Monday, May 30, 2011

గులాబ్‌జామున్ ( gulab jamun )






కావలసినవి::----

( గులాబ్‌జామున్ MTR powder )

గులాబ్‌జామున్-------- 2 కప్పులు

చల్లటి పాలు----------- 1/2 కప్పు

చక్కర---------------- 2 కప్పు

నీళ్ళు----------------- 3 కప్పులు

నెయ్యి---------------- 200 గ్రా

ఏలక్కులపొడి--------- 1 టీ స్పూన్

చేసేవిధానం::---




ముందు గులాబ్‌జామున్ పౌడర్ని చల్లటి పాలతో

గట్టిగా కలిపి బాగా kneading చేయాలి.

చేసిన తరువాత ఒక అరగంట నానేసి ఉంచండి.

తరువాత మీరు పిండి నానెంతలో చక్కరపాకం చేసి

ఉంచుకోండి.

చక్కర ను నీళ్ళల్లో కలిపి చక్కర కరిగెంత వరకు నీళ్ళను మరగనివ్వాలి.

పది నిముషాలు పాటు మరగ నివ్వాలి. ఈ పాకం వేడి గా ఉండేలా చూసుకోండి.







ఇప్పుడు నానిన గులాబ్ జామున్ పిండిని చిన్న చిన్న balls లా

చేసుకొని పక్కన ష్టవ్ పై మూకుడు ఉంచి అందులో నెయ్యివేసి

నెయ్యి కరిగి వేడి అయిన తరువాత అందులో ఈ గులాబ్ జామున్ బాల్స్ ని

ఒక్కొక్కటిగా వేస్తూ దోరగా వేయించి వేగిన తరువాత వాటిని

ఈ చేసిపెట్టుకొన్న పాకంలో వేసి 15 నిముషాలు నాననివ్వండి

ఇప్పుడు చూసారా గులాబ్ జామున్స్ ఎలా వున్నాయో ??!!!!





మరి మీరూ తయారా?

No comments: