Thursday, August 23, 2007

టోమాటో రైస్


కావలసినవి:::--

బాస్మతి రైస్-- ---- 2 cups(250 gms)
టొమాటోలు--- ---- 4
బఠాణిలు-- - ------1/2 cup(నానబెట్టి,వుడికించాలి)
బంగాలదుంప--- - 1
ఆనియన్స్------- 2 (సన్నగ పొడుగ్గ)
పచ్చిమిర్చి------ - 4
అల్లం వెల్లుల్లి పేస్టు ---- 1 1/2 tbl spoon
లవంగాలు ------------ 5
యాలకులు---------- - 3
బిర్యాని ఆకు ---------- 3
ఉప్పు - తగినంత
కొత్తిమెర
కొద్దిగ గరం మసాల పౌడర్ 

!! తయారు చేసే విధానం !!

1.కూకర్ లో నునె వేసి వేడి చేసి అది వేడి అయ్యాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు వేసి వేయించాలి.
2.ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

3.అది వేయించాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.టొమాటో ముక్కలు వేసి వేయించాలి.

4.దానిలో బఠాణిలు,బంగాలదుంప ముక్కలు వేసి కొంచెంసేపు వేయించి అందులో కొద్దిగ గరం మసాల పౌడర్  ఉప్పు వేసి కలపాలి.

5.ఇప్పుడు బియ్యం కడిగి అందులో వేసి కొంచెంసేపు వేయించి అందులో నీళ్ళు(ఒక కప్పు బియ్యం కి 1 1/2 లేదా 2 కప్పు నీళ్ళు)పోసి ఒక విసెల్ రానివ్వాలి.

6.అందులో కొత్తిమెర వేసి కలపాలి.ఇప్పుడు వేడి వేడి టొమటొ రైస్ నీ ఆరగించండి.