కలుపుకోవాలి.
చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి
వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.
అంచులు గట్టిగ వత్తలి. వాటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించాలి.
సమొసా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.
ఆలస్యం దేనికీ ? మీరూ సమోసా చేసేందుకు తయార్ కాండి :)