Friday, March 30, 2007

సేమ్యా పులిహోరా

!! కావలసినవి !!!

సేమ్యా 200 గ్రాములు
ఉల్లిపాయ 1
కరివేపాకు
పల్లీలు
జిలకర
నూనె తగినంత
నెయ్యి కొద్దిగా
ఎండు మిర్చి 6
ఆవాలు
మినపప్పు
నిమ్మకాయ 1

తయారు చేసే విధానం !!!!

పాన్ లో ఒక చెంచా నెయ్యివేసి సేమ్యాను దోరగా వేయించాలి . తరువాత నూనె వేసి తాలింపు సామాను

కరేపాకుతో, ఉలీముక్కలి ఎండుమిర్చి వేసి

అన్నీ ఎర్రగా వేయించాలి. పొయ్యి sim లో వుంచి ముందుగా వేయించి వుంచుకొన్న సేమ్యాను ఇందులో వేసి మరో నిముషానికి దించి పళ్ళెం లో పోసిపెట్టుకోవాలి . అదే పాన్ లో 2 గ్లాసుల నీళ్ళు పోసి సరిపదా ఉప్పు వేయాలి . నీళ్ళు మసలుతుండగా పళ్ళెం లో వేయించి వుంచిన సేమ్యానంతా వేసేయాలి . అది ఉడుకుతుండగా నిమ్మకాయ గింజలు లేకుండగ రసం పిండాలి . stove ని sim చేసి అట్లకాడతో కలుపుతూ 3 నిముషాలతరువాత దింపుకోవాలి ఘుమ ఘుమ లాడే పులిహోర తయార్........

No comments: