Sunday, May 05, 2013

సీమ వంకాయ పచ్చడి





























కావలసినవి:

సీమ వంకాయ:::  1
నువ్వులు:::::::::  2 టేబల్‌స్పూన్స్
చింతపండు::::::::  చిన్ననిమ్మకాయ సైజుకన్నాతక్కువ 
పచ్చిమిర్చి::::::::  5
ఉప్పు,పసుపు::::  తగినంత
బెల్లం:::::::::::::::  కొద్దిగ 
నూనె:::::::::::::::  4 టేబల్‌స్పూన్స్ 


































































తాలింపుకు కావలసినవి 

శనగపప్పు::::::  1 టీస్పూన్ 
మినపప్పు::::::  1 టీస్పూన్
జిలకర్ర:::::::::::  1/3 టీస్పూన్
ఆవాలు::::::::::  1 టీస్పూన్
ఎండుమిర్చి:::::   టీస్పూన్ 
ఇంగువ::::::::::   చిటికెడు


పచ్చడి చేసే విధం:::



















ముందు సీమ వంకాయను కడిగి మధ్యగా కోసి,

అందులో ఉన్న గింజను తీసి,పొట్టుతో పాటు ముక్కలు చేసుకొండి.

ష్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి అయినాక కొద్దిగ నూనె వేసి 

సీమవంకాయ ముక్కల్ని అందులో వేసి పచ్చిమిర్చి కూడా వేసి

లైట్ గా వేయించి ఒక ప్లేట్ లోకి తీసి ఉంచండి . 

(అంటే సగం పచ్చిగాను...సగం ఉడికుండాలి పచ్చడి మాంచి రుచి వస్తుంది)

అదే పాన్లో నువ్వులు దోరగా వేయించి దాన్ని ఈ సీమవంకాయ ప్లేట్ లో వేయండి.

అదే పాన్లో రెండు చుక్కలు నూనె వేసి చింతపండు కాస్త వేయించండి. 

వేయించినవన్నీ మిక్సి కి వేసి అందులోనే బెల్లం పసుపు,ఉప్పు,చింతపండు,

వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో తీసి ఉంచండి.  




















మళ్ళి పాన్లో నూనె వేసి నూనె కాగిన తరువాత తాలింపు గింజలన్నీ వేసి

చివర్లో ఎండుమిర్చి,ఇంగువ వేసి ఈ పచ్చడికి తాలింపు పెట్టండి .

కమ్మటి సీమవంకాయ పచ్చడి రెడి :) 





















seema vankaaya pachchadi 

kaavalasinavi:

seema vankaaya:::   1
nuvvulu:::::::::::::::   2Taebal spoons
chintapandu::::::::::   chinnanimmakaaya saijukannaa takkuva 
pachchimirchi::::::::   5
uppu,pasupu::::::::::   taginanta
bellam::::::::::::::::::   koddiga 
noone:::::::::::::::::::   4 Taebalspoons 


taalimpuku kaavalasinavi:::  

Sanagapappu::::::::  1 Teespoon 
minapappu::::::::::::  1 Teespoon
jilakarra:::::::::::::::  1/3 Teespoon
Avaalu:::::::::::::::::  1 Teespoon
endumirchi::::::::::::  Teespoon
inguva::::::::::::::::::  chitikedu


pachchadi chaesae vidhamu:::


mundu seema vankaayanu kadigi madhyagaa kOsi,

andulO unna ginjanu teesi,pottu tO paaTu mukkalu chaesukondi.

Stove veliginchi paan petti vedi ayinaaka koddiga noone vaesi 

ee seemavankaaya mukkalni andulO vaesi pachchimirchi koodaa vaesi

lite gaa vaeyinchi oka plate lOki teesi unchandi . 

(ante sagam pachchigaanu...sagam udikundaali pachchadi maanchi ruchi vastundi)

adae paanlO nuvvulu dOragaa vaeyinchi daanni ee seemavankaaya plate lo vaeyandi.

adae paanlO rendu chukkalu noone vaesi chintapandu kaasta vaeyinchandi. 

vaeyinchinavannee grinder lo vaesi andulOnae bellam pasupu,uppu,chintapandu,

vaesi mettagaa grind chaesi oka ginnelO teesi unchandi.  

malli paan lO noone vaesi noone kaagina taruvaata taalimpu ginjalannee vesi

chivarlO endu mirchi,inguva vesi ee pachchadiki taalimpu pettandi.

kammati seemavankaaya pachchadi redi :)