Saturday, November 11, 2006

కోకోనట్ స్వీట్

ఒక టెంకాయ కోరిన కోకోనట్ ( తెల్లగా వుండాలి ) ,
1 మిల్క్ మేడ్ ,
ఇలాచి పోడి కొద్దిగా ,
జీడి పప్పు ( చిన్న చిన్న ముక్కలు చేసినవి ) ,
తీపు ఎక్కువగా కావాలంటే పంచదార సగం కప్పు .

చేసే విధానం !!!!!

ముందుగా దళసరి మూకుడు లో 1/4 నీళ్ళు పోసి ( చెక్కర కరిగెందుకు మాత్రమే నీళ్ళు పోయాలి ఎక్కువ పోయకూడదు ) . అందులో కొకో నట్ తురుము వేసి పచ్చివాసన పోయెంత వరకు వేయించాలి . 10 నిముషాలు వేయించి అందులో మిల్క్ మేడ్ , ఇలాచి పొడి , వేయించిన జీడి పప్పు వేసి అడుగంటకుండగా కలుపుతూ ఉప్మ మాదిరిగా soft గా మౄదువుగా వచ్చెంత వరకు కలిపి దించండి చేతికి కొద్దిగ నెయ్యి రాసుకొని కోకోనట్ ని గ్రుండటి వుంటలుగా చేసుకొని సర్వ్ చేయండి . పాలుకోవ టేష్టు వుండే ఈ స్వీట్ భలే రుచి . మరి మీరూ ప్రిపేర్ కాండి :)

Monday, November 06, 2006

చేగోడీలు

కావలసినవి !!!

బియ్యపు పిండి -
3 గ్లాసులుమైదా -
1 గ్లాసునెయ్యి -
50 గ్రావాము -
1/2 టీస్పూనుపసుపు -
1/4 టీస్పూనుకారంపొడి -
1/2 టీస్పూనుఉప్పు -
తగినంతనూనె -
వేయించడానికి సరిపడినంత

తయారుచేసే విధానం !!!

ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించవలెను.ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై మూతపెట్టవలెను.
పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను. కరకరలాడే కమ్మని చేగోడీలు తయార్ మీరూ try చేస్తారా ?

Sunday, November 05, 2006

సేమ్యా బోండా

కావలసినవి !!!!

సేమ్యా 1/4 కేజి ,
క్యాబేజీ 100 కేజి ,
క్యారట్ 50 గ్రాం ,
మంచినూనె 1/4 కేజి ,
నెయ్యి లేదా డాల్డా 50 గ్రాం ,
శనగపిండి 1 కప్పు ,
బియ్యం పిండి 1 కప్పు ,
ఉల్లిపాయలు 1 ,
పచ్చిమిర్చి 4 ,
అల్లం అంగుళం ముక్క ,
కారం 1 టీ స్పూన్ ,
ఉప్పు తగినంత ,
పసుపు 1/2 టీ స్పూన్ ,
వంట సోడా చిటికెడు ,
కరివేపాకు ఒక రెబ్బ ,
ఆవాలు 1/4 టీ స్పూన్ ,
జీలకర్ర 1/4 టీ స్పూ
న్జీడిపప్పు 8 .

చేసే విధానం !!!!

ముందుగా సేమ్యాను నేతిలో కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పుగిన్నెలో 4 స్పూనుల నూనె వేసి వేడి చెసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,వేసి ఆతర్వాత తరిగిపెట్టుకున్న ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీవేగాక తరిగిన క్యాబేజీ,తురిమిన క్యారట్, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి.కొద్దిగా మగ్గిన తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరిగించాలి.నీళ్ళు మరుగుతుండగావేయించిన సేమ్యాను వేసి ఉండలు కట్టకుండా దగ్గరకు వచ్చేవరకు కలుపుతూఉండాలి. దింపేముందు జీడిపప్పు,సన్నగా తరిగిన కొత్తిమిర వేసి కలపాలి.శనగపిండి,బియ్యంపిండి మిశ్రమంలో తగింత ఉప్పు,కారం పొడి, వంటసోడా నీళ్ళుపోసి బజ్జీల పిండిలా కలపాలి.పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి.సేమ్యా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసిపిండిలో ముంచి నూనెలో వేసిఎర్రగా వచ్చేలా వేయించి తీయాలి. ఇవి వేడి మీద తింటే చాలా బావుంటాయి

