Tuesday, March 17, 2009
గ్రీన్ రైస్ -- Green Rice
!! కావలసినవి !!
సన్నబియ్యం --250గ్రా
పచికొబ్బెర ఒక చిప్ప
కొత్తిమీర కట్టలు -- 3
పచ్చిమిర్చి -- 6
గ్రీన్ పీస్ -- 1/2 కప్పు
దాల్చిన చెక్క-- 4
ఏలకులు -- 4
తేజ్‌పత్రి -- 4
జీడిపప్పు -- 20
కిస్‌మిస్‌లు -- 10
ఉప్పు తగినంత
నెయ్యి,డాల్డ,ఎదైన--1 కప్పు
జీర -- 1 టేబల్ స్పూన్
!! చేసే విధానం !!
ముందుగా బియ్యం కడిగి వడకట్టాలి.
కొబ్బెర,మిర్చీ,కొత్తమిర,ఉప్పు,పసుపుతో
అన్నీ గ్రైండ్ చేసి పేష్ట్ చేసి వుంచవలెను.
సన్నటి సెగమీద కుక్కర్ వుంచి కొంచం నెయ్యి వేసి
అందులో జీర,తేజ్‌పత్రీ,దాల్చిన చెక్క,జీడిపప్పు,కిస్‌మిస్ వేసి కాస్త వేయించి
అందులోనే వడకట్టిన బియ్యం పోసి దోరగవేయించి
అందులో అరలీటరు నీరుపోసి గ్రీన్ పీస్,మిగతా నెయ్యి,తయారుగా వున్న పేష్ట్,వేసి సన్నటి సెగ మీద వుంచాలి.అన్నీ కలయబెట్టి 3 విజిల్స్ వచ్చక
ష్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తరువాత వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది.
ప్లాన్ గా చేసుకొంటే 20 నిముషాల పని అంతే~~~ మీ టిఫిన్ బాక్స్ రెడీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment