Monday, May 30, 2011
గులాబ్‌జామున్ ( gulab jamun )
కావలసినవి::----
( గులాబ్‌జామున్ MTR powder )
గులాబ్‌జామున్-------- 2 కప్పులు
చల్లటి పాలు----------- 1/2 కప్పు
చక్కర---------------- 2 కప్పు
నీళ్ళు----------------- 3 కప్పులు
నెయ్యి---------------- 200 గ్రా
ఏలక్కులపొడి--------- 1 టీ స్పూన్
చేసేవిధానం::---
ముందు గులాబ్‌జామున్ పౌడర్ని చల్లటి పాలతో
గట్టిగా కలిపి బాగా kneading చేయాలి.
చేసిన తరువాత ఒక అరగంట నానేసి ఉంచండి.
తరువాత మీరు పిండి నానెంతలో చక్కరపాకం చేసి
ఉంచుకోండి.
చక్కర ను నీళ్ళల్లో కలిపి చక్కర కరిగెంత వరకు నీళ్ళను మరగనివ్వాలి.
పది నిముషాలు పాటు మరగ నివ్వాలి. ఈ పాకం వేడి గా ఉండేలా చూసుకోండి.
ఇప్పుడు నానిన గులాబ్ జామున్ పిండిని చిన్న చిన్న balls లా
చేసుకొని పక్కన ష్టవ్ పై మూకుడు ఉంచి అందులో నెయ్యివేసి
నెయ్యి కరిగి వేడి అయిన తరువాత అందులో ఈ గులాబ్ జామున్ బాల్స్ ని
ఒక్కొక్కటిగా వేస్తూ దోరగా వేయించి వేగిన తరువాత వాటిని
ఈ చేసిపెట్టుకొన్న పాకంలో వేసి 15 నిముషాలు నాననివ్వండి
ఇప్పుడు చూసారా గులాబ్ జామున్స్ ఎలా వున్నాయో ??!!!!
మరి మీరూ తయారా?
మజ్జిగ పులుసు (Majjiga Pulusu)
దోసకాయ..బెండకాయ..సీమవంకాయ..సొర్రకాయ(అనపకాయ)
పొట్లకాయ..ఉద్దిపప్పు వడలు.. బచ్చలికూర..ఇలా మనకు నచ్చిన
కాయగూరలతో మజ్జిగ పులుసు చేసుకోవచ్చు
(చనగపప్పుకు బదులు కందిపప్పు )
కావలసిన పదార్థాలు:::
దోసకాయలు ---- 2
నానేసిన కందిపప్పు ----- 1/2 కప్పు
చిక్కటి పెరుగు ----- 2 కప్పులు
అల్లం తురుము ----- 1 టీ స్పూన్
పచ్చిమిర్చి ----- 3
జిలకర్ర ------ 1/2 స్పూన్
ఆవాలు ----- 1 స్పూన్
పచ్చి కొబ్బర కోరు -- 2 టేబల్ స్పూన్స్
కరివేపాకు 2 రెబ్బలు
పసుపు---ఉప్పు---రుచికి తగినట్లు
నూనె 2 టేబల్ స్పూన్స్
పోపు గింజలు --- ఆవాలు---జిలకర్ర---ఎండుమిర్చి---ఇంగువ.
చేసేవిధానము::
ముందు దోసకాయలు పొట్టు పీల్చేసి మీకు కావలసిన సైజులో
ముక్కలుగా కట్‌చేసి ష్టవ్ పై మందపాటి గిన్నె ఉంచి
అందులో ఒక స్పూన్ నూనె వేసి ఈ తరిగిన దోసకాయముక్కల్ని
అందులో వేసి కొద్దిగా ఉప్పువేసి(మజ్జిగలో మళ్ళి వేస్తారు కాబట్టి
చూసుకొని ఉప్పు వేసుకోండి)ఉడికించి పెట్టుకోండి.
పెరుగునులో ఒక గ్లాసు నీళ్ళు వేసి మజ్జిగలా చిలగొట్టుకొని
పసుపు..ఉప్పు..వేసి ఉంచండి.
నానిన కంది పప్పు అల్లం..జిలకర్ర..ఆవాలు..
పచ్చికొబ్బర..కొత్తమీర..
అన్నీ గ్రైండ్ చేసుకొని.. ఆ మసాలను మజ్జిగలో కలిపి
ఉడికిన దోసకాయ ముక్కలు..కరివేపాకు..వేసి ఒక్క ఉడుకు
ఉడికించండి.
తరువాత..ష్టవ్ పై చిన్న మూకుడు ఉంచి..అందులో
ఒక్క స్పూన్ నూనె వేసి ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి,ఇంగువ వేసి
మజ్జిగ పులుసులో కలిపి కొత్తమీర వేసి మూతమూయండి
వేడి వేడి అన్నానికి మజ్జిగపులుసు
అప్పడాలతో నంజుకొనితింటే..ఆహా..భలే రుచి :)
ఇలాగే ఉద్దిపప్పు వదలతోకూడ వడలు చేసి
దోసకాయకు బదులు వడలు వేసి 20 నిముషాలు
నానేసిన తరువాత తింటే చాలాబాగుంటాయి
Subscribe to:
Posts (Atom)