బియ్యపు చెక్కలు + నిప్పట్లు
















కావలసినవి::

బియ్యపు పిండి..... 1/2 కేజి
జీలకర్ర............. 1/2 స్పూను
కారం పొడి......... 1/2 స్పూను
వేరుశనక్కాయలు......1 చిన్న గ్లాసు
నువ్వులు...........2 టేబల్ స్పూన్స్
ఉప్పు తగినంత..............
కరిగించిన నెయ్యి లేదాడాల్డ....50 గ్రాం
.

చేసేవిధానము::

ముందుగా పిండిలో ఉప్పు,కారం పొడి( ఎండుమెరపకాయలు ఇంట్లో గ్రైండర్ లో తిప్పితే బాగుంటుంది ) , జీలకర్ర,కరిగించిననెయ్యి,వేరుశనక్కాయలు(పల్లీలు) గ్రైండర్లో ఒక్కతిప్పు తిప్పి అదికూడపిండిలో వేసి బాగా కలిపి ఒక గ్లాసు మరిగించిన నీరు పోసిమొత్తం బాగ కలిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత పిండిని బాగ కలిపి చిన్న చిన్నఉండలుగా చేసుకొని పాలిథిన్ కవరుపై నూనె రాసి పల్చగా వత్తి వేడి వేడి నూనెలోఎర్రగా వేయించిబంగారు రంగు వచ్చేవరకు వేయించి తేసి ప్లేటులో ఉంచండి.
చల్లారాక టైట్ గా ఉన్న డబ్బాలో వేసి ఉంచండి.ఇవి చాల రోజులు నిలవ ఉంటాయి...ఈ రెసిపి మీకు నచ్చింటే ఒక్క కామెంట్....ఆహా...ఏమిరుచీ.....

తీపి గవ్వలు


కావలసినవి::

మైదా.....................250 గ్రాం
నెయ్యి లేదా డాల్డా...50 గ్రాం
ఉప్పు చిటికెడు...........
నూనె.....................250 గ్రాం
చక్కెర....................250గ్రాం
యాలకులు............5

చేయవలసిన విధానం::

ముందుగా చక్కెరలో సగం గ్లాసు నీళ్ళు పోసి తీగ పాకంలా చేసి అందులో యాలకుల పొడికలిపి పెట్టుకోవాలి.
మైదాపిండిలో కాచిన నెయ్యి కొద్దిగా ఉప్పు వేసి కలిపి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.

గవ్వల పీటకు నూనె రాసి పెట్టుకోండి.

మైదాపిండిని రెండుచేతులతో బాగా మర్ధన చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ మైదా ముద్దను గవ్వల పీటపై బొటనవేలితో వత్తుతూసాగదీయాలి.

దానిని మెల్లిగా చుట్టెస్తే గవ్వలా ఉంటుంది.అలా అన్ని గవ్వలా చేసిపెట్టుకుని వేడి నూనెలో నెమ్మదిగా వేయించాలి.

గవ్వలు వేడిమీద ఉండగానే పాకంలోవేయాలి.

పాకం పీల్చుకున్న తర్వాత తీసి విడివిడిగా ఆరబెట్టి డబ్బాలో వేసిపెట్టుకోవాలి.మరి మీకు నచ్చితే నాకో....తెలుసుకదా :)

బ్రెడ్ మంచూరియా



కావలసినవి::

బ్రెడ్........................6 స్లైసులు
మైదా.....................1/2 కప్పు
కార్న్ ఫ్లోర్................1 టేబల్ స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద......2 టీస్పూన్స్
మిరియాల పొడి.........1 టీస్ పూన్స్
కారం పొడి..............1/2 టీస్ పూన్స్
ఉప్పు తగినంత.......................
సోయా సాస్............1/2 టీ స్పూన్స్
అజినొమొటో చిటికెడు....................
పచ్చిమిర్చి............1
ఉల్లి పొరక............1/4 కప్పు

చేసే విధానం::

బ్రెడ్ అంచులు తీసేయాలి. ఒక్కో స్లైసును నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోండి.

ఇప్పుడు మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,సగం అల్లం వెల్లుల్లి ముద్ద,కారం పొడి కలిపి
కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టాలి.

ఈ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా,మరీ పలుచగా కాకుండా ఉండాలి.

పొయ్యి మీద నూనె వేడి చేసి ఈ బ్రెడ్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.

అలా అన్ని ముక్కలు ఎర్రగా చేసి పక్కన పెట్టుకోండి.

తర్వాత ఒక బాణలిలో రెండు స్పూనుల నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు అర కప్పు నీళ్ళలో 1 స్పూను కార్న్ ఫ్లోర్,అజినొమొటొ,సొయా సాస్,మిరియాల పొడి వేసి కలిపి పోపులో వేసి
మరిగించాలి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి ఓ నిమిషం ఉడికించి దించేయండి.

ఈ ఐటం పొడి పొడిగా కావాలనుకుంటే కారంఫ్లోర్ మిశ్రమం వేయకూడదు.
అజినొమొటొ, సొయాసాస్,మిరియాల పొడి వేసి బాగ వేయించి బ్రెడ్ ముక్కలు వేసి
కలిపి ఓ నిమిషం తర్వాత దించేయాలి...

వేడి వేడిగా సర్ చేసారంటే ఆ..హా..ఏమిరుచీ...మీకు నచ్చితే నాకో కామెంట్..రాయండి

బ్రెడ్ ఉప్మా


కావలసినవి::

బ్రెడ్.........................8 స్లైసులు
ఉల్లిపాయలు............1
టొమాటో................2
పచ్చిమిర్చి.............3
ఆవాలు.................1/4 టీస్పూన్
జీలకర్ర..................1/4 టీస్పూన్
మినప్పప్పు..........1/4 తీస్పూన్
కరివేపాకు.............1 టీస్పూన్
పసుపు..............--1/4 టీస్పూన్
ఉప్పు తగినంత..................
నూనె...................2 టీస్పూన్స్


చేసే విధానం::

బ్రెడ్ ను చిన్న చదరపు ముక్కలుగ చేసి పెట్టుకోవాలి.కావాలంటె
ఈ ముక్కలను నూనెలో కాని టోస్టర్లో కాని ఎర్రగా కాల్చి పెట్టుకోవచ్చు.

ఆనియన్,పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,కరివేపాకు వేసి కొద్దిగా వేపి తరిగిన ఆనియన్
పచ్చిమిర్చి,పసుపు వేసి వేయించాలి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్ని
బాగా కలిపి మూత పెట్టాలి.ఓ మూడు నిమిషాల తర్వాత కొత్తిమిర చల్లి దించేయండి.
ఇది చాల తొందరగా అయ్యే టిఫిన్.....మీరూ Try చేసి చూడండి..:)

Friday, November 03, 2006

సందీప్

కావలసినవి::

1/2..... గ్లాసు పుల్లటి పెరుగు
1....... గ్లాసు మైదాపిండి
2....... గ్లాసుల నెయ్యి
2....... గ్లాసుల పంచదార


చేసే విధానము::

పుల్లటి పెరుగు మైదాపిండి లో పోసి పూరీ పిండిలా చేయాలి.( నీళ్ళు తగలకూడదు )

ఎంత నెయ్యి పడితే అంతా వేసి ముద్దలా చేయాలి .

1 గంట నానబెట్టి బాగా మర్ధించి దళసరి చపాతీలు వత్తాలి.

చపాతి వత్తగానే పైన నెయ్యి రాసి మడిచి మళ్ళా వత్తాలి అలా 4 5 సార్లు వత్తాక

చపాతి మీద గుండ్రని మూత లాంటి దానితో అదిమి బిళ్ళలుగా కట్ చేయాలి.

నెయ్యి కాచిఒక్కో బిళ్ళనీ గోల్డు కలర్ వచ్చెలా వేయించి తీసి ఓ పెద్ద పళ్ళెం లో పెట్టాలి.

చక్కర లో నీళ్ళు పోసి ముదరుపాకం పట్టి ఆ పాకాన్నిఒక్కో బిళ్ళమీద చెంచాతో వెయ్యాలి.

అరగంట ఆరిన తర్వాత పాకం పొరల్లోకి పోయి యమ రుచిగా ఉంటాయి...మీరు రెడినా...

