Sunday, April 14, 2013

మామిడికాయ ఊరగాయ (Pickle - పికల్)





మామిడికాయలు:: 2
ఆవాలపొడి::::::::: 3 టేబల్‌స్పూన్
మెంతులపొడి:::::: 2 టేబల్‌స్పూన్
ఎండుకారంపొడి:::: 3 టేబల్‌స్పూన్
ఉప్పు::::::::::::::  3 టేబల్‌స్పూన్
పసుపు:::::::::::: 1/2 టీస్పూన్

పోపుకు కావలసినవి::

ఆవాలు:::::::::::  1 టీస్పూన్ 
ఎండుమిర్చి::::::: 4
వెల్లుల్లి దబ్బలు::: 6
ఇంగువ:::::: తగినంత

కరివేపాకు రెండు రెమ్మలు

ముందు మాంచి మామిడికాయలు తీసుకొని 
వాటిని బాగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని 
ఆ ముక్కలను ఎండలో ఓ గంట ఎండబెట్టాలి. 

ఆవాలు..మెంతులు, దోరగా నూనె వేయకుండగ వేయించుకొని
విడి విడిగా పొడి చేసి ఉంచుకొండి.

ముక్కలు చేసి ఉంచిన మామిడికాయల్లో
ఈ ఆవపొడి,మెంతిపొడి,ఎండుమిర్చిపొడి,
ఉప్పు పసుపు వేసి, అన్ని కలిసిపోయేలా బాగా కలిపి

అందులో పోపు వేసి..వేడి..వేడి అన్నానికి కలుపుకొని తింటే
వావ్ అనకుండ ఉండలేరు..మీరూ Try చేసి చూడండి      

{వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటేలేదు}  

No comments: