Thursday, February 21, 2008
మిరపకాయ బజ్జీ
!! మిరపకాయ బజ్జీ !!
లావు మిరపకాయలు----250 gm
శనగపిండి------------- 250 gm
ఉప్పు తగినంత
కారం------------------ 1 tsp
గరం మసాలా----------- 1 tsp
ధనియాల పొడి---------- 2 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి
పుదీనా---------------- 1/2 cup
నువ్వులు-------------- 1/4 cup
పచ్చిమిర్చి------------- ౩
చింతపండు పులుసు----- 2 tbsp
మిరపకాయలను నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి.
మరిగే నీటిలో కొద్దిసేపు ఉంచి తేసేస్తే కారం తగ్గుతుంది.
నువ్వులు,పచ్చిమిర్చి, పుదీనా కాస్త వేయించి
చింతపండు పులుసు కలిపి మెత్తగ నూరి పెట్టుకుని
మిరపకాయలలో కూరి పక్కన పెట్టుకోవాలి.
శనగపిండిలో తగినంత ఉప్పు,కారం, గరమ్ మసాలా,
ధనియాలపొడి, వంట సోడా వేసి నీళ్ళు కలుపుతూ
గరిటజారుగా ఉండలు లేకుండా కలిపి అర గంట అలా ఉంచాలి.
మళ్ళీ కలిపి కూరి పెట్టుకున్న మిరపకాయలను
ఒక్కొక్కటిగా వేడి నూనెలో ఎర్రగా కాల్చి వేడి వేడిగా
టొమాటో సాస్ కాని ఆవకాయతో కాని తింటే
సూపర్‌గా ఉంటుంది.
కావాలాంటే మిరపకాయలలో కస్త వాము,చింతపండు
పులుసు,ఉప్పు,కొబ్బరిపొడి కలిపి రుబ్బి
మిరపకాయలలో కూరొచ్చు.. బంగాళదుంప కూర చేసి
అది కూడా మిరపకాయలలో కూరి
బజ్జీలు చేసుకోవచ్చు. అప్పుడు మిరపకాయలు చాలా లావుగా వస్తాయి
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
శక్తి గారు మీ బ్లాగు చాలా బాగుంది. మీ బ్లాగు లోకి ఎంటర్ అవుతూనే నోట్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి చుట్టూ ఉన్న తిండి పదార్ధాలను చూసి
బైదవే మిరపకాయ బజ్జి బొమ్మ చూస్తుంటేనే నోరూరిపోతున్నది.
O...thank you AndhraFolks
mari nOrUrinchE padaarthalatOnE kadaa mimmalni AkaTTukOvaali malli malli meeru vastunDaali :)
Post a Comment