సజ్జ బూరెలు


కావలసినవి::

మైదా................250 గ్రా
బోంబాయ్ రవ..........1 కప్పు
నీళ్ళు...............2 కప్పులు
పంచదార............1 కప్పు
డాల్డా..............50 గ్రా
ఇలాచీలు............3
జీడిపప్పు...........20 గ్రా
పచ్చ కర్పూరం చిటికెడు.......
నూనె..............1/4 కిలో

చేసే విధానం::

మూకుడు లో డాల్డా వేసి వేడి చేసి .. బొంబాయ్ రవ దోరగా వేయించి...

వేరే మూకుడులో నీళ్ళు రెండుకప్పులు వేడిచేసి మరిగిన తరువాత రవ వేసి ఉడికించి..మిగిలిన డాల్డాకూడ వేసి

కలుపుతూ ఉండకట్టకుండతిప్పుతూ ఉండాలి. చక్కర, ఇలాచి, వేయించిన జీడిపప్పు, కర్పూరం, వేసి

మళ్ళీ కలిపి ముద్ద అయ్యేంత వరకు ఉడికించి నెయ్యిపైకి తేలిన తరువాత..ఒక డిష్ లో పెట్టవలెను.

మైదాపిండిలో చిటికెడు ఉప్పు కలిపి ఒక బేసిన్లోకి తీసి తగినన్ని నీళ్ళుపోసి పిండి తడిపిపెట్టండి.

తడిపిన పిండిని ఒక గంట నానబెట్టి..డాల్డా..లేక నూనె..వేసి పూరి ఉండలాగ చేసుకొని పీటపై వత్తి..

దానిలో నిమ్మకాయంత చేసిన హల్వా పెట్టిమూసి గుండ్రంగా చేతితో వత్తి..పూరీల మదిరిగా చేసుకొని

కాగిన నూనెలో దోరగా వేయించి తీసి పళ్ళెన్లో పెట్టి 5 నిముషాల తరువాత సర్చేయండి..ఆహా ఏమిరుచీ

మరి మీరూ Try చేస్తారా......

Thursday, November 02, 2006

బాదూషా



మైద.... 1/2 కిలో ,
డాల్డా.... 100 గ్రా( కరిగించినది ) ,
షోడా.... 1/4 టీ స్పూన్పె ,
పెరుగు....1 గరిటెడు ,
పంచదార.. 1/2 కిలో.

!!!!! చేసే విధానం !!!!!

మైదాలో కరిగించిన డాల్డా వేసి ఒక బేసిన్ లో షోడా వేసి ,పెరుగు కలిపి అందులోనే..ఈ మైదా..షోడా..పెరుగు..అన్నీ కలిపి
కొంచం నీళ్ళు చల్లి ముద్ద చేయండి .

దీన్ని చిన్న చిన్న గుండ్రంగా ఉండలుగా చేసుకొని , రెండు చేతుల మద్య నొక్కుతూ గుండ్రంగా తిప్పాలి ,
పొరలు పొరలుగా గుంటవున్న ఆకారంగా వస్తుంది .

ష్టవ్ సన్నని సెగలో పెట్టి డాల్డా వేడి చేసి అరగంటసేపు బాదుషాను వేయించి , తీగపాకంలో వేసి ఆరిన తరువాత సర్వ్ చేస్తే భలే రుచీగా వుంటాయి .
ఆహా ఏమిరుచీ అని మీరే అంతారు :)

!!!!!తీగ పాకం చేసేవిధానం !!!!!

ఒక గ్లాసు చక్కరకి , ఒక గ్లాసు నీళ్ళు, పెద్దదట్టమైన గిన్నెలో పంచదార , నీళ్ళు కలిపి ష్టవ్ పై వుంచి సన్నని సెగలో
పాకాన్ని అడుగంటకుండగా గరిటతో కలుపుతూ వుండాలి ,

గరిటతో పాకం నీళ్ళల్లో పోసి చూస్తే తీగలా పడాలి నీళ్ళు అంట కూడదు
అందులో బాదూషలు వేసి సర్వ్ చేయ్యాలి .ఇప్పుడు తెలుసుకొన్నారా తీగ పాకం ఎలాచేయాలో...నచితే ఒక్క మెస్సేజి ఇవ్వండీ