Tuesday, September 23, 2014

వెజి సాగు
















హేయ్ Friends ఇవాళ నేను చేసే ఐటం "వెజి సాగూ
చెప్పాలంటే ఈ ఐటం కర్నాటక వాళ్ళు ఎక్కువగా చేసుకొంటారు

ఈ సాగు అన్ని వెజిటబల్స్ తో కలిపి చేయోచ్చు,ఒక్క వెజి తో కూడ చేయోచ్చు  

ఈ ఐటం చపాతికి ఇడ్లికి వేడి వేడి అన్నానికి
మహా రుచిగా ఉంటుంది
మరి ఎలా చేయాలో తెలుసు కొందామా 

 
సాగు కావలసినవి::-


క్యారేట్,  పొటాటో,  క్యాప్సికం,  కాలిఫ్లవర్   ఆనియన్ ఒకటి
సీమవంకాయబీన్స్-----వీటిలొ ఏవి ఉన్నా ఈ సాగు చేయొచ్చు
అన్ని వెజిటేబల్స్ కలిపి కూడ చేయోచ్చు 
నిమ్మకాయ......1
మసాల ఐటమ్స్::-  

ఆనియన్స్--------1

(Cinnamon)చెక్క---------------చిన్న ముక్క

(Clove)----మొగ్గ------------------4

పచ్చికొబ్బర తురుము----------------1/2--కప్

ధనియాలు-----------------------------1--టేబల్‌స్పూన్

(roasted channa)పుట్నాలు--------- 2--టేబల్‌స్పూన్  

పచ్చిమిర్చి------------------------------5

(Poppy Seeds) గసగసాలు------------3--టేబల్‌స్పూన్

చిన్న ముక్క అల్లం

కరేపాకు..కొత్తిమీర తగినంత

ఉప్పు పసుపు తగినంత

నూనె------------------------1/2---టేబల్‌స్పూన్



సాగు చేసే విధానం::-



ముందు వెజిటబల్స్ నీళ్ళతో బాగా కడిగి.  మీకు కావలసిన రీతిలో కట్‌చేసి
ఉంచంది.

ఆనియన్ కూడా కట్‌చేసి వుంచంది

ఇప్పుడు ష్టవ్ పై పన్ ఉంచి పన్ వేడెక్కిన తరువాత
అందులొ ఆఫ్ స్పూన్ నూనె వేసి మసాల ఐటమ్స్ అన్ని దోరగా వేయించు కొవాలి.

వేయించిన మసాలను గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

అదే పాన్ లో మళ్ళి కాస్త నూనె వేసి అందులో కాస్త జిలకర్ర వేసి
జిలకర్ర వేగాక అందులో ఆనియన్ ముక్కలు వేసి కాస్త దోరగా వేయించి
కట్ చేసి ఉంచిన కూరగాయలన్నీ అందులో వేసి ఒక గ్లాసు నీళ్ళుపోసి
ఉప్పు,పసుపు,వేసి మూత పెట్టి ఓ 10 నిముషాలు ఉడక నివ్వండి .

కాయ కాస్త మెత్తపడ్డక
ఈ మసాల ముద్దను ఉడికిన కాయగూరల్లో కలిపి ఓ 5 నిముషాలు మళ్ళి ఉడికించండి.

చివర్లో నిమ్మకాయ పిండితే మంచి రుచిగా ఉంటుంది 

బాగా ఉడికిన సాగుపై కొత్తమీర వేసి సర్వ్ చేయండి...

ఘుమ..ఘుమ..లాడే సాగు

చపాతికి..వేడి వేడి అన్నానికి నంజుకొని తింటే నా సామిరంగా..మళ్ళి చేయవూ అని 
అడక్కపోరు మీవాళ్ళు :)) 
  
మరి మీకు నే చేసిన సాగు నచ్చితే చిన్న కామెంట్ రాయండీ  

No comments: