పచ్చి కంది గింజల పుదిన రైస్
కావలసినవి::
రైస్-----------------2 కప్స్
పుదిన-------------1/2 కట్ట
శనగపప్పు--------2 టేబల్‌స్పూన్స్
మినపప్పు--------4 టేబల్‌స్పూన్స్
జిలకర్ర-------------1/2 టీస్పూన్
ఎండు మిర్చి-------20
నూనె--------------3 టేబల్‌స్పూన్స్
నెయ్యి-------------1/2 టేబల్‌స్పూన్
చెక్క----------------చిన్న ముక్క
{Cinnamon}
జీడిపప్పు------------10
{cashews nuts}
పచ్చి కంది గింజలు-------1/2 కప్
ఉప్పు పసుపు---తగినంత
తురిమిన కొబ్బెర------3 టేబల్‌స్పూన్స్
{ఎండుకొబ్బర కాని , పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు}
పోపు దినుసులు::
శనగపప్పు...ఉద్దిపప్పు..ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి..ఇంగువ..కరివేపాకు.
చేసే విధానం::
ముందు బియ్యం బాగా కడిగి కుక్కర్లో పెట్టి...అన్నం పొడి ఫొడి గా వండుకోవాలి.
పచ్చి కంది గింజలు కూడా కొద్దిగ ఉప్పు వేసి ఉడికించి ఉంచండి.
పుదిన ఆకు ఆకులు విడదీసి బాగా కడిగి నీళ్ళు లేకుండ గుడ్డతో ఆకులపై కాస్త అద్దండి
తడి ఉంటే పరవాలేదు కాని ,నీళ్ళు ఉండకూడదు.
ష్టవ్ పై మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి ఈ పుడిన వేసి 2 నిముషాలు వేయించి పక్కన పెట్టుకోండి.
మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించి ఉంచండి.
అదే మూకుడులో 1/2spoon నూనె వేసి,శనగ పప్పు...మినపప్పు...జిలకర్ర...ఎండుమిర్చి
కొబ్బర...చెక్క...అన్ని దోరగా వేయించుకొని...పుదిన ఆకుతోపాటు ఈ వేయించుకొన్న వన్ని
గ్రైండ్ చేసికొండి. {గ్రైండ్ చేసిన మసాల పొడి పొడిగా వుండాలి}
ఒక పెద్ద పళ్ళెంలో ఈ వేడి వేడి అన్నం వేసి, అందులో పసుపు...ఉప్పు...కొద్దిగ నూనె వేసి బాగా
కలపండి.
అదే రైస్ పై గ్రైండ్ చేసి ఉంచిన మసాల కూడ వేసి.. ఉడికిన కంది గింజలు వేసి మళ్ళి కలపండి
మసాల ఉంటలు లేకుండగా..చూసి కలపాలి . .
కలిపిన అన్నంపై తాలింపు {పోపు} వేసి కరేపాకు ఇంగువ వేసి వేయించి ఉంచిన జీడిపప్పును కూడ
కలిపి వడ్డన చేయండి ఘుమ ఘుమ లాడే పుదిన రైస్ రెడి.
{ పుదిన మసాల చేసుకొని fridge లో ఉంచితే నెలరోజుల పాటు వాడుకోవచ్చు.
పుదిన తడిలేకుండగా చూసుకోవాలి గ్రైండ్ చేసేముందు అంటే office వెళ్ళేవారికి ఈజిగా ఉంటుంది.}
మరి మీరు వండుకొని ఎలా ఉందో చిన్న కామెంట్ చేస్తే సంతోషం
మీ అందరి రిప్లే కొరకు ఎదురు చూస్తూ....
మీ పరాశక్తి
No comments:
Post a Comment