Saturday, August 18, 2007

పానీ పూరీ ---paanee poorii

paanee pUrii
పూరి చేసే ఐటమ్స్ :::

మైద.............1 కప్పు
రవ..............1/4 కప్పు
కుక్కింగ్ సోడ....3 చిటికెలు
ఉద్దిపప్పు........2 టెబల్ స్పూన్స్
రుచికి తగినంత ఉప్పు.

పూరి చేసే విధానం !!

ఉద్దిపప్పు దోరగా వేయించి పౌడర్ చేసి వుంచండి .
రవ , మైదా , సోడా , ఉద్దిపొడి , ఉప్పు. అన్నీ చల్లటి నీళ్ళుపోసి గట్టిగా పూరీ పిండిలా కలిపి , తడి ఆరకుండగా తడి గుడ్డవేసి 2 గంటలసేపు నానపెట్టాలి .
తరువాత చిన్న చిన్న పూరీలుగా చేసి నూనెలో వేయించు పెట్టుకొండి .

పానీ చేసే విధానం !!!

చింతపండు రసంలో జిలకర వేయించి పౌడర్ చేసి పానీలో కలపండి .
దానితో పాటు పుదిన , కొతమిర , గ్రీన్ చిల్లీ , అన్నీకలిపి గ్రైండ్ చేసి పానీలో కలపంది .

ఫోటాటో కూర:
కావలసినవి !!!

పొటాటో 1/2 కిలో
సన్నగా తరిగిన 2 ఆనియన్స్
పచ్చ బటాని , కార్న్ , 2 పిడికిళ్ళు .

cheese 2 స్పూన్స్
గరం మసాల పౌడర్ 3స్పూన్స్

కొత్తమిర , ఉప్పు , పసుపు . తగినంత.

కూర చేసే విధానం !!!

పొటాటో కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చాక దింపి చల్లారిన తరువాత పొట్టుతీసి మెత్తగా చెసి వుంచుకోవాలి .

తరువాత పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి దోరగా వేయించి , అందులో గరం మసాల , ఉప్పు , పసుపు , రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ , వేసి పచ్చిబటానీలు , కార్న్ అన్నీ అందులో వేసి బాగా వుడికించి కాస్త బట్టర్ వేసి సన్నటి సెగపై 5 నిముషా అలాగే వుంచి కోత్తమీర వేసి ష్టావ్ ఆఫ్ చేయండి.

పూరి గిన్నెలా hole చేసి అందులో పొటాటోకూర పెట్టి దానిపైపానీ వేసి , పచ్చి ఆనియన్,వేసి తింటే ........వావ్....యమ రుచి :)
మీకు కావాలంటే సన్నగా తరిగిన ఆనియన్స్ . కుకుంబర్ , కారెట్ , టోమాటో slices చేసి , plate లో decorate చేసి పూరితో పాటు ఇవీ తింటే మరీ మరీ రుచి .:)
మరి మీరు రెడినా ???