Friday, August 24, 2007

దొండకాయ వేపుడు

!!! కావలసినవి !!!

దొండకాయలు - 1/2 kg
ఆనియన్ - 1
ఆవాలు - 1 tbl spoon
పసుపు -చిటికెడు
కారం - 1/4 to 1/2 tbl spoon
కొబ్బరి పొడి - 1/4 to 1/2 tbl spoon
ఉప్పు -తగినంత
కరివేపాకు - 5
నునె - 3 to 4 tbl spoons

!!! తయారు చేసే విధానం!!!

1.దొండకాయల్ని సన్నగ పొడుగ్గ కట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు పాన్ లో నునె వేసి దానిలో ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.
3.అందులో ఆనియన్ ముక్కలు(సన్నగ పొడుగ్గ)వేసి వేయించాలి.
4.ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి కొంచెంవేయించాక
అందులో కారం, పసుపు, ఉప్పు వేసి దొండకాయ ఉడికేవరకు బాగా వేయించాలి.
5.ఇప్పుడు కొబ్బరి వేసి 5 నిమషాలు వేయించాలి.
6.దొండకాయ వేపుడునీ వేడి వేడి అన్నంతో ఆరగించండి:)
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

No comments: