Tuesday, April 23, 2013

కొత్తిమీర పచ్చడి















కొత్తిమీర పచ్చడి

ఈ కొత్తిమీర పచ్చడి 20 రోజులు నిలువ వుంటుంది. 
  

కావలిసినవి:: 

కొత్తిమీర::::::::::::  1 కట్ట పెద్దది
ఎండుమిర్చి::::::::  12 
చింతపండుగుజ్జు:::  4 టేబల్‌స్పూన్స్

తాలింపు గింజలు::  

శనగ పప్పు::::::   2 టీస్పూన్ 
మినపపప్పు::::::  1 టీస్పూన్
ఆవాలు:::::::::::   1/3 టీస్పూన్ 
జీలకర్ర::::::::::::   1/ 3 టీస్పూన్
నూనె:::::::::::::   5 టేబల్‌స్పూన్స్ 
ఇంగువ:::::::::::  1/2టీస్పూన్
ఎండుమిర్చి::::::  
పసుపు..తగినంత
ఉప్పు..తగినంత 


పచ్చడి చేసే విధానము::

కొత్తిమీర  కడిగి చిల్లుల గిన్నలో  వేసి బాగా కడగాలి.   
తరువాత మిక్సీ జార్ లో , కొత్తిమీర ,
ఉప్పు..ఎండుమిర్చి..చింతపండు గుజ్జు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచండి.   

stove మీద పాన్ పెట్టి తగినంత నూనె వేసుకొని నూనె కాగినాక,
తాళింపు గింజలు ఎండుమిర్చి ఇంగువాతో పోపు పెట్టి,

ఈ గ్రైండ్ చేసి ఉంచిన పచ్చడి పోపు లో వేసి 5 నిముషాలు
సన్నటి మంటపై వేగనిచ్చి stove  కట్టేయండి.

టైట్ గా  మూత ఉన్న జార్ తీసుకొని అందులో వేసి ఉంచండి

20 రోజులవరకూ చెడిపోకుండా ఉంటుంది( నీళ్ళు తగలనివ్వకండి)

ఈ పచ్చడి వేడి వేడి అన్నానికిగాని..చపాతి,దోస,ఉప్మా..అన్నింటికీ బాగుంటుంది

మరి మీరు రెడినా? 


No comments: