Friday, July 09, 2010

spinach(తోటాకు)..టోమాటో కూర



కావలసినవి::-

తోటకూర కట్ట------------------- 2

ఉడికించిన కందిపప్పు----------- 2 టేబల్ స్పూన్స్

ఆనియన్స్ --------------------- 2

వెల్లుల్లి రెబ్బలు ---------------- 5

టోమాటో ------------------- 3

ఎండుమిర్చి ----------------- 3

కరేపాకు -------------------- 2 రెబ్బలు

నెయ్యి --------------------- 1 టేబల్ స్పూన్

జీర..ఆవాలు ---------------- 1/2 టేబల్ స్పూన్

ఉప్పు...పసుపు...తగినంత


చేసే విధానం::--

ముందు తోటకూరను బాగా నీళ్ళతో కడిగి

తరిగి వుంచుకొండి.

ఉల్లిపాయలు...వెల్లుల్లి పాయలూ...టోమాటో కూడ

సన్నగా తరిగి వుంచుకొండి.

ఇప్పుడు మూకుడు ష్టవ్ పై వుంచి నెయ్యివేసి

నెయ్యి కాస్త వేడి అయిన తరువాత అందులో ఆవాలూ...జీర

ఎండుమిర్చి...వేసి అవి వేగాక అందులో కరేపాకు వేసి...

తరిగి వుంచుకొన్న ఆనియన్...వెల్లుల్లిపాయలు వేసి...కాస్త అటు ఇటు తిప్పుతూ

రెండు నిమిషాలు అలాగే వుంచి అందులో ... టోమాటో....తరిగిన ఆక్కూర

వేసి ఉప్పు...పసుపు...తగినంత వేసి...

అందులో ఉడికించిన కదిపప్పు 2 టేబల్ స్పూన్స్ వేసి బాగా కలిపి

మూతపెట్టి...10 నిముషాలు ష్టవ్ పై అట్టే వుంచండి

మధ్య మధ్యలో మాడకుండగా చూసుకొంటు

గరిటేతో కలుపుతూ 10నిముషాలకి ష్టవ్ కట్టేయడమే.....

ఘుమ ఘుమ లాడే ఆక్కూర టోమాటో కూర రెడి...

చపాతి...పుల్కాలు...వేడి వేడి ఆన్నానికీ...చాలా బాగుంటుంది

పిల్లలు మరీ ఇష్టపడి తింటున్నారంటే నమ్మండీ !!!! :)

మరి మీరూ
ఈ కూర చేసి బాగుంటే ఈ శక్తి గారికి ఒక మెస్సేజి వేయండి

1 comment:

vasu said...

hammya.vachesara?waiting for next post